కృష్ణ

సత్ఫలితాలను ఇవ్వని జన్మభూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన నాల్గవ విడత జన్మభూమి గ్రామసభలు సత్ఫలితాలను ఇవ్వలేదు. గడిచిన రెండున్నర యేళ్లలో అధికార తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు వేదికగా మల్చుకున్న ఈ గ్రామసభలు జనాగ్రహానికి గురయ్యాయి. ఈ నెల 2వతేదీన ప్రారంభమైన జన్మభూమి గ్రామసభలు బుధవారంతో ముగిశాయి. జిల్లాలోని అన్ని పురపాలక సంఘ వార్డులు, గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామసభల ద్వారా ప్రజల ముందుకు వెళ్లిన అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రజల నుండి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రతి గ్రామసభలో ప్రజలు తమ సమస్యలపై గళం ఎత్తారు. వీరికి తోడు ప్రతిపక్షాలు అండగా నిలిచి ప్రజల పక్షాన నిలబడి అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నించాయి. పలు ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నాయకులు గళమెత్తారు. జన్మభూమి గ్రామసభల్లో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను బుట్టదాఖలు చేశారంటూ ఆరోపించారు. కేవలం ప్రచారార్భాటానికే జన్మభూమి అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. నూతనంగా మంజూరైన రేషన్ కార్డులు, పెన్షన్‌లు పంపిణీ చేసినప్పటికీ ప్రధాన సమస్య నివేశన స్థలాల విషయంలో ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వలేకపోయారు. గతంలో నిర్వహించిన గ్రామసభల్లో నివేశన స్థలాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అయితే వాటిపై ప్రభుత్వం ఎటువంటి పరిష్కార చర్యలు తీసుకోకపోవటంతో ప్రతిపక్షాన్ని దీన్ని అసరాగా చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించాయి. కాగా పలుచోట్ల అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా గత జన్మభూమి సభల్లో ఇచ్చిన అర్జీలపై ఏమి చేశారంటూ ప్రశ్నించడం కన్పించింది. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేని స్థితిలో వారు కూడా గ్రామసభల్లో అధికారులను నిలదీయాల్సిన పరిస్థితి ఎదురైంది. అధికారంలోకి వచ్చి రెండున్నర యేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క గృహాన్ని కూడా నిర్మించలేకపోయారంటూ ప్రతిపక్ష నేతలు, ప్రజలు ఆరోపణలకు దిగారు. ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుంటే ప్రచారానికే పరిమితమవుతున్నారంటూ గ్రామసభల్లో నిప్పులు చెరిగారు. మొత్తం మీద పది రోజుల పాటు గ్రామ గ్రామానికి వెళ్లిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు వివరించడానికే పరిమితమయ్యారనే చెప్పాలి.

పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జిల్లా స్థాయి సంక్రాంతి సంబరాలు
* ఆర్డీఓ పి సాయిబాబు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 11: తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా జిల్లా స్థాయిలో సంక్రాంతి సంబరాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని బందరు ఆర్డీఓ పి సాయిబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఆర్డీఓ సాయిబాబు బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఈనెల 13వ తేదీ ఉదయం 8గంటలు నుండి జిల్లా పోలీసు గ్రౌండ్స్‌లో జిల్లా స్థాయి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలలో రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, బొమ్మలకొలువు, భోగిపండ్లు, ధాన్యం ప్రదర్శన, కోలాట ప్రదర్శనలు, పగటి వేషాలు, కూచిపూడి నృత్యాలు, జానపద నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలుగు వంటకాల ప్రదర్శన, గంగిరెద్దుల ప్రదర్శన, పశు ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన, ఐసిడిఎస్, పశుసంవర్ధక తదితర శాఖలకు సంబంధించిన స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో మడ విసి ఎం వేణుగోపాలరెడ్డి, ఎంపిడిఓ జివి సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హత్య కేసులో నిందితులు అరెస్టు

