కృష్ణ

భక్తులతో పోటెత్తిన దుర్గా ఘాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, నవంబర్ 28: ఆఖరి కార్తీక సోమవారం రోజున పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు దుర్గాఘాట్‌కు పోటెత్తారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావటంతో వేకువ జామున 3గంటల నుండే మహిళలు తమ కుటుంబ సభ్యులతో వచ్చి భక్తితో పవిత్ర స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. తర్వాత పవిత్ర కృష్ణనదిలో అరటి దొప్పలో దీపం పెట్టి నదిలో విడిచి పెట్టారు. ట్రాఫిక్ పోలీసులు కెనాల్‌రోడ్ బొడ్డు బొమ్మ సెంటర్ వద్దనే ఉండి వాహనాలను దారి మళ్లించారు. వాహనాలన్నింటినీ బ్రాహ్మణ వీధిలోనికి మళ్లించి కేవలం స్నానాలు చేసే భక్తులను మాత్రమే ప్రకాశం బ్యారేజీ వైపు అనుమతించారు. తర్వాత శైవ పీఠాలకు వెళ్లి పరమేశ్వరునితోపాటు, మిగత దేవత మూర్తులకు శ్రద్ధతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

ఉత్సాహంగా కృష్ణావర్శిటీ బాక్సింగ్ పోటీలు
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 28: నలందా కళాశాల ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాక్సింగ్ పురుషుల చాంపియన్‌షిప్ సోమవారం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సిరాజుద్దీన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. వర్శిటీ పరిధిలోని వివిధ కళాశాలల నుండి వర్శిటీ జట్టు ఎంపిక పోటీలకు 25మంది క్రీడాకారులు పోటీపడ్డారు.
60 కేజీల విభాగంలో జి మల్లిఖార్జున (ఆంధ్ర లయో ల కళాశాల), ఎం రాజేష్‌కుమార్‌రెడ్డి (కెబిఎన్ కళాశాల), సిహెచ్ మేఘనాధుడు (ఆంధ్ర లయోల కళాశాల), 75 కేజీల విభాగంలో కె శివసాగరయ్య (ఆంధ్ర లయోల కళాశాల), పి సాయికిరణ్ (ఆంధ్ర లయోల కళాశాల), ఆర్ శ్రీ చరణ్ (ఎస్‌విడి సిద్ధార్ధ లా కళాశాల)లు వరుసగా మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. అ నంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నలంద కళాశాల ప్రిన్సిపాల్ ఎం అనూరాధ పాల్గొని విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టో ర్నీ కార్య నిర్వాహఖ కార్యదర్శి ఎ చిన్నబాబు, బాక్సింగ్ సంఘ అధ్యక్షులు యువి రాఘవులు, కార్య నిర్వాహక కా ర్యదర్శి రాజ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వర్శిటీ జట్టును ఎంపిక కమిటీ సభ్యులు యుగంధర్, రాఘురామ్‌లు ప్రకటించారు.
వర్శిటీ బాక్సింగ్ జట్టు
ఎ శ్రీకాంత్, కె శివసారగయ్య, సిహె చ్ నరేంద్రరెడ్డి, జి మల్లిఖార్జున (ఆంధ్ర లయోల కళాశాల), జి అనంతుకుమా ర్ (కాకతీయ కళాశాల), పి ఆనందసూ ర్య (ఎస్‌విడి సిద్ధార్థ లా కళాశాల), ఎన్ హేమత్‌కుమార్ (కెబిఎన్ కళాశాల).
సంతాపం
బాక్సింగ్ కోచ్ కెవిఎస్ కృష్ణ శనివా రం ఆకాల మరణం చెందడంతో సో మవారం జరిగిన కృష్ణా విశ్వవిద్యాల యం అంతర్ కళాశాలల బాక్సింగ్ పు రుషుల చాంపియన్‌షిప్‌లో ఘన నివా ళి అర్పించారు. కృష్ణ బాక్సింగ్ అభివృద్ధికి చేసిన కృషిని తెలియజేస్తూ ఆయ న ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు వౌనం పాటించారు.

సీజ్ చేసిన వాహనాలు వేలం
* రూ.35లక్షల 49వేలు ఆదాయం
విజయవాడ (క్రైం), నవంబర్ 28: వివిధ కేసుల్లో పోలీసులు సీజ్ చేసిన వాహనాలను సోమవారం వేలం పాట నిర్వహించారు. ఈ వేలం ద్వారా సుమారు 35లక్షల 49వేల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం లభించింది. ఈ వేలం పూర్తి ప్రక్రియ నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ స్వీయ పర్యవేక్షణలో కొనసాగింది. వివిధ పోలీస్టేషన్ల పరిధిలో స్వాధీనం పరుచుకున్న ఆచూకీ తెలియని సుమారు 892 మోటారు వాహనాలు ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతి ప్రకారం సోమవారం బందరురోడ్డులోని సిటి ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో ఉదయం 10 గంటల నుంచి వేలం ప్రారంభమైంది. ఎన్నో ఏళ్లుగా డంప్ యార్డులో మగ్గుతున్న వాహనాలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. స్వాధీ నం చేసుకున్న వాహనాలు వాటి యజమానులు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో వేలం నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల పోలీసుశాఖ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈనెల 21 నుంచి 26వరకు వేలంపాట లో పాల్గొనేవారు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో సోమవారం జరిగిన వేలం పాటలో సుమారు 250 మంది వరకు పాల్గొనగా.. సుమారు 25లక్షల 49వేల రూపాయలు ఆదాయం లభించింది. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ పి హరికుమార్, డిసిపిలు, ఐదు జోన్ల ఏసిపిలు, ఏఆర్ అధికారులు, రవాణా శాఖాధికారులు, రెవిన్యూ అధికారులు హాజరయ్యారు.

ఆన్‌లైన్ లావాదేవీలపై అవగాహన కల్పించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 28: ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సోమవారం సాయంత్రం మరోసారి బ్యాంక్, రాష్టస్థ్రాయి ఉన్నాతాధికారులు, కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ఎక్కువ చేసేందుకు చేయూత అందించాల్సిన బాధ్యతను బ్యాంకర్లు విస్మరించరాదని స్పష్టం చేశారు. జన్‌ధన్ ఖాతాలను అమలు చేయడం సామాన్య ప్రజలకు బ్యాంక్ సేవలను అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ మేరకు ప్రారంభించిన కొన్ని జన్‌ధన్ ఖాతాలు నిర్వహణలో లేకపోవడం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి జన్‌ధన్ ఖాతా నిర్వహణలో ఉండాలని, రూపే కార్డులను అందించాలన్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉండేలా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇ-పాస్ పరికరాలతో ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంపై శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు.