కృష్ణ

రాష్ట్రంలో కోటి మంది మద్యానికి బానిసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పటమట) మార్చి 22: నవ్యాంధ్రప్రదేశ్‌లో 5 కోట్లు జనాభా ఉంటే అందులో కోటి మంది మద్యానికి బానిసలయ్యారని, ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తుందే తప్ప ప్రజారోగ్యాన్ని పట్టించుకోవటం లేదని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం వెలగపూడి అసెంబ్లీ పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమం, అవినీతి రహిత పాలన కోసం పాటుబడుతుంటే మద్యం సిండికేట్‌దారులు మాత్రం ఆయన ఆశయానికి గండికొడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆదాయానికి లిక్కర్ సిండికేట్లు గండికొడుతూ రోజుకి 30 కోట్ల రూపాయలు అక్రమంగా మద్యంపై సంపాదిస్తున్నారని, ఏడాదికి 10 వేల కోట్ల రూపాయలు లిక్కర్ సిండికేట్లు అక్రమంగా సంపాదించి నల్లధనాన్ని వెనుకేస్తున్నారని తెలిపారు. అక్రమంగా సంపాదించిన లిక్కర్ డబ్బుతో భూములను కొనుగోలు చేయటం వలన ఒక ఎకరం భూమి లక్షల్లో ధర పెరిగిపోవటంతో పేద, మధ్య తరగతి ప్రజలు కనీసం ఇళ్ల స్థలం కూడా కొనలేకపోతున్నారన్నారు. మద్యం బాటిళ్లపై వున్న ఎంఆర్‌పి ధర కంటే ఎక్కువుగా అమ్ముతున్న ఎక్సైజ్ అధికారులు గానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోవటం లేదన్నారు. ఆదాయం తగ్గిపోతోందన్న ఉద్దేశ్యంతో ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా పట్టించుకోకపోవటం బాధ కలిగిస్తోందన్నారు. రాత్రుళ్లు మద్యం రెట్టింపు ధరకు అమ్ముతున్నా, 30 పైసల గ్లాసును 3 రూపాయలు, 40 పైసల వాటర్ ప్యాకెట్ 2 రూపాయలకు అమ్ముతూ మద్యం ప్రియులను నిట్టనిలువునా దోచుకుంటున్న పట్టంచుకోకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా పేదల ఆరోగ్యం ముఖ్యమన్న భావనతో ప్రభుత్వ పాలన కొనసాగాలని సోము వీర్రాజు కోరారు.