కృష్ణ

స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 10: స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తుకు ఊతమిచ్చే స్టేడియం నిర్మాణాన్ని అడ్డుకోవద్దని పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు మంగళవారం పలు రాజకీయ పార్టీల నాయకులను హెచ్చరించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో కొన్ని రాజకీయ శక్తులు కులాల రంగు పులిమి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటం హేయకరమన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో సమావేశమైన ఐక్య విద్యార్థి సంఘ నాయకులు స్టేడియం నిర్మాణ వివాదంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. బందరు పోర్టుతో పాటు స్టేడియం నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అన్నారు. అటు కల సాకారమవుతున్న తరుణంలో కొంత మంది స్వార్థ రాజకీయాల కోసం లేనిపోని అల్లర్లు సృష్టిస్తూ తమ భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చర్యలను విద్యార్థి లోకం తీవ్రంగా ఎదుర్కొంటుందన్నారు. భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ అయిన బందరు వాసి సికె నాయుడు విగ్రహాన్ని కూడా ఇటీవల పరాసుపేట సెంటరు కూడలిలో ఏర్పాటు చేయగా దాన్ని సైతం స్వార్థ రాజకీయాల వల్ల తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికె నాయుడు జన్మనిచ్చిన మచిలీపట్నంలో స్టేడియం నిర్మాణం ఎంతైనా అవసరమన్నారు. కేవలం కొంత మంది అమాయకులను రెచ్చగొట్టి ధర్నాలు చేసినంత మాత్రాన స్టేడియం నిర్మాణం ఆగదన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. స్టేడియం నిర్మాణానికి విద్యార్థులంతా ఏకమై ఉద్యమిస్తుందన్నారు. ఈ సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చిగోళ్ల యశోదర్, ఎబివిపి జిల్లా కన్వీనర్ మాగంటి అనీల్, ఎబివిపి పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటా వెంకటేష్, ఎబివిపి పట్టణ కార్యదర్శి పసుపులేటి రాఘవ, ఎబివిపి జిల్లా కో-కన్వీనర్ రాంప్రసాద్, ఎపిఎస్‌ఎఫ్ పట్టణ అధ్యక్షుడు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

