కృష్ణ

తీరు మారకుంటే చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 8: కంచె చేను మేసిందన్న సామెత చందంగా విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన వెహికల్ డిపోను పరిరక్షించాల్సిన అధికార, సిబ్బందే డిపోను మింగేస్తున్నారు. చిన్న చిన్న మరమ్మతులను సైతం సక్రమంగా నిర్వహించక మూలనపడేస్తున్న వాహనాల గోడు అంతా ఇంతా కాదు. వాహనాల నిర్వహణ, మరమ్మతులు, డీజిల్ పంపిణీ, తదితర అంశాల్లో అధికార సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విషయంపై పలు అరోపణలు వినిపిస్తుండగా స్వయాన నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఆయా ఆరోపణలపై వాస్తవ పరిస్థితులను గుర్తించి నివ్వెర పోయిన వైనం గమనార్హం. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ నగర పర్యటనలో భాగంగా బుధవారం వెహికల్ డిపోను సందర్శించగా ఆయనకు వెహికల్ డిపో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులు యథావిధిగా ప్రత్యక్షమైనాయి. శానిటేషన్ పనుల కోసం ఉదయం 6 గంటలకే నగర వీధుల్లో కనిపించాల్సిన వాహనాలు డిపోలోనే ఉండటాన్ని గుర్తించిన మేయర్ వాహనాల స్థితిపై వివరణ కోరగా మేయర్‌కు స్థానిక సిబ్బంది చెప్పిన సమాధానాలు మరింత ఆశ్చర్యం కలిగించాయి. నిర్ణీత వేళల్లో విధులకు హాజరుకావాల్సిన సిబ్బంది, ఆయిల్ సూపర్‌వైజర్, మెకానిక్స్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్లు, క్లీనర్లు తదితరులు సకాలంలో హాజరుకాకపోవడం ఒక విషయమైతే వీరిని సమన్వయపర్చి, వారితో సక్రమంగా విధులను నిర్వర్తింపచేయాల్సిన అధికార యం త్రాంగం కూడా అదే బాటలో నడుస్తున్నారు. నగర పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, చెత్త తరలించే డంపర్ ప్లేసర్లకు జిపిఎస్ సిస్టమ్‌ను అమలుచేయడం తోపాటు ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరును అమలుచేస్తున్నామని కమిషనర్ వీరపాండియన్ ప్రకటించడమే కాకుండా ఆయా అంశాలపై జాతీయ స్థాయి అవార్డులను సైతం సాధించుకోవడం జరిగింది. చెత్త వాహనాలకు ఏర్పాటుచేసిన జిపిఎస్ ద్వారా వాహనం ఏ సమయానికి ఎక్కడ డంపర్ బిన్‌ను తరలిస్తుందో ఇట్టే గుర్తించి నగరంలోని అన్ని డంపర్ బిన్లను సకాలంలో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని గొప్పలు చెబుతున్న కమిషనర్ వీరపాండియన్ సిబ్బంది గంటల కొద్దీ ఆలస్యంగా విధులకు హాజరుకాకపోతున్నా బయోమెట్రిక్ విధానం గుర్తించకపోవడం గమనార్హం. విఎంసి వెహికల్ డిపోకు వెహికల్ ఎలక్ట్రీషియన్ గా పనిచేసే ఉద్యోగి తన విధులను పక్కన పెట్టి ప్రైవేటుగా ఎలక్ట్రీషియన్ షాపు నిర్వహిస్తున్నాడని, ఒకవేళ విధులకు వచ్చినా కొద్దిసేపు కాలక్షేపం చేసి వెళ్లిపోవడమే కానీ, వాహన ఎలక్ట్రీషియన్ పనులు సక్రమంగా చేయడని, ఈ విషయాన్ని డిపో ఇఇ, డిఇఇ, ఎఇ లకు చెప్పినా ఫలితం లేదని, వెయ్యి రూపాయల లోపు మరమ్మతులను డ్రైవర్లే చేయించుకోవాలంటూ అధికారులు తమపై వత్తిడి చేస్తున్నారని స్థానిక సిబ్బంది మేయర్ శ్రీ్ధర్‌కు ఏకరువు పెట్టారు. మరమ్మతులకు నోచుకోని 10 టైర్ల వాహనాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేయర్ తక్షణమే తగు రిపేర్లు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

దేశ ఆర్థిక ప్రగతిలో
మహిళలది విశిష్ఠ పాత్ర
* సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 8: దేశ ఆర్థిక ప్రగతిలో మహిళలు విశిష్ఠ పాత్ర పోషిస్తున్న వైనం అభినందనీయమని సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం నగరంలోని సిఆర్‌డిఎ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళా ఉద్యోగులను సత్కరించిన ఆయన మాట్లాడుతూ ఇంటి పనులతోపాటు ఉద్యోగ కార్యకలాపాలను కూడా సమర్ధవంతంగా నిర్వర్తించడమే కాకుండా కుటుంబం, పిల్లల బాగోగులపై కూడా మహిళలు చురుకుగా పాల్గొంటున్న తీరు మహిళా శక్తికి నిదర్శనమన్నారు. ప్రజా వ్యవహారాల్లో మహిళా భాగస్వామ్యం పెరిగితే సమర్ధవంతమైన సేవలు అందించడమే కాకుండా అవినీతి అక్రమాలకు చెక్ పడుతుందన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలు తమ హక్కుల సాధనకై పోరాడుతూనే అన్ని బాధ్యతల్లోనూ ముందంజలో ఉండాలని సూచించారు. సిఆర్‌డిఎ షి కమిటీ చైర్‌పర్సన్‌గా జోనల్ డైరెక్టర్ కె నాగసుందరిని నియమిస్తున్నట్టు కమిషనర్ ప్రకటించారు. సమస్యలేమైనా ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. మహిళలకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేసారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ వి రామమనోహరరావు, డెవలప్‌మెంట్ ప్రమోషన్స్ డైరెక్టర్ వి రాముడు, తదితరులు పాల్గొన్నారు.