కృష్ణ

ప్రతి ఒక్కరినీ నగదు రహిత సేవల వైపు నడిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 1: ప్రతి ఒక్కరినీ నగదు రహిత లావాదేవీల నిర్వహణ వైపు నడిపించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధికారులకు సూచించారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి జిల్లాను ‘డిజిటల్ కృష్ణా’గా తయారు చేయాలన్నారు. ఇప్పటికే నగదు రహిత లావాదేవీల నిర్వహణలో కృష్ణాజిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా నగదు రహిత లావాదేవీలు మరింత పెరిగే విధంగా ప్రజా ప్రతినిధుల సహకారంతో అధికారులు కృషి చేయాలన్నారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీటిసిలు, ఇఓపిఆర్‌డిలకు నగదు రహిత సేవలపై జిల్లా స్థాయి శిక్షణా తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ జిల్లాలో రేషన్, పెన్షన్, ఎరువుల పంపిణీలో ఆధార్ అనుసంధానంతో నగదు రహిత లావాదేవీలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. దేశం డిజిటల్ విప్లవం వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషితో నగదు రహిత లావాదేవీలలో మన రాష్ట్రం ప్రథమంగా నిలిచిందన్నారు. జిల్లా జనాభాలో సగం మందిగా ఉన్న డ్వాక్రా గ్రూపు మహిళలను సాంకేతిక విజ్ఞానం వైపు నడిపించాలన్నారు. పౌర పంపిణీ వ్యవస్థలో ఎరువులు, విత్తనాలు పంపిణీలో ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలు విస్తృతంగా ప్రోత్సహించడం ద్వారా అక్రమాలు తగ్గి కోట్లాది రూపాయలు ప్రజాధనం ఆదా అవుతుందన్నారు. జిల్లాలో 3లక్షల 61వేల 676 మందికి సామాజిక పెన్షన్‌ల పంపిణీలో 99 శాతం నగదు రహితంగా అందిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందిస్తున్న సేవలు అద్వితీయమన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ డెప్యూటీ సిఇఓ కృష్ణమోహన్, ఆంధ్రాబ్యాంక్ జెడ్పీ బ్రాంచ్ మేనేజర్ రాంబాబు, జెడ్పీటిసిలు లంకే నారాయణ ప్రసాద్, తాతినేని పద్మావతి, గోపాలకృష్ణ గోఖలే తదితరులు పాల్గొన్నారు.
‘ఎడిబాన్’తో కృష్ణా వర్సిటీ ఒప్పందం
మచిలీపట్నం (కల్చరల్), మార్చి 1: శాస్త్ర సాంకేతిక ప్రయోగశాలల పరికరాలను సమకూర్చుకోవడానికి కృష్ణా విశ్వ విద్యాలయం స్పెయిన్‌కు చెందిన ఎడిబాన్ కంపెనీతో ప్రాథమిక అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు బుధవారం తెలిపారు. విజయవాడలో మంగళవారం జరిగిన విశ్వ విద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ విజయరాజు సమక్షంలో ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. ఒప్పంద పత్రాలపై ఉపకులపతి రామకృష్ణారావు, ఎడిబాన్ కంపెనీ ప్రతినిధి అలియాస్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా విశ్వ విద్యాలయంలో వివిధ సాంకేతిక పరికరాల ద్వారా శాస్త్ర సాంకేతిక విద్యను కన్నులకు కట్టునట్టుగా చూపించి బోధించవచ్చన్నారు.

జగన్ శాడిజం మానుకోవాలి
* రోజాకు తొందరపాటు తగదన్న సినీనటి కవిత
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
అమరావతి, మార్చి 1: ప్రతిపక్షనేత జగన్ శాడిజాన్ని ప్రపంచం గమనిస్తోందని, ఆయన ఇకనైనా హుందాగా వ్యవహరించాలని తెదేపా నేత, సినీ నటి కవిత హితవు పలికారు. ఉద్యోగులు, అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం తగదని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని చెప్పారు. తాను అక్రమాస్తుల కేసులో అరెస్టయి జైలుకు వెళ్లినందున, ప్రతి ఒక్కరూ జైళ్లకు వెళ్లాలి, తన మాదిరిగా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి తీరాల్సిందేనన్న శాడిస్టు ఆలోచన మంచిదికాదని వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు, సోనియా యుపీఏ చైర్మన్‌గా ఉన్నప్పుడు అనేక బస్సు, విమాన ప్రమాదాలు జరిగినందున అందుకు వారూ బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు జగన్ కూడా వ్యాపారాలు చేస్తున్నారని, వారి కంపెనీల్లో ఉద్యోగులో, కార్మికులో చనిపోతే అందుకు వారు కూడా బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఆమె మాటలు చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న మహిళలకు విలువ లేకుండా పోతున్నాయనిపిస్తోందన్నారు. బస్సు ఘటనతో రాష్ట్రం యావత్తూ విషాదంలో ఉంటే వైసీపీ శవరాజకీయాలు చేయడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. వీలైతే బాధిత కుటుంబాలకు సాయం చేయకుండా శవాల గదిలోకి వెళ్లి రాజకీయం చేయడం నీచాతినీచమన్నారు. జరిగిన ఘటనపై ప్రభుత్వం స్పందించిందని కవిత గుర్తు చేశారు.

నిధులు విడుదల చేయండి
* మంత్రి యనమలకు మేయర్ శ్రీ్ధర్ వినతి
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 1: విజయవాడ నగర పాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు, గ్రాంట్ల విడుదలలో చొరవ చూపాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ను నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ కోరారు. బుధవారం ఉదయం నగరంలోని మున్సిపల్ ఎంప్లారుూస్ కాలనీ సమీపంలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొన్న మేయర్ శ్రీ్ధర్ నాన్‌ప్లాన్ గ్రాంట్ కింద 2014-15 నుంచి 2016-17 వరకూ రావాల్సిన 43.74 కోట్ల రూపాయలు, కృష్ణా పుష్కరాల సమయంలో రోడ్డు విస్తరణకు తొలగించిన ఇళ్ళ యజమానులకు రీఎంబర్స్‌మెంట్ నిమిత్తం ఇవ్వాల్సిన 17.69 కోట్ల రూపాయల విడుదలలో నెలకొన్న జాప్యంతో అనేక ఇబ్బందులకు సమస్యలు ఉత్పన్నమవుతున్న తరుణంలో విఎంసికి ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన ఆయా గ్రాంట్లను విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే 14వ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి విడుదల కావాల్సిన నగరానికి జమకావాల్సిన నిధులను కూడా విడుదల చేసి నగరంలో జరుగుతున్న ఆయా అభివృద్ధి పనుల సక్రమ నిర్వహణకు సహకరించాలన్నారు.