కృష్ణ

నేటి నుంచి పల్స్‌పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 28: ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లాలో 11 లక్షల 35 వేల 192 గృహాల్లో 3 లక్షల 77 వేల 325 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయని శనివారం తెలిపారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న ఆదివారం నుండి మూడురోజులుల నిర్వహించే పల్స్‌పోలియోలో భాగంగా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించే ర్యాలీని శనివారం కలెక్టర్ బాబు.ఎ, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం నుండి ఫిబ్రవరి 1 వరకు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలియో కేంద్రాలు అందుబాటులో వుంటాయన్నారు. ఫిబ్రవరి 1న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేకంగా ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు చుక్కల మందు వేస్తారని తెలిపారు. పోలియో చుక్కలు వేసే సమయంలో ఆధార్ నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లక్షా 36 వేల 904 మంది ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించామన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, కనకదుర్గ గుడి వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. అవగాహన ర్యాలీలో జాయింట్ డైరెక్టర్, జిల్లా నోడల్ అధికారి డా. నాగమల్లేశ్వరి, డిఎంహెచ్‌ఓ వై కామేశ్వరప్రసాద్, డెప్యూటీ డిఎంహెచ్‌వోలు డా. శోభ, డా. సీతమ్మ, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, నర్సింగ్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

జెఎన్‌ఎన్‌ఆర్‌ఎం పథకంపై పిఎసి సభ్యుల ఫైర్
* సమీక్షలో సమాధానాలు చెప్పలేక నీళ్ళు నమిలిన విఎంసి అధికరణం
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 28: అక్రమాల పుట్టయిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం అమలుపై శాసన సభ ప్రజాపద్దుల ఉప కమిటీ (పిఎసి) మండిపడింది. శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన కమిటీ సభ్యులు శనివారం అందుకు సంబంధించిన ఫైల్స్‌ను పరిశీలించిన నేపథ్యంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అధికారుల పనితీరును తప్పుపట్టింది. పథకంలో జరిగిన, జరుగుతున్న పనులపై ఆడిట్ అధికారులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను తక్షణమే ఆయా అభ్యంతరాలను పరిష్కరించి ప్రస్తుతం అసంపూర్తిగా మిగిలిన పనుల పూర్తికి తీసుకొంటున్న చర్యలపై ప్రణాళిక నివేదికను అందజేయాలని ఆదేశించారు. పిఎసి కమిటీ సభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, నేతృత్వంలో శనివారం ఉదయం విఎంసి కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సమీక్షలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక నీళ్ళు నమిలిన వైనం గమనార్హం కాగా సకాలంలో పూర్తికానీ సంక్షేమ, అభివృద్ధి పనుల కారణంగా పథకం నిర్వీర్యమే కాకుండా లబ్ధిదారులు కూడా సరైన ప్రయోజనం పొందలేరన్న విషయాన్ని గుర్తించి అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద రావాల్సిన నిధులను రాబట్టడంలో చొరవ చూపడమే కాకుండా ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలన్నారు. సభ్యుల ప్రతిపాదనలకు స్పందించిన విఎంసి కమిషనర్ వీరపాండియన్ ఆడిట్ అభ్యంతరాల పరిష్కారానికై కృషి చేయడమే కాకుండా పిఎసి సభ్యుల సూచనలను పరిగణలోకి ఆయా చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. భూగర్భ మురుగునీటి సరఫరా, నీటి సరఫరా, గృహ నిర్మాణాలపై వచ్చిన ఆడిట్ అభ్యంతరాలపై సమీక్షించి సూచనలు చేసారు. పథకంలో కొన్ని ప్యాకేజీలకు చెందిన ఫైల్స్ సక్రమంగా లేకపోవడంపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో విఎంసి ఇంజనీరింగ్ తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.