కృష్ణ

దళిత గిరిజనుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 30: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో దళిత గిరిజనుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 7వేల కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుండి 40 శాఖల ద్వారా దళిత గిరిజన లబ్ధిదారులకు ఆర్థికంగా బలపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన దళిత గిరిజనుల కోసం చంద్రన్న రుణమేలా కార్యక్రమానికి కిషోర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 58,348 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల కింద రూ.117.69 కోట్లు లబ్ధి చేకూర్చామన్నారు. గత ప్రభుత్వాలు దళిత, గిరిజనుల నిధులు దారి మళ్లించి వారి జీవనప్రమాణాలు 20, 30ఏళ్లు వెనుకకు వెళ్లాయన్నారు. దళిత, గిరిజనుల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తూ వారికి కేటాయించిన నిధులను వారికే అందించాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందించి కోట్లాది నిధులు మంజూరుచేసి అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాటుపడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలను ధనికులతో సమానంగా చేయాలని లక్ష్యం అభివృద్ధి దిశగా బాటలు వేస్తోందన్నారు. రాష్ట్రాన్ని పేదరిక రహిత రాష్ట్రంగా స్వర్ణాంధ్ర, నవ్యాంధ్ర నిర్మాణ ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో విద్యార్థికి 15 లక్షలు అందించి వందమంది విద్యార్థులను ఉన్నత చదువులు అభ్యసించేందుకు విదేశాలకు పంపటం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరం మరో 150 మందిని పంపేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం నుండి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి కింద దేశంలో బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఐదు సెంటర్ల ద్వారా 350 మంది విద్యార్థులకు ఐఎఎస్ కోచింగ్‌లు అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, డాక్టర్ ఎన్టీఆర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. 2014-15 సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3252 మంది లబ్ధిదారులకు 41.06 కోట్లు, 2015-16 సంవత్సరానికి 78.08 లబ్దిదారులకు రూ.103.32 కోట్లు ఆర్థిక చేయూత ఇవ్వాలనే లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 2014-15 సంవత్సరానికి 329 మంది లబ్ధిదారులకు 3.16 కోట్ల ఆర్థిక చేయూత ఇవ్వడం జరిగిందని, 2015-16 సంవత్సరానికి 1558 లబ్ధిదారులకు 10.09 కోట్లు చేయూతనందించాలనే లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దశాబ్దాల వారీ పెండింగ్ ఉన్న విజయవాడ ప్రజల చిరకాల వాంఛ అయిన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టుదల, దీక్షతో రూ.450 కోట్లతో సాకారం కాబోతోందన్నారు. అమరావతి రాజధానికి వచ్చే ప్రతివారికి ఈ అభివృద్ధి కనపడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అందించే ఆర్థిక సహాయంలో ఎవరైనా దళారులు లంచమడిగితే వెంటనే జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలన్నారు. బిసి సంక్షేమ పథకాలకు గాను లబ్ధిదారులకు రూ.126 కోట్లు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో దళిత, గిరిజనులను అన్ని విధాలా ఆదుకుని సామాజికంగా బలోపేతం చేస్తామన్నారు. బిసి సంక్షేమ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 16వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎస్సీ సబ్ ప్లాన్ కింద 58348 మందికి సుమారు 118 కోట్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పేదరికం లేని సమాజం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్రంలోని 6వేల కోట్లు పెన్షన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనుల అభ్యున్నతి కొరకు కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలు అమలుపరుస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలన్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలులో బ్యాంకర్లు గాని, దళారులు గాని ఎటువంటి ఇబ్బందులకు గురిచేసినా లబ్ధిదారులు వెంటనే తనకు ఎస్‌ఎంఎస్ ద్వారా ఫోన్‌కాల్ ద్వారా తెలియపరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణ, కార్పొరేటర్ జయలక్ష్మి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సాంఘిక సంక్షేమశాఖ డిడి సునీల్‌రాజ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి సత్యనారాయణ, ఎస్టీ కార్పొరేషన్ ఇడి అర్బన్ ఎమ్మార్వో శివారావు, తదితరులు పాల్గొన్నారు..