కృష్ణ

జిఎస్‌టిలోకి మారడం తప్పని సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 21: ప్రస్తుతం వ్యాపారం చేస్తూ పన్ను పరిధిలో ఉన్న వ్యాపారస్తులందరూ జిఎస్టీకి తప్పనిసరిగా మారాల్సిందేనని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొన్నారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఛాంబర్ కార్యాలయంలో బుధవారం జిఎస్‌టి - జిఎస్‌టిఎస్‌పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఛాంబర్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కరరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ (విజయవాడ 1) కిరణ్‌కుమార్ మాట్లాడుతూ జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు దాని బాధ్యతలు, విధివిధానాలను వివరించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వాణిజ్య పన్నులశాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఆడిట్) సుధాకర్ మాట్లాడుతూ జిఎస్టీ రకాలు, ఎవరెవరు జిఎస్టీ పరిధిలోకి వస్తారు. ఎవరెవరికి మినహాయింపు ఉండేది తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారి హర్షవర్దన్ మాట్లాడుతూ మోడల్ జిఎస్టీలోని షెడ్యూల్ 3లో పేర్కొన్న అంశాలను వివరించారు. ప్రస్తుతం పన్ను చెల్లిస్తున్న వారందరూ మైగ్రేషన్ ద్వారా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందేనన్నారు. జిఎస్టీలో ఒకే రిజిస్ట్రేషన్ ఉంటుందన్నారు. రూ. 20 లక్షలు టర్నోవర్ దాటిన వ్యాపారస్తులందరూ జిఎస్టీ పరిధిలోకి వస్తారన్నారు. జిఎస్‌టిఎన్‌కు ఎలా లాగిన్ కావాలి, దానిలో పూర్తి చేయాల్సిన వివరాలు, అఫ్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ల గురించి వివరించారు. పాన్ నెంబర్‌ను నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా వివరాలన్నీ అఫ్‌లోడ్ అవుతాయన్నారు. అన్ని వివరాలు ఖచ్చితంగా ఉంటే మూడు రోజుల్లో జిఎస్‌టి రిజిస్ట్రేషన్ పూర్తవుతుందన్నారు. ఒకవేళ సంబంధిత వివరాలు అసంపూర్తిగా ఉంటే ఏడు రోజుల్లోగా పంపాల్సిందిగా అధికారుల సమాచారం ఇస్తారన్నారు. సంబంధిత సమాచారం అందించిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందన్నారు. ప్రతి నెలా రిటర్న్ ఫైల్ చేయడం, వాటిలోని లోటుపాట్లను ఎలా సరిచేసుకోవాల్సింది వాణిజ్య పన్నుల శాఖ అధికారి జయశంకర్ వివరించారు. మైగ్రేషన్‌కు ఎలా వెళ్లాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తదితర అంశాలను వాణిజ్య పన్నులశాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఎల్‌టియు) జి ప్రభాకరమూర్తి వివరించారు. ఛాంబర్ ప్రధాన కార్యదర్శి పిఎస్‌ఎల్‌ఎన్ వరప్రసాద్ స్వాగతం పలకగా వేదికపైకి మెప్మా అధికారి సోమయ్య, విద్యాఖన్నా పాల్గొన్నారు. ముందుగా ఛాంబర్ అధ్యక్షులు భాస్కరరావు మాట్లాడారు. జిఎస్టీ త్వరలో అమలులోకి రానున్న నేపథ్యంలో మైగ్రేషన్, జిఎస్టీపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథులుగా విచ్చేసి జిఎస్‌టిఎన్ లాగిన్, రిజిస్ట్రేషన్ విధివిధానాలను వివరించి సందేహాలను నివృత్తి చేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కిరణ్‌కుమార్, సుధాకర్, హర్షవర్ధన్, జయశంకర్, జి ప్రభాకరమూర్తిలను చాంబర్ కార్యవర్గం దుశ్శాలువా, మెమొంటోలతో సత్కరించారు.
కడప ప్రైవేట్ వైద్య కళాశాల
విద్యార్థుల ఆందోళన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, డిసెంబర్ 21: కడపలో గత ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక ప్రైవేట్ వైద్య కళాశాలకు సంబంధించి 2015-16 సంవత్సరానికి అడ్మిషన్లను రద్దు చేయాలంటూ అత్యన్నత న్యాయం స్థానం ఇచ్చిన తీర్పుపై ఆ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి గత ఐదారు నెలలుగా ప్రథమ సంవత్సర తరగతులు జరుగుతున్నాయి. తాజాగా వచ్చిన సుప్రీం కోర్టు తీర్పుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస ఎదుట తమ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ విషయంపై గురువారం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడగలనని తెలిపారు.