కృష్ణ

చదువుల తల్లికి వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 1: రానున్న వార్షిక పరీక్షల్లో అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి జన్మనక్షత్రమైన శ్రీ పంచమి సందర్భంగా శ్రీకనకదుర్గమ్మ చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా దివ్య అలంకారంతో విద్యార్థులకు దివ్య దర్శనమిచ్చింది. ఆశీస్సులు ప్రసాదించే అమ్మను దర్శించుకునేందుకు విద్యార్థులు ఉదయం 6గంటల నుండే ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇవోఎ సూర్యకుమారి ఆదేశాల మేరకు 100 క్యూమార్గం గుండా అమ్మవారిని దర్శించుకోనేందుకు సిబ్బంది అనుమతించారు. వివిధ కళాశాలు, హైస్కూల్స్‌కు చెందిన విద్యార్ధులు శ్రీ మల్లిఖార్జున మహామండపం ద్వారా పైకి చేరుకొని అక్కడ శ్రీ సరస్వతీదేవి అలంకారంతో ఉన్న ఉత్సవ మూర్తిన్ని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. విద్యార్ధులకు అమ్మవారి పోటో,రక్ష కవచం, పెన్ను, కుంకుమ ప్రసాదం, చిన్నలడ్డూ, తదితర వాటిని ఒక ప్యాకెట్‌లో వేసి ఉచితంగా అందచేశారు. సుమారు 60వేల మంది విద్యార్ధులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంతో ఉన్న అమ్మవారిని దర్శించుకోనేందుకు ఉదయం నుండే అటు విద్యార్ధులు, ఇటు భక్తులు అధిక సంఖ్యలోతరలి వచ్చారు. ఉదయం 6గంటలనుండి ఉదయం 9గంటలకు వరకు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. దీనికితోడు చదువుల తల్లి సరస్వతీదేవి జన్మనక్షత్రమైన శ్రీ పంచమి సందర్భంగా బుధవారం అమ్మవారిని దర్శించుకొంటే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసంతో పెద్ద ఎత్తున వివిధ రంగాలకు చెందిన విఐపిలు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. దీనికితోడు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులు శ్రీ మల్లిఖార్జున మహామండపం ప్రక్కనే ప్రత్యేకంగా యాగశాలలో శ్రీ సరస్వతీ యాగాన్ని ఏర్పాటు చేయటంతోపాటు అదనంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. దీంతో పలువురు తల్లిదండ్రులు వారి చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో స్వయంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. కాగా బుధవారం ఉదయం అమ్మవారని దర్శించుకున్న భక్తులు అర్జున వీధిలోని ఉచిత అన్నదాన పధకంలో అమ్మవారి మహాప్రసాదాన్ని స్వీకరించారు. తిరిగి సాయంత్రం 5గంటలనుండి విద్యార్ధులు అమ్మవారి సన్నిధికి తరలి రావటం కనిపించింది. రాత్రి 9గంటల వరకు అమ్మవారి సన్నిధిలో రద్దీ కనిపించింది. దీనికితోడు బుధవారం అమ్మవారి సన్నిధిలో అన్ని రకాలైన అర్జిత సేవాలను సైతం నిర్వహించారు.