కృష్ణ

సాంస్కృతిక ప్రదర్శనలు శభాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 11: రెండోరోజు శనివారం పవిత్ర సంగమంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సంగీత నృత్యోత్సవం తిలకించడానికి శాసనమండలి చైర్మన్ డా.ఏ.చక్రపాణి, ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్‌తో పాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెంనాయుడు, చీప్‌విప్ కాల్వ శ్రీనివాస్‌లు హాజరయ్యారు. తొలుత వివేక్ సదాశివమ్ అన్నమాచార్య సంకీర్తనలతో ప్రారంభమైంది. పవిత్ర సంగమం వేదిక వద్ద లయబద్దంగా సాగిన అన్నమాచార్య సంకీర్తనలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. అన్నమయ్య కీర్తనల్లో ప్రసిద్ధిచెందిన శ్రీమన్నారాయణ - గౌళి రాగం, అలరులు కురియగా శంకరాభరణం, భావయామి గోపాలబాల - కల్యాణిరాగం సంకీర్తనలను ఆలపించారు.
నవరస వీణావాదనం కార్యక్రమం డాక్టర్ మాధురిదేవి బృంద గానం చేశారు. ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం నుంచి ఏ గ్రేడ్ పొందిన కళాకారిణి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి పొంది, కచ్ఛపి గనా దురంధరి, గాయత్రీ సంగీత విద్వన్మణి బిరుదులు పొందారు. రామవరపు విజయలక్ష్మి కర్ణాటక సంగీత పాఠశాలను స్థాపించి అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రాగమాలిక వర్ణం, భజనసేయవే మనసా, ముద్దుగారే యశోద, పిబరే రామరసం స్వరాలను ఆలపించారు.
గతంలో మునుపెన్నడూ చూడని రీతిలో బెంగాల్ కళాకారుల ప్రదర్శన అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవ వేదికపై ప్రతిధ్వనించింది. 87ఏళ్ల వయస్సున్న సంచాల యాచక సంగీత సినీ కళాకారుడు పూర్ణదాస్ లయబద్దంగా సాగిన బాల్స్ కచేరీతో ఐదుగురు కళాకారులు సంగీత ప్రదర్శన ఆకట్టుకుంది. బెంగాలీల జీవన విధాన మాధుర్యాన్ని పూర్ణాదాస్ బాల్ తన గాత్రం ద్వారా ఆలపించారు. పూర్ణాదాస్ బాల్ బృందం వారి తనయుడు దుబ్బేందుదాస్ బెంగాల్ సంప్రదాయాలను వివరించారు. యాచక వృత్తి చేసుకుంటూ పాడే గీతాలాపనే బాల్స్‌గా చెబుతారు. సంగీతంతో జాతీయస్థాయిలో ఖ్యాతి గడించారు. యాచక సంచార తెగ ఆలపించే గానమే బాల్. బాల్ అంటే ధర్మమంటే భగవంతుని దర్శించుకోడానికి తనలో తాను సాక్షాత్కరించుకోవడమేనని పూర్ణదాస్ వివరించారు. అనంతమైన సాధన ద్వారా ఇది సాధ్యమవుతుంది. తనలోకి తను ప్రయాణం చేసినప్పుడు పరమాత్ముడు కన్పిస్తారని అంటారు. అమెరికాలోనూ ప్రదర్శనలు చేశారు. వీరిని మండలి చైర్మన్ చక్రపాణి, శాసనసభ ఉపాధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు కళాకారులను సన్మానించారు.
జాతి సంస్కృతికి అద్దంపట్టే కళా ప్రదర్శన లంగాస్. వీరు రాజస్థాన్‌కు చెందిన జానపద కళాకారులు. 15 ఏళ్లుగా వినోద రంగంలో ప్రత్యేక స్థానాన్ని పొంది ప్రపంచ వేదికలపై ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పేరున భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధులుగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రసిద్ధి చెందిన రాజస్థానీ ఫోక్ పాటలను కళాకారులు ఆలపించారు. సాజన్ ఆయియా సఖీ అంటూ సంప్రదాయ సంగీతాన్ని అసువుగా గానం చేశారు. రాజస్థానీ జానపద మాధుర్యాన్ని సికిందర్ లాంగా బృందం ఆలపించిన గానం ఆకట్టుకుంది. ఆటా మహ్మద్ లాంగా చిడతల వాయిద్యాన్ని అందించారు.
గానకోకిల, కవితా సుబ్రమణ్యం సినీ సంగీత ప్రపంచంలో ప్రకాశిస్తున్న ధ్రువతార. సున్నితమైన మరియు మాధుర్యమైన గాత్రంతో వైవిధ్యభరితమైన వివిధ మధుర గీతాలను ఆలపించిన అరుదైన గాయని. తెలుగు ప్రజలకు సుపరిచితురాలైన కవితా, పలుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 18వేలకు పైగా పాటలు పాడారు. భారతీయ భాషలన్నింటిలోనూ ఆమె పాటలు పాడారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్‌డి బర్మన్, ఎఆర్ రెహ్మాన్ వంటి సంగీత దర్శకుల వద్ద పాడారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎన్నో తెలుగు పాటలను ఆమె పాడారు. అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్‌లో కవిత ముందుగా భైరవి చిత్రంలోని పాటతో కవితా గీతాలాపన చేశారు. ఓం నమఃశివాయ.. శివాయ నమః అంటూ భక్తి పారవశ్యంతో పాడారు. లవ్‌స్టోరీ 1942 చిత్రంలోని చుపికసే ఏ క్యాహూవా గీతాన్ని ఆలపించారు.
అసువుగా గజల్స్ పాడటంలో ఈయనిది అందివేసిన చేయి. తలత్ అజీజ్ అద్భుతమైన గజల్స్‌తో ఆకట్టుకున్నారు. 1956లో హైదరాబాద్‌లో జన్మించిన ఈయన మెహదీ హసన్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. బాల్యం నుంచే గజల్స్ నేర్చుకున్నారు. ఇటీవల మేరీదువాయ్ ఆల్బమ్ విడుదల చేశారు. పాపులర్ ఉమ్రా ఉజావ్ చిత్రం నుంచి జిందగీ జబి తేరీ బాజ్వుమిగజల్‌ను ముందుగా పాడి విన్పించారు.
నైనిటాల్‌లో జన్మించిన ఈయన ఆలిండియా రేడియోలో బృంద గాయకుడిగా తన సంగీత సాధన చేశారు. ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించి గోల్డ్, ప్లాటినమ్ డిస్క్‌లు సాధించారు. అంతేకాక అనేక ప్రపంచ రికార్డులు స్థాపించారు పద్మశ్రీ అవార్డు విజేత.
నైనిటాల్‌లో జన్మించిన ఈయన ఆలిండియా రేడియోలో బృంద గాయకుడిగా తన సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేశారు. సంగీత, నృత్యోత్సవ వేదికపై అద్భుత ప్రదర్శన చేశారు. విజన్స్ ఆఫ్ ఇండియా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న అందరి కళాకారులతో చివరగా జరిగిన కార్యక్రమం ఉర్రూతలూగించింది. సంగీత నృత్య కార్యక్రమాల అనంతరం 20 నిమిషాల పాటు పవిత్ర సంగమ కళావేదిక వద్ద భారీగా బాణాసంచా పేల్చడం హాజరైన ఆహూతులను అలరించింది.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాబు.ఎ, నగర కమిషనర్ వీరపాండ్యన్, సాంస్కృతికశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, సంయుక్త కలెక్టర్ గంధం చంద్రుడు, సాంస్కృతికశాఖ సంచాలకులు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.