కృష్ణ

ఒకటే టెన్షన్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 30: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారమైన 1వ తేదీ వచ్చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. నెలరోజుల కష్టానికి తగ్గ జీతం అందుతుందో, లేదో తెలియదు. బ్యాంకుల్లో దాచుకున్న కొద్దిపాటి నగదు చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో 1వ తేదీని అధిగమించడం ఎలా?.. అనేది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అంతుపట్టడం లేదు. నెలలో ప్రారంభ రోజైనా అన్ని చెల్లింపులకూ చివరి రోజే. నెలరోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలం అందేరోజు కూడా అదే. 1వ తేదీ అంటేనే సామాన్యులకు తలకు మించిన భారం. పెద్దనోట్ల రద్దుతో ఇది పెనుభారంగా మారింది. తెల్లారేసరికి ఇంటి ముందు ఉండే పాల వారికి, పేపర్ బాయ్‌కి చిల్లర ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, ఇఎంఐల చెల్లింపులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిరకాల చెల్లింపులకు నోట్ల రద్దు ప్రధాన ఆటంకంగా మారింది. నగదు రూపంలో జీతాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఉద్యోగుల కోరికను ఆర్థిక శాఖ సున్నితంగా తోసిపుచ్చేసింది. ఈనేపథ్యంలో బ్యాంక్ ఖాతాల్లో పడ్డ జీతాన్ని తీసుకోవాలంటే ఆర్‌బిఐ విధించిన పరిమితులు అడ్డు గోడలయ్యాయి. ప్రైవేట్ ఉద్యోగులకు యాజమాన్యాలు పెద్దనోట్ల రూపంలో జీతాలు ఇస్తారా? లేక చిన్ననోట్లు అందిస్తారా?.. అనేది తెలియడం లేదు. పెద్దనోట్లు ఇస్తే వాటిని చెల్లింపుదారులు తీసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. చిన్ననోట్లు ఇస్తేనే చెల్లింపులన్నీ చేసుకునే అవకాశం ఉంది. కానీ పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిన్ననోట్ల కొరత ఏర్పడింది. బ్యాంకుల్లో సైతం చిన్ననోట్ల జాడ కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు చిన్ననోట్ల రూపంలో జీతాలు ఇస్తారనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ చెక్కులు, బ్యాంక్ ఎకౌంట్లలో జమచేస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది. పెద్దనోట్లను రద్దుచేసిన నాటి నుండి నేటి వరకు బ్యాంక్‌ల్లో క్యూలైన్లు ఏమాత్రం తగ్గలేదు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడినా చేతికి వచ్చేది కొద్దిమొత్తమే. అదీ అదృష్టం ఉంటేనే. చాలావరకు బ్యాంకుల్లో నో-క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో 1వ తేదీని అధిగమించడం కష్టమే అంటున్నారు సామాన్య, మధ్యతరగతి ప్రజలు.
విద్యార్థులతోనే ఉజ్వల భారతావని
* జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ
గుడివాడ, నవంబర్ 30: విద్యార్థుల మేధస్సును వెలికితీసేందుకు విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. బుధవారం స్థానిక ఏలూర్ రోడ్డులోని ఫాదర్ బియాంకి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 44వ జవహర్‌లాల్ నెహ్రూ జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన-2016ను ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో అనూరాధ మాట్లాడుతూ భవిష్యత్ భారతదేశాన్ని ప్రపంచస్థాయిలో ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా ప్రతి ఏటా వివిధస్థాయిల్లో విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో గుడివాడ పట్టణం ఇలాంటి ప్రదర్శనలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ వివిధ ప్రదర్శనలను ఏర్పాటు చేశారని కొనియాడారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ఈ ప్రదర్శనలను చూసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అనురాధతో పాటు ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, జిల్లా విద్యాశాఖాధికారి ఎ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తూర్పు కృష్ణాడెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుత్తా చంటి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, డివై ఈవో జి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నలు విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించి వారిని అభినందించారు. నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. ఇదిలా ఉండగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన వివిధ పాఠశాలల విద్యార్థులు దాదాపు 800ప్రదర్శనలను వైజ్ఞానిక ప్రదర్శనలో ఉంచారు. ముఖ్యంగా స్వచ్ఛ్భారత్, సౌర, విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్, రాజధాని అమరావతి నిర్మాణం, ఆటోమేటిక్ సోలార్ లైట్స్, వర్మీ కంపోస్ట్ తయారి, దాని ప్రయోజనాలు, ప్రమాద సంకేత వ్యవస్థ, స్మార్ట్ సిటీ రూపకల్పన, ఆహారోత్పత్తి చేసే విధానం, మ్యాజిక్ వాటర్, రోటరీ టిల్లర్ పనితీరు, హైడ్రాలిక్ సిటీ, గాలి కాలుష్య కారకాలు, నివారణ చర్యలు, కృత్రిమ వ్యవసాయం చేసే విధానం, గణిత పేటికలోని పరికరాలు, బయోకోల్, ఎలక్ట్రికల్ అలారం పనిచేసే విధానం, ఆనంద నిలయం, ఆరోగ్య విద్య, పవిత్ర సంగమం తదితర ప్రదర్శనలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.