కృష్ణ

డివిఆర్ బ్రాంచ్ కెనాల్‌కు 8వేల క్యూసెక్కుల నీరు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, డిసెంబర్ 24: డివిఆర్ బ్రాంచి కెనాల్‌కు 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కోరారు. పట్టణంలోని పులిచింతల కార్యాలయంలో నీటి సంఘాల అధ్యక్షులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పలువురు నీటి సంఘాల అధ్యక్షులు ప్రస్తుతం 6200ల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందని, నీరు చివరి భూములకు అందకపోవడమే కాక తూములకు ఎక్కవని ఎమ్మెల్యే రాజగోపాల్ దృష్టికి తీసుకురాగా ఆయన ఆంధ్రా, తెలంగాణాలకు చెందిన ఎన్‌ఎస్‌పి సిఇలతో ఫోన్‌లో మాట్లాడి 8వేల క్యూసెక్కుల నీరు ఇవ్వాలని ప్రస్తుత పరిస్థితి వివరించగా నీటి శాతం పెంచేందుకు వారు అంగీకరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిసి చైర్మన్ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, పెనుగంచిప్రోలు మండల పార్టీ అద్యక్షుడు చింతల సీతారామయ్య, నీటి సంఘాల అధ్యక్షులు, ఎన్‌ఎస్‌పి ఇఇ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

క్రీస్తు జననం లోకానికి దివ్య సందేశం
పటమట, డిసెంబర్ 24: నవ్యాంధ్ర విజయవాడ రాజధానిలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన చర్చిలతోపాటు, ఉప చర్చిలలో క్రిస్మస్ కోలాహలం నెలకొంది. శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు నగరంలోని అన్ని చర్చిలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, క్రిస్మస్ సమిష్టి దివ్యపూజాబలి సమర్పణ, క్రిస్మస్ గీతాలు, క్రిస్మస్ కేట్ కటింగ్‌లతో సందడి వాతావరణం నెలకొని వుంది., చర్చిలన్ని విద్యుత్ దీపాలతో అలంకరించటంతో చర్చిలన్ని కాంతులీనుతున్నాయి. చర్చిలలో ఏసుప్రభువు పశువుల పాకలో జన్మించిన ఇతివృత్తాన్ని తెలియజేసే బాలయేసు స్వరూపాలను ఏర్పాటు చేశారు. భక్తులు బారులుతీరి ముద్దులొలికే బాలయేసును సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. నగరంలోని వీధి వీధిన చర్చిలలో భారీ క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేశారు. విజయవాడ కతోలిక పీఠం పీఠాధిపతులు బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు శనివారం రాత్రి 9.30 గంటలకు నిర్మలా కానె్వంట్ ప్రక్కన సెయింట్ పాల్స్ కథెడ్రల్‌లో క్రీస్తు జయంతి వేడుకలను ప్రారంభించారు. సెయింట్ పాల్స్ విచారణ కర్తలు ఫాదర్ బాసాని పాపిరెడ్టి, బిషప్ సెక్రటరీ ఫాదర్ ఆనంద్, సహాయ గురువు ఫాదర్ మెరుగుమాల అనిల్‌తో కలసి బిషప్ రాజారావు క్రిస్మస్ సమిష్టి దివ్యపూజాబలి సమర్పించారు. వన్‌టౌన్‌లోని తారాపేటలోఅతిపూరతనమైన 120 యేళ్ళ చరిత్ర కలిగి ప్రసిద్ధి చెందిన సెయింట్ పీటర్స్ కథెడ్రల్ చర్చిలో విజయవాడ కతోలిక పీఠం మోన్స్‌గ్నోర్, విచారణ కర్తలు ఫాదర్ మువ్వలప్రసాద్ క్రిస్మస్ వేడుకలు ప్రారంభించి క్రిస్మస్ సందేశమిచ్చారు. న్యూ రాజరాజేశ్వరిపేటలోని ఆర్‌సియం దేవాలయంలో విజయవాడ కతోలిక పీఠం మోన్స్‌గ్నోర్ ఫాదర్ యం. గాబ్రియేలు క్రిస్మస్ వేడుకలను ప్రారంభించి, దివ్యపూజాబలి సమర్పించారు. గుణదలమాత పుణ్యక్షేత్రంలో రెక్టర్, విచారణకర్తలు ఫాదర్ యేలిటి విలిజయం జయరాజు, ఫాదర్ ప్రతాప్ తదితర గురువులు క్రిస్మస్ వేడుకలు ప్రారంభించి, భక్తులకు క్రీస్తు జయంతి సందేశం అందచేశారు. గుణదలలోని డయోసిసిన్ ఎడ్యుకేషన్ డస్క్‌లో వైస్ చైర్మన్ ఫాదర్ కొండ్రు సింహరాయులు క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. లబ్బీపేట క్యాథలిక్ సెంటర్‌లోని ఏసు తిరుహృదయం దేవాలయంలో విచారణకర్తలు ఫాదర్ ఐయం.స్వామినాధం తదితర గురువులు క్రిస్మస్ వేడుకలను ప్రారంభించిన అనంతరం క్రిస్మస్ సమిష్టి దివ్యపూజాబలి సమర్పించి, భక్తులకు సందేశమిచ్చారు. గుణదల సోషల్ సర్వీస్ సెంటర్‌లో డైరెక్టర్ ఫాదర్ పసల తోమస్ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించి, భక్తులకు సందేశమిచ్చారు. జగ్గయ్యపేట ఏసు తిరుహృదయం దేవాలయంలో విచారణ కర్తలు ఫాదర్ జె.జాన్‌రాజు, మచిలీపట్నం పరాసుపేట హోలీ క్రాస్ ఆర్‌సియం చర్చిలో విచారణ కర్తలు ఫాదర్ లాము జయరాజు క్రిస్మస్ వేడుకలను ప్రారంభించి భక్తులు క్రీస్తు జయంతి సందేశమిచ్చారు. నగరంలోని పెజ్జోనిపేట మరియమాత మోక్షరోపణ దేవాలయంలో విచారణ కర్తలు ఫాదర్ తోట మరియదాస్ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించి భక్తులు క్రిస్మస్ సందేశమిచ్చారు. విజయయవాడ రూరల్ గుంటపల్లి ఆర్‌సియం చర్చిలో విచారణకర్తలు ఫాదర్ బొంతా లూర్ధు ఫ్రాన్సీస్ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించి భక్తులకు సందేశమిచ్చారు.