కృష్ణ

చెత్త సమస్యపై కోర్టుకు హాజరుకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): సింగ్‌నగర్ ఎక్సెల్ ప్లాంట్‌లో అనధికారికంగా చెత్త డంప్ చేయటానికి వ్యతిరేకంగా విజయవాడ మండల లీగల్ సర్వీస్ కమిటీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. లోక్‌సత్తా ఆర్గనైజేషన్ తరఫున నగరాధ్యక్షుడు బి అశోక్‌కుమార్ శనివారం దాఖలుచేసిన పిటిషన్‌కు స్పందించిన మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జడ్జి ఆర్ నిరంజన్ మునిసిపల్ కమిషనర్, సిఎంహెచ్‌ఓ, పొల్యూషన్ కంట్రోల్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న కోర్టుకు హాజరై పిటిషన్‌లో పేర్కొన్న అంశాలకు సమాధానం చెప్పాలని ఆదేశించారు. కొద్దిరోజులుగా సింగ్‌నగర్ ఎక్సెల్ ప్లాంట్‌లో నిల్వ ఉన్న లక్షలాది టన్నుల చెత్తలో మంటలు రాజుకొని రోజుల తరబడి చెత్త తగలబడటం, తద్వారా వెలువడిన పొగతో వాతావరణ కాలుష్యం ఎర్పడిన కారణంగా వేలాది మంది స్థానిక ప్రజలు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలతోపాటు సకాలంలో తగు నివారణ చర్యలు తీసుకోకపోవడాన్ని పిటీషన్‌లో పేర్కొన్న వైనంతో ప్రతివాదులైన విఎంసి కమిషనర్, సిఎంహెచ్‌ఓ, పొల్యూషన్ కంట్రోల్ అధికారుల తీరుపై జడ్జి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అశోక్‌కుమార్ తెలిపారు.