కృష్ణ

పూలింగ్ నోటిఫై భూముల రిజిస్ట్రేషన్లలో రైతులను ఇబ్బంది పెట్టకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 28: బందరు పోర్టు భూసమీకరణ కోసం నోటిఫై చేసిన భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై బుధవారం సాయంత్రం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మడ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖాధికారులతో మంత్రి రవీంద్ర ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నా కొంత మంది అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అడంగళ్‌లో పేర్లు ఉన్నప్పటికీ పట్టాదార్ పాస్ పుస్తకం, 1బి ఫారం ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేస్తామంటున్నారని కొంతమంది రైతులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు. రిజిస్ట్రేషన్లలో దళారీల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించవద్దని, డాక్యుమెంట్ రైటర్లు అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. అడంగళ్లను ఎప్పటికప్పుడు నవీకరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో పి సాయిబాబా, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, రాష్ట్ర కల్లుగీత కార్మిక ఆర్థిక సంస్థ డైరెక్టర్ నారగాని ఆంజనేయ ప్రసాద్, టిడిపి సీనియర్ నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, గొర్రిపాటి గోపిచంద్, తహశీల్దార్ నారదముని తదితరులు పాల్గొన్నారు.

టిడిపి కౌన్సిలర్ శ్రీవాణి ఝలక్
* రూ.4.7కోట్లకు ఐపి దాఖలు
* 100 మంది బాధితులకు కోర్టు నోటీసులు
* చిలకలపూడి పిఎస్‌లో బాధితుల ఫిర్యాదు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 28: అందరూ అనుకున్నదే జరిగింది. గత రెండు నెలలుగా కనిపించకుండా పోయిన స్థానిక 6వ వార్డు టిడిపి కౌన్సిలర్ నూకల శ్రీవాణి పట్టణ ప్రజలను కంగుతినిపించారు. చిట్టీల పేరుతో కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును స్వాహా చేసిన ఆమె చిట్టచివరకు ఐపి పెట్టేశారు. 4కోట్ల 7లక్షల రూపాయలకు 6వ అదనపు జిల్లా కోర్టులో శ్రీవాణి ఐపి దాఖలు చేయడం పట్టణ ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. శ్రీవాణి ఐపి పెట్టారని, జనవరి 17వతేదీ వాయిదాకు రావాలంటూ పట్టణానికి చెందిన వంద మంది బాధితులకు కోర్టు నుండి నోటీసులు వచ్చాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నూకల శ్రీవాణి గత కొనే్నళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నారు. ఆమె కౌన్సిలర్ కాక ముందు లక్షల్లో చీటీ పాటలు నిర్వహించేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన పరిచయాలతో కోట్ల మేర చిట్టీలు వేశారు. పాటదారులకు సకాలంలో పాట మొత్తం ఇవ్వకుండా జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో ఆమె పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. ఏం చేయాలో పాలు పోని శ్రీవాణి గత రెండు నెలలుగా బాధితులకు కనిపించడం లేదు. అప్పుల నేపథ్యంలోనే ఆమె పరారీ అయ్యారని ప్రచారం జరిగింది. కానీ ఆమె భర్త రామకృష్ణ మాత్రం స్థానికంగానే ఉంటూ బాధితులకు నచ్చ చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా గత 15 రోజుల నుండి కనిపించకుండా పోయారు. దీంతో మరింత ఆందోళనలో ఉన్న బాధితులకు కోర్టు నోటీసులు నోట మాటరానివ్వకుండా చేశాయి. కోర్టు నోటీసులు అందుకున్న వంద మంది అయితే ఆమె బాధితులు ఇంకా చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు నోటీసులు అందుకోని ముగ్గురు బాధితులు బుధవారం చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో కౌన్సిలర్ శ్రీవాణిపై ఫిర్యాదు చేశారు. కొబ్బరితోటకు చెందిన వేముల దుర్గా ప్రసాద్, చిలంకుర్తి గణేష్ కుమార్, ఉల్లిపాలెంకు చెందిన పంచకర్ల నాగ పవన్ కుమార్ తాము శ్రీవాణి వద్ద రూ.4లక్షల చీటి వేశామన్నారు. 20 నెలలకు గాను 10 నెలలు పాట మొత్తం చెల్లించామన్నారు. 11వ నెలలో చీటి పాడగా తమకు పాట మొత్తం ఇవ్వలేదన్నారు. అదిగో ఇదిగో అని తిప్పుకున్నారని, అయితే గత కొంత కాలంగా ఆమె కనిపించడం లేదని, పాట మొత్తాన్ని ఇప్పించాలంటూ చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ జనార్ధనరావు తెలిపారు.

