కృష్ణ

44 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో రోజురోజుకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. నూతన రాజధాని అమరావతి నిర్మాణం, పారిశ్రామికంగా, విద్య, వైద్యపరంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న క్రమంలో దేశ, విదేశీ ప్రయాణికులు వచ్చిపోతుండటంతో విమాన సర్వీసులు కూడా పెంచారు. రాష్ట్రంలో ప్రధానంగా విశాఖపట్నం, తిరుపతి, గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాలు ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల కాలంలో ఈ ఏడాది అదే కాలంలో ఆయా విమానాశ్రయాల నుంచి ప్రయాణించిన ప్రయాణికుల వివరాలను సంబంధిత అధికారులు విడుదల చేశారు. గత ఏడాది రాష్ట్రంలో 16,91,448 మంది ప్రయాణించగా ఈ ఏడాది ఆ సంఖ్య 24,28,612 మందికి చేరింది. అంటే 44 శాతం పెరిగింది. జాతీయ స్థాయిలో గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రయాణించిన ప్రయాణికులను ఈ ఏడాది అదే కాలంతో పోల్చితే 19 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. గన్నవరం విమానాశ్రయంలో అత్యధికంగా 76 శాతం మంచి ప్రయాణికులు పెరిగారు. అమరావతికి విదేశీ ప్రముఖులు, దేశవిదేశీ పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాలు, ఇతర రంగాలకు చెందిన ప్రతినిధులు తాకిడి ఎక్కువైంది. దాంతో అమరావతికి 25కిలో. మీటర్ల దూరంలో ఉన్న గన్నవరం విమానాశ్రయానికి వచ్చిపోయే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గత ఏడాది 8 నెలల్లో ఈ విమానాశ్రయం నుంచి 2,48,662 మంది ప్రయాణించగా ఈ ఏడాది అదే కాలంలో 4,37,928 మంది ప్రయాణించారు. విశాఖ నగరం వివిధ పరిశ్రమలు, ఐటి రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి గత ఏడాది 11,00,114 మంది ప్రయాణించగా ఈ ఏడాది 15,25,518 మంది ప్రయాణించారు. 39 శాతం మంచి ప్రయాణికులు పెరిగారు. ఏడుకొండల స్వామి వారికి భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తిరుపతి విమానాశ్రయం నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య 43 శాతం పెరిగింది. గత ఏడాది ఇక్కడ నుంచి 2,01,272 మంది ప్రయాణించగా ఈ ఏడాది 2,87,131 మంది ప్రయాణించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందే క్రమంలో ఇక్కడ నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య 21 శాతం పెరిగింది. గత ఏడాది ఇక్కడ నుంచి 1,41,440 మంది ప్రయాణించగా ఈ ఏడాది 1,71,491 మంది ప్రయాణించారు. కడప విమానాశ్రయంలో ఈ ఏడాదే రాకపోకలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఇక్కడ నుంచి 6,544 మంది ప్రయాణించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓ ప్రైవేటు విమానాశ్రయం కూడా ఉంది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ స్థిరమైన రెండంకెల ఆర్థిక వృద్ధి రేటు సాధించే క్రమంలో విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో వౌళిక వసతుల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ - పబ్లిక్ భాగస్వామ్యంతో విమానరంగాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు. రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉండటంతో దీని ప్రాధాన్యత పెరిగింది. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా విమాన సర్వీసులు నడపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ టెర్మినల్‌తో దీనికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభిస్తుంది. గన్నవరం - విశాఖపట్నం, గన్నవరం - హైదరాబాద్, గన్నవరం - తిరుపతి, గన్నవరం - కడప మధ్య సర్వీసులు పెంచుతారు. అందువల్ల తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతారు. రాష్ట్రంలో అతి పెద్దదైన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాలకు కూడా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దీనిని కూడా అభివృద్ధి చేస్తారు.
రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయంలో రన్‌వేని విస్తరణ కోసం 850 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం ఉన్న 1850 మీటర్ల రన్‌వేను 3,165 మీటర్లకు పొడిగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ రన్‌వే విస్తరణ పనులు 2018 ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తారు. విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డు విమానాశ్రయం, విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో నెల్లూరు జిల్లా దగదుర్తి విమానాశ్రయం, కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కొత్తగా నిర్మించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేశ విదేశీ వ్యాపారులు, అధికారులు, పర్యాటకులకు గన్నవరం విమానాశ్రయం ఒక్కటే సరిపోదన్న ఆలోచనతో దీనిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5వేల ఎకరాలలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం (పిపిపి)తో అంతర్జాతీయ స్థాయిలో దీనిని నిర్మిస్తారు. అయితే దీనికి ఇంకా స్థల నిర్ణయం జరగలేదని అధికారులు చెప్పారు.

రాబరీ కేసులో ముగ్గురు విద్యార్థులు అరెస్టు

విజయవాడ (క్రైం), డిసెంబర్ 28: రాబరీ కేసులో ముగ్గురు బిటెక్ విద్యార్థులను సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం విజయటాకీస్ సెంటర్‌కు చెందిన చెన్నంశెట్టి వంశీకృష్ణ (22) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అదేవిధంగా ఏలూరురోడ్డు రామమందిరం పరిసరాల్లో నివాసముంటున్న కృష్ణమూర్తి బాలమురళికృష్ణ (19) బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నెల్లూరుకు చెందిన రోకటి భానుప్రకాష్ (19) కూడా బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. భానుప్రకాష్ లబ్బీపేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఒకే కాలేజీలో చదువుతున్న ఈముగ్గురూ స్నేహితులు. అయితే చదువుతో పాటు నేరబాట పట్టిన ఈ ముగ్గురూ దొంగతనాలను మార్గంగా ఎంచుకుని ఈనెల 28న రాత్రి 11గంటల సమయంలో గాంధీనగర్‌లోని రాక్స్ బార్ సందులో కొంతమంది ముఠా కార్మికులు పని ముగించుకుని కూలి డబ్బులు పంచుకుంటుండగా నేరానికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితులను 24 గంటలు తిరగకుండానే అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.

