కృష్ణ

నగదు రహిత లావాదేవీలే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 29: చిన్ననోట్ల సమస్యను అధిగమించేందుకు గాను ప్రభుత్వం నగదు రహిత ఆర్థిక లావాదేవీలను తెరపైకి తీసుకొచ్చింది. నగదు రహిత సేవలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కలెక్టర్ బాబు.ఎ నేతృత్వంలోని టీమ్ కృష్ణా విశేష కృషి చేస్తోంది. ప్రతిరోజూ దీనిపై సిఎం చంద్రబాబు నాయుడు స్థాయి నుండి వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు జరుగుతున్నాయి. మండల స్థాయి అధికారులు సైతం నగదు రహిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. టీమ్-కృష్ణాకు పోలీసు శాఖ కూడా తోడైంది. ఇప్పటి వరకు కలెక్టర్, మండల ప్రత్యేక అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు నగదు రహిత సేవలపై అవగాహనా సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చారు. టీమ్-కృష్ణా చేస్తున్న కృషికి తమ వంతు బాధ్యతగా పోలీసు శాఖ నడుం బిగించింది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నగదు రహిత సేవలపై అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. నగదు రహిత ఆర్థిక లావాదేవీల అభివృద్ధిలో ఒక భాగమంటూ, నగదు లావాదేవీల్లో ఎటువంటి అవకతవకలకు అస్కారం ఉండదంటూ ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. డియస్‌పి శ్రావణ కుమార్ ర్యాలీని ప్రారంభించి నగదు రహిత చెల్లింపుల ఆవశ్యకతను వివరించారు. పలు దుకాణాలకు వెళ్ళి నగదు రహిత చెల్లింపులను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు వర ప్రసాద్, జనార్ధనరావు, సుబ్బారావు, పలు స్టేషన్‌ల ఎస్‌ఐలు పాల్గొన్నారు.