కృష్ణ

విగ్రహాల స్థాపనకు ప్రత్యామ్నాయ స్థలం చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 30: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన జాతిపిత మహాత్మాగాంధీజీ శాంతి దూతగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గాంధీజీ విగ్రహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాన్‌పేటలోని ఆలపాటి రామారావు, అనుమాల లక్ష్మణరావు ఫంక్షన్ హాలులో శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని గాంధీజీ విగ్రహం పరిసర ప్రాంతంలో మురుగుగుంట్ల కూపంగా తయారైనా అధికారులు పట్టించకపోవడం శోచనీయమన్నారు. దుర్గాఘాట్ సమీపంలో, కొత్తపేట ఆంజనేయవాగు సెంటర్‌లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ప్రభుత్వ అధికారులు తొలగించారని, వాటిని పునఃనిర్మాణం చేసేందుకు ప్రత్యాహ్నయ స్థలాలు చూపకుండానే తొలగించటాన్ని విమర్శించారు. ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సిఏ పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో 8 శాతం జనాభ ఉన్న ఆర్యవైశ్యులను నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. విలేఖర్ల సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి పెరుమాళ్ల కాశీరావు, నగర అర్బన్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొనకళ్ల విద్యాధరరావు, తూనుగుంట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌గా ప్రసాదరావు నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 30: జిల్లా రవాణాశాఖ అధికారి బదిలీపై గడచిన రెండు వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. డెప్యూటీ కమిషనర్ పోస్టును జాయింట్ కమిషనర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయకుండానే ప్రభుత్వం హైదరాబాద్‌లోనున్న జెటిసి ప్రసాదరావును కృష్ణాజిల్లాకు బదిలీ చేసింది. అయితే గతంలో కృష్ణాజిల్లాలోనే డిటిసిగా పనిచేసిన తాను అదే పోస్టులో పోస్టు అప్‌గ్రేడ్ కాకుండానే ఎలా చేరగలనంటూ ప్రసాదరావు వాదిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం పోస్టును అప్‌గ్రేడ్ చేయకుండానే ఆయనను రిలీవ్ చేసింది. ఇప్పటిదాకా ఇక్కడ డిటిసిగా పనిచేస్తూ వచ్చిన వి.సుందర్‌ను అనంతపురం ఇన్‌చార్జి డిటిసిగా నియమించింది. అంటే ప్రసాదరావు హైదరాబాద్‌లో జీతం తీసుకుంటూ ఇక ఇక్కడ పనిచేయాల్సి వుంటే అలాగే సుందర్ కూడా ఇక్కడ జీతం తీసుకుంటూ అనంతపురంలో పనిచేయాల్సి వస్తుంది.

రైతులకు ఎకరాకు 27.50 లక్షల పరిహారం
మైలవరం, జనవరి 30: జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల భూములకు జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు ధరను నిర్ణయించినట్లు తహశీల్దార్ కెవి శివయ్య శనివారం వెల్లడించారు. జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతులు తమ భూములకు అధిక ధర చెల్లించాలని, సొమ్ము వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జేసి చంద్రుడు జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 27.50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వటానికి ప్రభుత్వపరంగా అంగీకారం తెలిపినట్లు తహశీల్దార్ వివరించారు. గతంలో అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగానే అందిస్తున్నట్లు తెలిపారు. దీనిప్రకారం చండ్రగూడెంలో 35 ఎకరాలకు సంబంధించి 72మంది రైతులు, పుల్లూరులో ఒక ఎకరాకు సంబంధించి ఐదుగురు రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా రైతులు పెద్దమనసుతో అంగీకరించి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. రైతులు దీనికి కూడా అంగీకరించకపోతే జేసికి గానీ, కలెక్టర్‌కు గానీ స్వయంగా వినతిపత్రాలు అందించాలని సూచించారు.

కూచిపూడి యక్షగాన నాట్య మహోత్సవాలకు రంగం సిద్ధం
కూచిపూడి, జనవరి 30: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో ఫిబ్రవరి 23 నుండి 29 వరకు వారంరోజులు కూచిపూడి యక్షగాన నాట్య మహోత్సవాలు నిర్వహించనున్నట్లు నాట్యారామ కమిటీ ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్, విజయవాడ సబ్ కలెక్టర్ జి సృజన, పర్యవేక్షకురాలు పురాణం మాధవి శనివారం విలేఖర్లకు తెలిపారు. వారంరోజులు నిర్వహించే నృత్య రూపకాల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి 200 మంది కళాకారులు నాట్యక్షేత్రానికి రానున్నట్లు తెలిపారు. దాదాపు 10వేల మంది కళాభిమానులకు కూచిపూడి నాట్య గత వైభవాన్ని నాటి, నేటి కళాకారులు యక్షగానాలు, కలాపాలు, నృత్య నాటికల ప్రదర్శనలు ద్వారా తెలియజెపుతారన్నారు. వీటిని డాక్యుమెంటేషన్ చేసి దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో జరిగే సాంస్కృతి ప్రదర్శనల్లో ప్రదర్శింపజేసి గత వైభవం తెచ్చిపెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయన్నారు. ముఖ్యంగా దివంగత పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం రూపొందించిన యక్షగానాలు, నృత్య నాటికలకు సామీప్యాన్ని భావి కళాకారులకు తెలియపర్చేందుకు ప్రదర్శనా పూర్వక ప్రసంగాలు, నృత్య నాటికలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. భక్తప్రహ్లాద, ఉషా పరిణయం, శశిరేఖా పరిణయం, మోహినీ భస్మాసుర, శ్రీ పార్వతీ కల్యాణం, మోహినీ రుక్మాంగధ, రామనాటకంతో పాటు నృత్య రూపకాలైన నర్తనశాల, లలితా బండాసుర, మోహినీ భస్మాసుర, క్షీరసాగర మథనం, విప్రనారాయణ, వినాయక విజయం, భామాకలాపం, గొల్లకలాపాలను కళాకారులు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తహశీల్దార్ ఎల్ రామారావు, ఎంపిడివో వై పిచ్చిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.