కృష్ణ

సహృదయంతో ముందుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 4: బందరు ప్రాంత భవిష్యత్తు తరాల కోసం రైతులు సహృదయంతో ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు ముందుకు రావాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. శనివారం మండల పరిధిలోని కొత్తపూడి గ్రామ రైతులతో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమై ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చే రైతులకు అద్భుతమైన ప్యాకేజీని వర్తింప చేయనున్నట్లు తెలిపారు. మెట్ట భూములకు సంబంధించి ఎకరానికి యేడాదికి రూ.30వేలు, మాగాణికి రూ.50వేలు కౌలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతు కూలీలకు రూ.2500 చొప్పున పదేళ్లపాటు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంపై సంవత్సరానికి వస్తున్న ఆదాయంతో పోలిస్తే ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీ ఎన్నోరెట్లు మెరుగైనదన్నారు. అంతే కాకుండా భూములు ఇచ్చే రైతులకు మెగా టౌన్ షిప్‌ను నిర్మించి ఎకరం భూమి ఇచ్చిన వారికి వెయ్యి గజాలు గృహోపయోగ, 200 గజాల కమర్షియల్ భూమిని ఇవ్వనున్నట్లు చెప్పారు. ఫలితంగా కోట్లాది రూపాయల ఆస్తి రైతుల సొంతం కానుందన్నారు. వీటన్నింటిపై రైతులు అవగాహన కలిగి భూములు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. గ్రామంలో కుటుంబ పెద్దలు చనిపోయిన కుటుంబాలలో వారసులకు హక్కులు కాగితాలపై లేని వారు చాలా మంది ఉన్నారని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి రవీంద్ర సమస్య పరిష్కారానికి కృషి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ అవసరాల నిమిత్తం గ్రామ కంఠం పరిధి నిర్ణయించడానికి తామంతా చర్చించుకుని తెలియచేస్తామని గ్రామస్థులు మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు మాదిరెడ్డి సాయి వెంకట కాంతారావు తదితరులు తమ భూములను సమీకరణలో ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ మంత్రి రవీంద్రకు ఫాం-3లను సమర్పించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడు బి వేణుగోపాలరెడ్డి, డెప్యూటీ కలెక్టర్ సుజాత, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, పార్టీ నాయకులు వాలిశెట్టి తిరుమలరావు, మరకాని పరబ్రహ్మం, తహశీల్దార్ బి నారదముని తదితరులు పాల్గొన్నారు.