కృష్ణ

డెల్టా రైతులకు ఊపిరిపోసిన పట్టిసీమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 10: కరువు కోరల్లో చిక్కుకున్న డెల్టా రైతులకు పట్టిసీమ ప్రాజెక్టు ఊపిరి పోసిందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. మండల పరిధిలోని పెదయాదర గ్రామంలో మంగళవారం జన్మభూమి గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా డెల్టాకు వచ్చిన గోదావరి జలాలతో ఈ ప్రాంత రైతులు అధిక దిగుబడులు సాధించగలిగారన్నారు. ఇందుకు రైతులంతా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞులై ఉండాలన్నారు. ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించిన పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించి గోదావరి జలాలతో డెల్టా భూములను సస్యశ్యామలం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గోదావరి జలాలు ఈ ప్రాంత వ్యవసాయ భూములను సారవంతంగా చేశాయన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించటంతో పాటు కేంద్రం నుండి తొలి విడతగా రూ.1900 కోట్లు నాబార్డు నిధులను తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సఫలీకృతులయ్యారన్నారు. 2019 నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి ఆంధ్రా, రాయలసీమలో నీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. చంద్రన్న బాట పేరుతో ప్రతి రోడ్డుని సిసి రోడ్డుగా అభివృద్ధి పర్చి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. అలాగే మంచినీటి సదుపాయానికి పెద్ద ఎత్తున పైప్‌లైన్లు వేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షుడు తలారి సోమశేఖర్, ఎంపిడివో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ బి నారదముని తదితరులు పాల్గొన్నారు.