అవినీతిపై దద్దరిల్లిన మండల సమావేశం
* సమాధానం చెప్పాలన్న సభ్యులు
* సభ నుంచి వెళ్లిపోయిన ఎంపిడివో పద్మసుధ
* విజిలెన్స్ విచారణ జరపాలని సభ్యుల డిమాండ్

తోట్లవల్లూరు, డిసెంబర్ 28: మండల పరిషత్‌లో చోటు చేసుకున్న అవినీతిపై మండల సర్వసభ్య సమావేశం దద్దరిల్లింది. సభ నుంచి ఎంపిడివో వెళ్లిపోవటం, సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైంది. తొలుత పలుశాఖల అధికారులతో ఎంపిపి చర్చను ప్రారంభించారు. ఇద్దరు, ముగ్గురు అధికారులు తమశాఖల పనితీరు వివరిస్తుండగా ఎంపిడివో ఎస్‌ఈ పద్మసుధ సభ నుంచి బయటకు వెళ్లి తన కార్యాలయంలో కూర్చున్నారు. దాంతో ఎంపిటిసి సభ్యుడు మూడే శివశంకర్ మైకు తీసుకుని ఎంపిడివో సభకు రావాలని, రూ.5లక్షల కుంభకోణానికి వివరణ కావాలని అన్నారు. కాంట్రాక్టర్ ఎస్‌ఎస్ రాఘవరావు పేరు మీద అనేక బిల్లులు రాశారని, ఇంత అవినీతి ఎక్కడా లేదన్నారు. ఎంపిపి స్పందించి సూపరింటెండెంట్ ఎస్ నాగేశ్వరరావుని పిలిచి ఎంపిడివోని సభకు తీసుకు రావాలని మూడుసార్లు పంపించారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, సభకు రాలేనని ఎంపిడివో చెప్పారని నాగేశ్వరరావు ఎంపిపికి తెలిపారు. దాంతో శివశంకర్ మాట్లాడుతూ ఎంపిడిఓ అవినీతిపై విజిలెన్స్ విచారణ కోరాలని శివశంకర్ విజ్ఞప్తి చేశారు. దీంతో ఎంపిపి వెంకటేశ్వరరెడ్డి లేచి తాము వైసిపికి చెందిన వారమనే సాకుచూపి సిఇఓ చర్య నుంచి ఎంపిడివో తప్పించుకుంటున్నారని, టిడిపికి చెందిన శివశంకర్ అయినా ఫిర్యాదు చేసి చర్య తీసుకునేలా చూడాలని సూచించారు. దీనిపై పాములలంక సర్పంచ్ పాముల శ్రీనివాసరావుకు ఎంపిపికి వాగ్వాదం జరిగింది. ఈదశలో జెడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి కలుగజేసుకోవటంతో ఆమెతో శ్రీనివాసరావుకు మాటల యుద్ధం సాగింది. దాంతో తహశీల్దార్ జి భద్రు, పలువురు సభ్యులు పాముల శ్రీనివాసరావుని శాంతింప చేశారు. ఎంపిడివో సంగతి అందరికి తెలిసిందేనని, ఆమెను ఇక్కడ నుంచి పంపేయమని అధికారులను కూడా కోరానని పద్మావతి తెలిపారు. తాను ఎంపిడివోకి మద్దతుగా నిలుస్తున్నట్టు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వేయింగ్ మిషన్లు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 28: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌లను బుధవారం మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ పంపిణీ చేశారు. వేయింగ్ మిషన్లతో పాటు మొయిస్పర్ మీటర్లు, ఫీల్డ్ బ్యాలన్స్‌లు, హస్క్ రిమూవర్లు, పోకరులు, టార్ఫాలిన్లను పంపిణీ చేశారు. మార్కెట్ యార్డు పరిధిలోని ఎనిమిది పిఎసిఎస్‌లకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి కార్యదర్శి ఎంవి సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.