కృష్ణ

ఫైబర్ గ్రిడ్‌పై కేబుల్ వర్గాల్లో గుబులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: ప్రభుత్వ ఫైబర్ గ్రిడ్ ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పాతుకుపోయిన కేబుల్ ఆపరేటర్లలో గుబులు పుట్టిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాలు.. చివరకు రాజధాని ప్రాంత విజయవాడ, గుంటూరు నగరాల మధ్య సైతం ఇప్పటివరకు ఏ విద్యుత్ స్తంభం చూసినా, ఏ టెలిఫోన్ స్తంభం చూసినా ఇబ్బడి ముబ్బడిగా పలు సంస్థల కేబుల్ తీగలు అడ్డదిడ్డంగా.. ఒక్క మాటలో చెప్పాలంటే సాలెగూడులా దర్శనమిస్తుంటాయి.. ఒక్కోసారి ఈ తీగలకు షార్ట్‌సర్క్యూట్ జరిగి సంబంధిత కనెక్షన్‌దారుల టీవీలు కూడా బుగ్గిపాలైన సందర్భాలు లేకపోలేదు. ఇక రాజకీయంగా కూడా ఎక్కడికక్కడ స్థానిక ఛానెల్స్ కూడా పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈ నేపథ్యంలో టీవీ ఛానెల్స్‌ను కూడా తన కనుసన్నల్లో నడిచేలా సిఎం చంద్రబాబునాయుడు ఎంతో వ్యూహాత్మకంగా కేవలం రూ.150కే ప్రతి ఇంటికి టీవీ, ఇంటర్‌నెట్, టెలిఫోన్ సౌకర్యం కల్పించేలా రాష్టవ్య్రాప్తంగా ఫైబర్‌గ్రిడ్ లైన్‌ను విస్తరింప చేసే ప్రణాళికలో ఉన్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా మోరీ గ్రామంలో ఈ పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఇక రేపో మాపో ఈ సౌకర్యం రాష్ట్రం మొత్తం విస్తరించబోతున్నది. ఇదిలా ఉంటే ఇక విద్యుత్ స్తంభాలపై ప్రభుత్వం ఓఎఫ్‌సి కేబుల్ మినహా ఎలాంటి వైర్లు లేకుండా చూసేందుకై ఉన్నతస్థాయి నుంచి ఎక్కడికక్కడ వౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే పలు ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటర్లు అన్ని విధాలుగా ఇప్పటికే బలోపేతమై ఉండటం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేతలను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు కావటంతో తమ తమ నెట్‌వర్క్ వైర్లు తొలగించకుండా రాయబారాలు ప్రారంభించారు. వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లోనే స్థానిక సంస్థలు కేబుల్ నెట్‌వర్క్‌ల నుంచి కంటితుడుపుగా ఆక్రమిత పన్నులను వసూలు చేస్తున్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే రావాల్సిన బకాయిలు కోట్లలో ఉన్నాయి. రికార్డుల్లో కొన్ని స్తంభాలను మాత్రమే చూపుతూ ఒక్కో కనెక్షన్‌కు రూ.15 నుంచి రూ.20లకు చూపుతున్నారు. అయితే కేబుల్ కనెక్షన్ కోసం కొన్ని పట్టణాలు, నగరాల్లో రూ.200ల నుంచి రూ.250ల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీనిపై విసిగి వేసారిన ప్రజలు ప్రభుత్వ ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వ ఫైబర్ గ్రిడ్ ద్వారా కేవలం వివిధ టీవీ ఛానెల్స్ ప్రసారాలే కాకుండా ప్రత్యేక యాప్ ద్వారా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలపై లఘుచిత్రాల ప్రదర్శన, వైద్యసేవలు కూడా పొందే అవకాశాన్ని కల్పించబోతున్నారు. ఉచితంగా బంధుమిత్రులతో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఏపిఎల్ స్టోర్ ద్వారా ఇంటర్‌నెట్‌కి టీవీకి కనెక్ట్ చేయడం ద్వారా టివీనే కంప్యూటర్‌లా మార్చుకోవచ్చు. ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్ తీసుకున్న వారందరినీ ఒక బృందంగా పరిగణిస్తారు. ఈ బృందం సభ్యులు ఒకరితో మరొకరు రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా ఎవరితోనైనా ఎంతసేపైనా ఇంటర్‌కమ్ తరహాలో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కనెక్షన్ తీసుకోని వారికి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేస్తే నిమిషానికి 50 పైసలు, మొబైల్ ఫోన్‌కు రూపాయి వరకు చార్జీ వసూలు చేస్తారు. రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నెంబర్లు 72తోనూ, 50 నుంచి 59 వరకు ఉన్న సంఖ్యల సిరీస్‌తో ప్రారంభమవుతాయి.
ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రసారాల్లో 250 ఛానెళ్ల వరకు వస్తున్నాయి. హిందీ, ఇంగ్లీషుతో పాటు స్పోర్ట్స్ ఛానెల్స్‌ను కూడా ప్రాసరం చేస్తున్నారు. 30 రకాల తెలుగు ఛానెల్స్ ప్రసారమవుతాయి. తద్వారా తమకు నచ్చిన ఛానెల్స్‌లో వచ్చే ప్రోగ్రామ్స్‌ని రికార్డు చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇక టీవీ ద్వారా ఒక ఎంటర్‌టైమ్‌మెంటే కాకుండా స్టడీ మెటీరియల్స్, ఆన్‌లైన్ కోర్సులు, ఇంకా అనేక రకాల శిక్షణ సదుపాయాలు పొందవచ్చు. మున్ముందు గ్రిడ్ సేవలను మరింత విస్తృతం చేస్తారు. నెట్ స్థాయిని బట్టి 599 రూపాయల వరకు వివిధ రేట్లు నిర్ధారించారు.