కృష్ణ

ఖరీఫ్ రైతన్నలను కుంగతీస్తున్న వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 14: వార్ధా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ రైతులను నష్టాలపాలు చేస్తున్నాయి. వార్ధా తుపాను హెచ్చరికలతో యంత్రాల సహాయంతో కోసిన ధాన్యం ఎండలేకపోవటంతో బూజుపట్టుకుపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో పంట పనల మీద ఉండగా, మరి కొన్ని ప్రాంతాలలో హడావిడిగా కుప్పలు వేశారు. ఈ ఈ కారణంగా పనల మీదున్న వరి పంట నీట నానుతుండటంతో గింజలు మొలకలు వస్తున్నాయి. అలాగే హడావుడిగా తడి పొడిగా ఉన్న వరి పనలను కుప్పలు వేయటంతో ధాన్యం ఉక్కిపోయి రంగుమారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలోని కుప్పలలోని ధాన్యం రంగుమారింది. అయితే వేసిన కుప్పలను నూర్పిడి చేద్దామన్నా వర్షం ఆగకపోవటంతో ఏమి చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని కొంత మంది రైతులు ఆరబెడుతుండగా, పనలమీదున్న పంటను దిబ్బలపైకి తెచ్చి కొంత మంది రైతులు నూర్పిడి చేస్తున్నారు. కూలీ ఖర్చులను సైతం లెక్క చేయకుండా నోటికాడికి వచ్చిన పంటను నేలపాలు చేయటం ఎందుకనే ఉద్దేశంతో కొంత మంది రైతులు ఒడ్డుకు చేర్చి నూర్పిడి చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కుప్పలు వేసిన ధాన్యం రంగుమారే ప్రమాదం ఉంది. అలాగే పనల మీద ఉన్న పంట పూర్తిగా మొలకలు వచ్చే అవకాశం ఉంది. అయితే నిడివిమీదున్న పంటకు మాత్రం ప్రస్తుతానికి నష్టం ఉండదంటున్నారు. సంప్రదాయబద్ధంగా వరి కోతలు కోసిన రైతులకు రెండు విధాలుగా నష్టం వాటిల్లింది. ఒక పక్క పంట నీటిలో నానుతుండగా రెండవ పైరుగా చల్లిన మినుము విత్తనాలు కూడా ఎందుకూ పనికి రాకుండా పోయాయి. వాతావరణంలో ఎండపొర వస్తే తప్ప ఏమీ చేయలేని స్థితిలో రైతన్నలు ఉన్నారు.

స్వల్ప కాలంలో గొప్ప నిర్మాణం
విజయవాడ రూరల్, డిసెంబర్ 14: రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నూతన సచివాలయానికి, హైదరాబాద్‌కు గేట్‌వేగా వుంటుందని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. బుధవారం మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధలతో కలిసి దేవాదాయ శాఖ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ నూతన సచివాలయం వెలగపూడికి, హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరలో ఈ భవనం పరిపాలనకు అనువుగా వుంటుందన్నారు. గత మే నెలలో శంకుస్థాపన చేసుకొని అతి తక్కువ సమయంలో పూర్తి ప్రమాణాలతో భవనం నిర్మించుకోవటం గొప్ప విషయంగా అభివర్ణించారు. 35వేల చరదపు అడుగుల వైశాల్యంలో 9కోట్ల 50లక్షల రూపాయల వ్యయంతో కమిషనర్ కార్యాలయంతో పాటు క్యాంప్ ఆఫీసు, బ్రాహ్మణ కార్పొరేషన్ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే కమిషనర్ కార్యాలయ నిర్మాణం పూర్తయిందని, మిగతా రెండు త్వరలో పూర్తిచేస్తామన్నారు. ఇదే ప్రాంగణంలో వేణుగోపాలస్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నామని మంత్రి మాణిక్యాలరావు వివరించారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో దేవాదాయ శాఖకు చెందిన ఈ భూమిని కబ్జా చేయటానికి కొందరు ప్రయత్నించారన్నారు. కబ్జాను అడ్డుకోవటంతో పాటు ఇదే ప్రాంతంలో అత్యంత సుందరంగా రికార్డు కాలంతో నాణ్యతా ప్రమాణాలతో దేవాదాయ శాఖ కార్యాలయం నిర్మించటం తమ ప్రభుత్వ ఘనతకు నిదర్శనమన్నారు. గొల్లపూడి, సూరాయపాలెం వద్ద నిర్మించనున్న ఐకానిక్ వంతెన ద్వారా ఈ ప్రాంతానికి ఎంతో ఖ్యాతి వస్తుందని మంత్రి ఉమ అన్నారు. వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో చక్కటి వాతావరణంలో దేవాదాయ శాఖ కార్యాలయం బాగుందని ప్రశంసించారు. దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ మాట్లాడుతూ హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ పరిపాలన చేయటం ఇబ్బందికరంగా భావించటంతో సత్వరం శాశ్వత భవన నిర్మాణ పూర్తి చేశామని చెప్పారు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలన ఇక్కడి నుంచే జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఎస్‌ఇ సుబ్బారావు, దుర్గగుడి ఇవో సూర్యకుమారి, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, ఎంపిపి జగన్, మార్కెట్ యార్డు చైర్మన్ జాలిపర్తి సీతా, డైరెక్టర్ రాజగోపాల చక్రవర్తి, సమరసత సేవా ఫౌండేషన్ నాయకుడు త్రినాథ్, దేవాదాయ శాఖ అధికార్లు పాల్గొన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు భేష్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 14: వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 7.87 కోట్ల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేయటంతో పాటు బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా అందిస్తున్న విధానంపై కలెక్టర్ బాబు.ఎను కేంద్ర ప్రభుత్వ మంచినీరు, పారిశుద్ధ్యం శాఖ సెక్రటరీ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్, సంపూర్ణ పారిశుద్ధ్యంలో భాగంగా ఢిల్లీ నుండి బుధవారం ఆయన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంగా నిర్వహిస్తూ పనుల ప్రగతి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్న కలెక్టర్ బాబు.ఎను ప్రశంసించారు. నగదు ఇబ్బందుల