కృష్ణ

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద ‘జియోఫెన్సింగ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 10: రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి జిల్లాలోనూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేయాలని, ఈదిశగా ఓ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ప్రతి ఏడాది పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు అన్ని విధాల పోలీసుశాఖ కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని దీనిలో భాగంగా 13జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు దిశాదశ నిర్ధేశం చేసే క్రమంలో డిజిపి మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో రహదారి భద్రతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ప్రమాదాలు సంభవించే బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ‘ఎలర్ట్ మేసేజ్‌లను పంపే యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి వాటికి జియో ట్యాగ్ పద్ధతిని అనుసంధానించి జియో ఫెన్సింగ్ చేయడం జరగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఐజి టెక్నికల్ దామోదర్, ఏలూరు రేంజ్ డిఐజి పివిఎస్ రామకృష్ణ, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, రాజమండ్రి అర్బన్ ఎస్పీ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలను తెరచి
కందులు కొనాలి
విజయవాడ, జనవరి 10: రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కందులు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌లు నేడొక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం బోనస్‌తో కలిపి కందుల మద్దతు ధర 5050 రూపాయలుగా నిర్ణయించింది. కాని ప్రస్తుతం మార్కెట్‌లో వ్యాపారులు కందులు క్వింటా రూ.4వేల నుండి రూ.4,200లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు రెండు క్వింటాలు కూడా దిగుబడి రాలేదన్నారు. కర్నాటక ప్రభుత్వం కేంద్రం కల్పించిన మద్దతు ధరకు తోడుగా మరో 450 రూపాయలు బోనస్ ప్రకటించి రైతుల నుండి కందులు కొనుగోలు చేస్తున్నదన్నారు. మన రాష్ట్రంలో కూడా కర్నాటకలో మాదిరిగా కంది పంటకు బోనస్ ప్రకటించి కొనుగోలు కేంద్రాలు తెరచి కొనుగోలు ప్రారంభించాలని పి.రామచంద్రయ్య, కెవివి ప్రసాద్‌లు డిమాండ్ చేసారు.