అసంఘటిత కార్మికులకు
ఇఎస్‌ఐ కార్డులు మంజూరు చేయాలి
పాతబస్తీ, డిసెంబర్ 28: నగరంలోని అసంఘటిత కార్మికులందరికీ ఇఎస్‌ఐ కార్డులు మంజూరు చేయాలని అలాగే సిఎం ప్రత్యేక నిధులు కేటాయించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం భవానీపురం ఐరన్ యార్డులో అసంఘటిత కార్మికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఠా కార్మిక సంఘం నగర నాయకుడు ఇవి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. కార్మిక శ్రమ క్కూడా ఇన్‌కంటాక్స్ వసూలు చేయడానికి ఆన్‌లైన్ బ్యాంకింగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని అహ్మద్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్ల కుబేరులు ఇబ్బందులు పడలేదని సామాన్యులే బ్యాంకుల వద్ద బారులు తీరారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యాయని ఆనంద పడుతున్నారని, గత పుష్కరాలకు మూడు వేల కోట్లు నిధులు మంజూరు కాగా కేవలం 1600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మిగిలిన 1400 కోట్లను నగర పాలక సంస్థ కార్పొరేటర్లు పంచుకున్నారని ముజఫర్ అహ్మద్ ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు వల్ల కార్మికుల ఆదాయం 30శాతం తగ్గిందని, పేదలకోసమే నల్ల కుబేరుల భరతం పడతానని పదే పదే ప్రకటిస్తున్న ప్రధాని మోదీ వేసుకునే డ్రెస్ విలువ రూ.10 లక్షలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఠా వర్కర్స్ అధ్యక్షుడు బి.సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు ఎల్‌ఎం కృష్ణమోహన్, లారీ ముఠా కార్మిక సంఘ నాయకులు తదితర సంఘ కార్మికులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సాగునీటి వ్యవసాయ ప్రక్రియలో
సామాజిక పరిజ్ఞానం అవసరం
* జనవనరుల రాష్ట్ర అపెక్స్ కమిటి సభ్యుడు ఆళ్ల
విజయవాడ, డిసెంబర్ 28: సాగునీటితో వ్యవసాయమనే ప్రక్రియలో సామాజిక పరిఙ్ఞనం అవసరమని జలవనరుల శాఖ రాష్ట్ర అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి పకధంలో భాగంగా జలవనరుల శాఖ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్రంలో భాగస్వామ్య నీటి యాజమాన్య పద్ధతులపై సాగునీటి సంఘాలకు శిక్షణ కార్యక్రమం అనే అంశంపై బుధవారం ఒక్కరోజు పూర్తి శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సరఫరాదారులైన ఇంజనీర్లు- వినియోగదారులైన రైతుల సమష్టి కృషి, సాగునీటి వ్యవసాయానికి కేవలం ఇంజనీర్లు ఇచ్చే సాంకేతిక నైపుణ్యం మాత్రమే చాలదన్నారు. సామాజిక పరిఙ్ఞనం అవసరమని భావించిన ప్రభుత్వం 1997లో ఆంధ్రప్రదేశ్ రైతుల నీటిపారుదల వ్యవస్థల చట్టం రూపొందించి రైతులకు నిర్ణయాత్మక భాగస్వామ్యాన్ని కల్పించిందన్నారు. 2015లో ప్రస్తుత ప్రభుత్వం సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్ధరించి రాష్టవ్య్రాప్తంగా ఆరువేల నీటి వినియోగదారుల సంఘాలను నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద 105 సాగునీటి వినియోగదారుల సంఘాలను, కుడికాలువ కింద 404 సాగునీటి వినియోగ సంఘాలను పునరుద్ధరించిందన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సాగునీటిని ద్రవ బంగారంగా భావించి సాగునీటి సంఘాల అధ్యక్షులు పరిమిత నీటితో ఆయుకట్టులోని చివరి ప్రాంతానికి సాగునీరు తీసుకెళ్లేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సాగునీటి సంఘాలను బలోపేతం చేయడం, సమర్థ నీటి వినియోగం, రైతుల భాగస్వామ్యం, విధులు, నిధులు తదితర అంశాల మీద జలవనరుల నిపుణులు, అధికారులు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపిడబ్ల్యూఎస్‌ఐపి ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ పిఎస్ రాఘవయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటి వరకు 2104 కోట్ల రూపాయల పనులు 86శాతం పూర్తయ్యాయని మిగిలిన పనులకు కూడా పాదర్శకంగా జరిగేందుకు నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయుకట్టు కింద కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు, కుడికాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొనగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు వీర్రాజు, కుడికాలువ ప్రాజెక్టు కమిటి చైర్మన్ జివి భుజంగరాయలు, ఎడమకాలువ ప్రాజెక్టు కమిటి చైర్మన్ వై పుల్లయ్య, చౌదరి, నీటి పారుదల రంగ నిపుణులు కె పద్మ, ఎన్‌ఎస్‌పి ఎస్‌ఇ ఎం వెంకటరమణ, ఎఇ ఎన్ అర్జునరావు, రాష్ట్ర భూగర్భ జల శాఖ జాయింట్ డైరెక్టర్ ఎ వరప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.