అపర భగీరథుడు చంద్రబాబు: ఎంపి కొనకళ్ల
కృత్తివెన్ను, జనవరి 10: డెల్టాను ఎడారి కాకుండా కాపాడిన భగీరథుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొమాళ్లపూడి గ్రామంలో జరిగిన జన్మభూమి గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ కొమాళ్లపూడితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. మండలంలో మంచినీటి, సాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమేనన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని త్వరలో మాట్లం వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా నీటి ఇబ్బందులను తొలగిస్తామన్నారు. ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మాట్లాడుతూ మునిపెడ నుండి కొమాళ్లపూడి వరకు ఉన్న ప్రధాన రహదారిని త్వరలో నిర్మించటం జరుగుతుందన్నారు. రూ.304 కోట్లతో 216ఎ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు. జన్మభూమిలో వచ్చే ప్రతి దరఖాస్తుకు పరిష్కారం జరుగుతుందన్నారు. మాజీ శాసనసభ్యుడు బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం కలిగిన నాయకుడని కొనియాడారు. అనంతరం రేషన్ కార్డులు, సంక్రాంతి కానుకలు పంపిణీ, గర్భిణీలకు సీమంతాలు నిర్వహించారు. గ్రామస్థుడు, ఎంపి చిరకాల మిత్రుడు కూనసాని సత్యనారాయణ ఎంపి నారాయణను, ఎమ్మెల్యే కాగిత, వేదవ్యాస్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సభలలో మండల ప్రత్యేక అధికారి ఎన్‌వి సత్యనారాయణ, ఏఎంసి చైర్మన్ వాటాల నరసింహస్వామి, ఎంపిపి వలవల సత్యనారాయణ, జెడ్పీటిసి ఒడుగు తులసీరావు, డిసి చైర్మన్ నెక్కంటి విజయ భాస్కరరావు, మండల టిడిపి అధ్యక్షుడు గుడిశేవ కనకయ్య, అంబటి కాంతారావు, వైస్ ఎంపిపి తమ్ము మురళీ, మాజీ ఎఎంసి చైర్మన్‌లు ఇల్లూరి సురేష్, కూనసాని గరుడప్రసాద్, జిల్లా కార్యదర్శులు కూనసాని చిన్న, చేకూరి వెంకట్రావు, పిన్నింటి రత్తయ్య, సర్పంచ్ కొక్కిలిగడ్డ బాపూజీ, మాజీ సర్పంచ్ వల్లభు బాబూరావు, నీటి సంఘం అధ్యక్షుడు దాసరి ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కలకలం రేకెత్తించిన చైన్ స్నాచింగ్
చల్లపల్లి, జనవరి 10: స్థానిక మండపం బజారులో మంగళవారం తెల్లవారు ఝామున జరిగిన చైన్ స్నాచింగ్ కలకలం రేకెత్తించింది. వేముల లక్ష్మీకుమారి తన ఇంటి ఆవరణలోని బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు తెల్లవారు ఝామున 4.30గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయటకు రాగా అప్పటికే అక్కడ మాటువేసిన గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలోని 32 గ్రాముల బరువైన బంగారు నాముతాడును లాక్కుని ఇంటి వెనుక నుండి గోడ దూకి పరారయ్యాడు. ఒక్కసారిగా జరిగిన ఘటనకు కంగుతిన్న లక్ష్మీకుమారి వెంటనే తేరుకుని కేకలు వేసినప్పటికీ ఫలితం దక్కలేదు. స్థానికులతో కలిసి లక్ష్మీకుమారి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ డి చంద్రశేఖర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థల పరిశీలన చేయటంతో పాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వౌలిక సదుపాయాల కల్పనకు టిడిపి విశేష కృషి: ఎంపి కొనకళ్ల
పామర్రు, జనవరి 10: గ్రామాలలో వౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర టిడిపి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ, సహకరాలు అందిస్తుందని పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఉండ్రపూడిలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న ఎంపి నారాయణరావు మాట్లాడుతూ ప్రతి గ్రామానికీ ఎంపి నిధులు ఏదో ఒక అభివృద్ధి పనికి కేటాయిస్తానని వెల్లడించారు. ఎంపి నిధులతో నిర్మించిన రెండు రోడ్లు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ మూడు రోడ్లను కొనకళ్ల ప్రారంభించారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ మండపాక శంకరబాబు, జెడ్పీటిసి పొట్లూరి శశి, ఎంపిపి దగ్గుపాటి ఉష, సర్పంచ్ వెంకయ్య తదితరులు మాట్లాడారు. అలాగే పామర్రులో జరిగిన జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే కల్పన మాట్లాడుతూ జన్మభూమి పేదలపాలిట వరమన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య జన్మభూమి నిర్వహణ లక్ష్యాన్ని వివరించారు. కాగా ఎన్ని సార్లు గ్రామసభలు జరిగినా అర్జీలు తీసుకుంటున్నారు తప్పితే సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే కల్పన, వర్ల రామయ్య మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన సద్దుమణిగింది.
క్రీడా, సాంస్కృతిక పోటీల్లో అవనిగడ్డ డిఇడి విద్యార్థుల ప్రతిభ
అవనిగడ్డ, జనవరి 10: గుంటూరు జిల్లా బోయిపాలెం డిఇడి కళాశాలలో ఇటీవల నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీలలో స్థానిక మండలి వెంకటకృష్ణారావు డిఇడి కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా కళాశాలలో మంగళవారం విజేతలైన విద్యార్థులకు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ బహుమతులు అందచేశారు. ఖోఖోలో విన్నర్స్‌గా, కబడ్డీలో రన్నర్స్‌గా, డ్యాన్స్‌లో పి అర్చనాదేవి ద్వితీయ స్థానం, షార్ట్‌పుట్‌లో పి వౌనిక ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. విజేతలను బుద్ధప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విష్ణుప్రసాద్, నాగరాణి, మరియమ్మ, అశోక్ కుమార్, కోటేశ్వరరావు, శ్రీ్ధర్, విద్యార్థులు పాల్గొన్నారు.

