కృష్ణ

సమ్మెహన సంబరం... కూచిపూడి సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, డిసెంబర్ 24: అద్భుత హావభావాలు...అధ్యంతం అలరించే అభినయం...మైమరిపించే నాట్యాభినయం కలగలసి ప్రేక్షులను కట్టిపడేసేలా కొనసాగుతొంది అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం. కూచిపూడి నాట్యంలో నిష్ణాతులైన నాట్యాచార్యులు, నేర్చుకుంటున్న కళాకారులు ఇస్తున్న ప్రదర్శనలు వచ్చిన ప్రతీ వారిని కళ్లప్పగించేలా చూసేలా చేస్తున్నాయి. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ మరియు సిలికాన్ ఆంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఐదవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం రెండవ రోజు శనివారం వైభవంగా సాగింది. కూచిపూడిలోని అభినయాలను ప్రముఖ కళాకారుల ప్రదర్శనలతో ఆద్యంతం రసవత్తరంగా కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ యశోదా టాకూర్, జ్యోతి చింతలపూడి కళాకారులు ప్రదర్శించిన అష్టవిద నాయికాస్ అభినయ విన్యాసం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. వారు ప్రదర్శించిన హావభావాలు కళ్లు మాట్లాడతాయి, కళ్లు నర్తిస్తాయని నిరూపించాయి. ప్రియుని కోసం ఎదురు చూసే సన్నివేశ అభినయం, ప్రియుడు సమయానికి రాకపోతే సిఖియా వినుమా, సుఖుని రమ్మనవే అంటూ చేసిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేశాలా చేశాయి. ప్రియుని అనుమానించి, అవమానించిన తరువాత పశ్చాతాప పడుతూ నా కోసమే నన్నింత చేసేనా అంటూ చేసిన అభినయం నిశబ్ద వాతావరణంలో అహుతులు కళ్లప్పగించి చూస్తూ ఆసాంతం తిలకించి హర్షధ్వానాలతో కళాకారులను అభినందించారు. డాక్టర్ పనుమర్తి శేషుబాబు, శ్రీనివాసశర్మ, విఠల్ ముగ్గురు ఒకేసారి చేసిన నాట్యం, కుమారి సాయిదీపిక చేసిన నాట్యం ఆసాంతం ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాయి. ప్రముఖ నృత్య కళాకారులు రాజా అండ్ రాధారెడ్డి దంపతులు, కుమారి భావన చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో అకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన పద్మభూషన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గ్రామ, గ్రామల నుండి తప్పటగుళ్ల, బుర్రకధ, హరికధ వంటి ఇతర కళాబృందాలను ప్రోత్సహించాలన్నారు. మన కళలకు దేశ విదేశాల్లో మంచి ఆదరణ ఉందన్నారు.
ఈ సందర్భంగా ఆయన పలువురు కళాకారులను అభినందించి, వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర చైర్మన్ కూచిభట్ల అనంద్, మాజీ అధ్యక్షుడు కె ధీనబాబుతో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు.