కృష్ణ

ప్రజల శక్తిసామర్థ్యాలను వెలికితీసే సాధనం పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), జనవరి 10: పుస్తకాలు ప్రజల శక్తిసామర్ధ్యాలను వెలికితీసే ఒక సాధనంగా ఉపయోగపడతాయని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆయన స్వరాజ్య మైదానంలో 28వ పుస్తక మహోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రాంగణంలో హిప్నో కమలాకర్ రచించిన 5 పుస్తకాలను విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హిప్నో కమలాకర్ రాసిన పుస్తకాలు పిల్లలకు సందేశంగా ఉపయోగపడతాయని చెప్పారు. నిస్వార్ధంగా ఆయన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తిరుగుతూ సైకాలజీ ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారని తెలిపారు. హిప్నోటిజం మీద తన కుటుంబంలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పనిచేస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని చెప్పారు. బుధవారం కడప జిల్లా పులివెందులలో కృష్ణావాటర్ సాగు, తాగునీరు కోసం ముఖ్యమంత్రి ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారని చెప్పారు. హిప్నో కమలాకర్ మాట్లాడుతూ శరీరానికి సంబంధించిన అన్ని విషయాలను డాక్టర్ సమరం ఎప్పుడో చెప్పారన్నారు. పిల్లలు మొబైల్, టివిలకు ఎడిక్ట్ అవడానికి కారణం కొంతవరకు తల్లిదండ్రులే ప్రధాన కారణమన్నారు. ఉగ్గు పాలతోనే నేటి పిల్లలు ఈ విషయాలకు ఎడిక్ట్ అవుతున్నారని చెప్పారు. డాక్టర్ సమరం మాట్లాడుతూ పెరిగే పిల్లలను స్వేచ్ఛగా పెరగనీయాల్సిన అవసరం ఉందని, అప్పుడే వాళ్లు సమాజం గురించి నేర్చుకుంటారని తెలిపారు. డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికి హిప్నోకమలాకర్ 84 పుస్తకాలు రాశారని, ఇక ముందు కూడా ఈ పంధా కొనసాగించాలని చెప్పారు. పద్మా కమలాకర్ మాట్లాడుతూ ముందు వ్యక్తుల మైండ్ మారాలని, అప్పుడే సమాజం బాగుంటుందని చెప్పారు. ఎపి ప్రోగ్రసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ సమాజంలో పుస్తక చదువరుల సంఖ్య ఏమీ తగ్గలేదని తెలిపారు.
బుక్‌స్టాల్స్‌ను సందర్శించిన
సినీ నటుడు పిళ్లా ప్రసాద్
ప్రాంగణంలోని పలు స్టాల్స్‌ను సినీ రంగస్థల నటుడు పిళ్లా ప్రసాద్ సందర్శించారు. జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వాస్తు పుస్తక ప్రదర్శనలో సాయి త్రిశక్తి నిలయం వ్యవస్థాపకులు డాక్టర్ అచ్చిరెడ్డి రచించిన 200 పుస్తకాలను ఆయన సునిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీసాయిప్రియ పిళ్లా ప్రసాద్‌ను శాలువాతో సత్కరించారు.

కృష్ణా కలెక్టర్ జాతీయ అవార్డు ప్రదానం
* రూ.2లక్షల బహుమతితో సత్కారం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 10: ఆధార్ అనుసంధానంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటంలో కృష్ణా జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలిపినందుకు ‘నేషనల్ అవార్డ్ ఫర్ ఇ-గవర్నెన్స్ గోల్డ్’ను కలెక్టర్ బాబు.ఎ అందుకున్నారు. విశాఖపట్నంలోని నోవాటెల్‌లో మంగళవారం నిర్వహించిన 20వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డును కలెక్టర్ బాబు.ఎకు కేంద్ర ఇన్ఫర్మేషన్, టెక్మాలజీ శాఖ సహాయ మంత్రి పిపి చౌదరి ప్రదానం చేశారు. ఆధార్‌ను అనుసంధానం చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువుల సరఫరాను రాష్ట్రంలోనే తొలిసారిగా కృష్ణా జిల్లాలో అమలు పరచిన ఘనత బాబు.ఎకు దక్కింది. జిల్లావ్యాప్తంగా 2161 చౌకధరల దుకాణాలకు సంబంధించిన 36.3 లక్షల మంది కార్డుదారులకు పారదర్శకంగా నిత్యావసర వస్తువులను నెలలో తొలివారంలోనే సరఫరా చేసిన జిల్లా కలెక్టర్ బాబు.ఎ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డ్ ఫర్ ఇ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డును, రూ.2లక్షల బహుమతిని ప్రకటించింది. అవార్డును కేంద్ర సహాయ మంత్రి పిపి చౌదరి, రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి డా. పల్లె రఘునాథరెడ్డి కలెక్టట్ బాబు.ఎకు ప్రదానం చేసి సత్కరించారు. ఈసందర్భంగా కృష్ణా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు కలెక్టర్ బాబు.ఎకు అభినందనలు తెలిపారు.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

పాతబస్తీ, జనవరి 10: ఆటోలోనివారు నన్ను అవమానించారు వారిని ఘోరంగా శిక్షించాలని సూసైడ్ నోట్ రాసిన ఇంటర్ విద్యార్థిని తనను తానే ఘోరంగా శిక్షించుకుని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం సాయంత్రం కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం కెఎల్‌రావు నగర్‌లో నివాసముంటున్న రాయపురెడ్డి ప్రసాద్, ఈశ్వరి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. వారిలో పెద్దమ్మాయి అనిత (16) పాతబస్తీలోని గాంధీజీ మహిళా కళాశాలలో ఎంఇసి ప్రథమ సంవత్సరం ఇంటరు చదువుతోంది. సోమవారం సాయంత్రం కళాశాల వదిలాక షేర్ ఆటోలో ఇంటికి బయలుదేరింది. శ్రీనివాసమహల్ సెంటర్‌లో ఆటోలోని ఇద్దరు మహిళలు దిగిపోయారు. అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు యువకులు ఆ బాలిక పట్ల అవమానం, అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆటోలో నుండి దిగి ఇంటికి చేరిన బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. ఆమె బాధను అర్ధం చేసుకున్న తల్లిదండ్రులు అంతగా ఇబ్బందులు పడుతుంటే కళాశాల మానుకొని ఇంట్లోనే వుండమన్నారు. అప్పటి నుండి వౌనంగా రోదించిన బాలిక చావే శరణ్యమని భావించింది. తండ్రి ప్రసాద్ కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలో చెరకు రసం మిషన్ వద్ద పని చేస్తుండగా మంగళవారం ఉదయం పనికి వెళ్లాడు. చిన్నమ్మాయి ఆర్‌సిఎం స్కూల్‌లో 9వ తరగతి చదువుతూ ఆ బాలిక స్కూలుకు వెళ్లింది. తల్లి ఈశ్వరి బందరురోడ్డులోని కాంధారి హోటల్‌లో పనిచేస్తూ ఆమె పనికి వెళ్లింది. అనిత మాత్రం ఇంట్లోనే వుండిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వంట గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్కూలు నుండి ఇంటికి వచ్చిన మృతురాలు చెల్లి విషయం గ్రహించి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ప్రసాద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ దుర్గారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని సిఐ దుర్గారావు ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. కాని సోమవారం సాయంత్రం గాంధీజీ మహిళా కళాశాల వద్ద నుండి సాయిరామ్ ధియేటర్ రూటులో ప్రయాణించిన ఆటోల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.