నందిగామ, జనవరి 11: మండలంలోని రామిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన తుమ్మల ప్రసాద్ హత్య కేసులో అతని భార్య అంజలి ఆమెతో సంబంధం కల్గి ఉన్న పల్లెకంటి ప్రభాకరరావు ఎలియాస్ చిన్నబాబులను బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చినట్లు డిఎస్‌పి ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రసాద్‌ను అతని భార్య అంజలి, ఆమె స్నేహితుడు ప్రభాకరరావు గత నెల 27వ తేదీ తెల్లవారుఝామున హత్య చేసి అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పడవేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు ఘటన జరిగిన ప్రదేశం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్న ఉద్దేశంతో 10వ తేదీ (మంగళవారం) ఇక్కడకు కేసును బదిలీ చేయగా ఇక్కడి స్టేషన్‌లో కేసును రీ రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు. దర్యాప్తులో భాగంగా డిఎస్‌పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఇన్స్‌పెక్టర్ (ఎస్‌హెచ్‌ఒ) సత్యనారాయణ రాబడిన సమాచారం మేరకు ఇద్దరు ముద్దాయిలను బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ తులసీరామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

బాలల వ్యక్తిత్వ వికాసానికి పుస్తకం దోహదం
విజయవాడ కల్చరల్, జనవరి 11: భావితరానికి మంచి సాహిత్య వారసత్వాన్ని అందించేందుకు పుస్తక మహోత్సవాలు ఉపయోగపడతాయని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి, సిఆర్‌డిఎ పూర్వ కమిషనర్ నాగులాపల్లి శ్రీకాంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. స్వరాజ్య మైదానంలో నిర్వహిస్తున్న 28వ పుస్తక మహోత్సవ ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలు బోధించే మంచి పుస్తకాలను పిల్లలకు పరిచయం చేసే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. డిజిటల్ సాంకేతిక పెరుగుతున్నా పుస్తకానికి ఆదరణ తగ్గలేదని అన్నారు. ఆదాయపన్ను జాయింట్ కమిషనర్ టి.సత్యానంద్ మాట్లాడుతూ స్ఫూర్తినిచ్చే వ్యక్తుల జీవితాలను చిన్నారులకు పరిచయం చేసే శక్తి పుస్తకాలకు ఉందన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. విజయభాస్కర్ మాట్లాడుతూ వ్యక్తులను సమాజానికి ప్రయోజనకరమైన పౌరులుగా రూపొందించే శక్తి పుస్తకాలకు ఉందన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షులు బెల్లపు బాబ్జీ మాట్లాడుతూ 28 పుస్తక మహోత్సవం అనేక కొత్త పుంతలు తొక్కిందన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఉపాధ్యక్షులు లక్ష్మయ్య మాట్లాడుతూ స్వరాజ్య మైదానాన్ని ప్రస్తుతం ఉన్నట్లు ఖాళీగా ఉంచి పుస్తక మహోత్సవం నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం కార్యదర్శి సాయిరాం వందన సమర్పణ చేశారు.
నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో పలు పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు బుధవారం సాయంత్రం నిర్వహించిన ముగింపుసభలో బహుమతులను అందించారు. పద్యాలు శ్లోకాలు విభాగంలో ప్రథమ బహుమతి ఎంఎస్‌ఆర్ ఇంగ్లీషు మీడియం స్కూల్ యుకెజి విద్యార్థిని కె.శే్వత, ద్వితీయ బహుమతి 1వ తరగతి విద్యార్థి హర్షిత్, తృతీయ బహుమతి ఎంఎస్‌ఆర్ స్కూల్ విద్యార్థి జి.గాయత్రి అందుకున్నారు. మూడవ తరగతి విద్యార్థులు అరుణ్‌తేజ్, శ్రీనిక, ఎంఎస్‌ఆర్ స్కూల్ విద్యార్థులు పి.నేహా, కుశలశ్రీ, ముమీనా అనుష్కలు ప్రోత్సాహక బహుమతి పొందారు. వ్యాసరచన విభాగంలో ఎస్వీవి స్కూల్ విద్యార్థి బివిఎస్‌ఎస్ ఆదిత్య మొదటి బహుమతి, బిషప్ స్కూల్ విద్యార్థి ఎం.కనక మహాలక్ష్మి రెండో బహుమతి, ఎంఎస్‌ఆర్ స్కూల్ విద్యార్థి టి.సుమేధ మూడో బహుమతి సాధించారు. చిన్నారుల వక్తృత్వం విభాగంలో పి.సుకన్య ప్రథమ బహుమతి, టిఎస్ వెంకట్ ద్వితీయ బహుమతి సాధించగా, ఎస్వీఎస్ శ్రీకీర్తన, సాకేత్‌లు వ