మొక్కుబడిగా సామాజిక తనిఖీ ప్రజావేదిక
- ప్రజాప్రతినిధులు, అధికారులు దూరం
- రూ.4,838 రికవరికి ఆదేశాలు

తోట్లవల్లూరు,జనవరి 10: తోట్లవల్లూరులో మంగళవారం జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక మొక్కుబడిగా సాగింది. 16గ్రామాల్లో డిసెంబర్ 31 నుంచి జనవరి 9 వరకు విలేజ్ సోషల్ ఆడిటర్స్‌గా నియమించిన సిబ్బంది ఉపాధిహామీ పనులు, కూలీలకు డబ్బులు అందిన విధానం, పింఛన్‌ల పంపిణీ విధానంపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల నివేదికలను బహిర్గంతం చేసేందుకు మంగళవారం స్థానిక బాలుర వసతి గృహం వద్ద ప్రజావేదిక ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజావేదిక కొనసాగింది. అయితే ఈ ప్రజావేదికకు ప్రజాప్రతినిధులు, అధికారులు గైర్హాజరయ్యారు. ప్రజలు పాల్గొనలేదు. కేవలం ఉపాధిహామి ఎఫ్‌ఎలు, సిబ్బంది,విలేజ్ సోషల్ ఆడిటర్స్ మాత్రమే పాల్గొన్నారు. 16 మంది సర్పంచ్‌లకు ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. గతేడాది మార్చిలో జరిగిన పంటబోదెల తవ్వకం పనులను ఇపుడు తనిఖీ చేసి సక్రమంగా లేవని తేల్చటం సరికాదని ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. తరువాత ఎంపిపి వెళ్ళిపోయారు. డ్వామా అడిషనల్ పిడి వి జ్యోతిబసు, డ్వామా విజిలెన్స్ అధికారిణి వై సుభాషిణి పర్యవేక్షణలో ప్రజావేదిక నడిపారు. చివరకు 16 గ్రామాల్లో రూ.4,838 రికవరీకి ఆదేశాలు జారీ చేశామని జ్యోతిబసు తెలిపారు. శివారెడ్డి ఆగ్రహం: ప్రజావేదిక సమాచారం ఎందుకు తెలపలేదని పెనమకూరు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు కళ్ళం శివారెడ్డి ప్రజావేదికపై ఉన్న అధికారులను నిలదీశారు. తమ నీటిసంఘం పరిధిలో ఏయే పనులు చేశారో, వాటిని ఎవరు తనిఖీ చేశారో తెలపాలని నిలదీశారు. తూతూమంత్రంగా ప్రజావేదిక నిర్వహించిన తీరుపై ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీలకు తోట్లవల్లూరు విద్యార్థులు

తోట్లవల్లూరు, జనవరి 10: ఈ నెల 17,18,19 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీలకు అండర్ 14 బాలికల విభాగంలో జిల్లా నుంచి స్థానిక జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 11 మంది బాలికలు అర్హత సాధించారని హెచ్‌ఎం ధనలక్ష్మి మంగళవారం తెలిపారు. ఇటీవల విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సెలక్షన్‌లో పిపివిఎస్‌ఎన్ దుర్గ్భావాని, సిహెచ్ స్వాతి, ఎండి ఖదీరాబేగం, అబ్దుల్ సాజిద, పి భాను, జి పుష్పాంజలి, సీహెచ్ మమత, వి భాగ్యశ్రీ, ఎల్ పావని, వి వనితకీర్తి, ఎ లావణ్య రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. ఈ నెల 16వ తేదిన ఈ 11 మంది శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరతారని చెప్పారు. పిడి విజయలక్ష్మి, పిఈటి మణి, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.

జాతీయ స్థాయి సైన్స్ ఒలింపియాడ్‌లో వివేకానంద విద్యార్థుల ప్రతిభ

మైలవరం, జనవరి 10: జాతీయ స్థాయి సైన్స్ ఒలింపియాడ్‌లో స్థానిక వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు విజయభేరి మోగించారు. ఇటీవల జరిగిన ఈ19వ జాతీయ స్థాయి పోటీలలో ఐదుగురు విద్యార్థులు బంగారు పతకాలు, ఐదుగురు విద్యార్థులు రజత పతకాలు, నలుగురు కాంస్య పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఎంవి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. భవ్యసాయి, లీలామానస, హేమ హర్షిత, భరణి కుమార్‌లు బంగారు పతకాలు సాధించి లెవెల్-2 పరీక్షకు అర్హత సాధించినట్లు తెలిపారు. కాగా విజేతలను ప్రిన్సిపాల్‌తోపాటు కరస్పాండెంట్ పి రాజారెడ్డి, బండి రామారావు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అభినందించారు.