కృష్ణ

హత్య కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 22: అక్రమ సంబంధం నేపథ్యంలో తల్లీ కుమారులపై కత్తితో దాడి చేసి ఒకరి మృతికి కారకుడైన కేసులో నిందితుడిని సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. కేదారేశ్వరరావుపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద ఈ నెల 13న ప్రియుడి చేతిలో ప్రియురాలు గాయపడగా, అమె కుమారుడు హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన మీదట సూర్యారావుపేట పోలీసు కాంప్లెక్స్‌లోని డిసిపి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి జి పాలరాజు అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. న్యూ రాజరాజేశ్వరీపేటకు చెందిన పూల పద్మ(40) కేదారేశ్వరరావుపేట మార్కెట్ యార్డులో కూలి పనులు చేసుకుంటుంది. ఈమె భర్త సుమారు 20ఏళ్ల క్రితం వదిలేశాడు. ఈమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన గణప శివతో కొంతకాలంగా పద్మ అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈవిషయం ఆమె కుమారునికి తెలియడంతో పద్మ తన ప్రియుడిని కొద్దిరోజులుగా దూరంగా ఉంచుతోంది. ఈ క్రమంలో ఈ నెల 13న కేదారేశ్వరరావుపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద ఉండగా కొబ్బరిబొండాల కత్తితో తల్లి, కొడుకులపై దాడి చేశాడు. బైక్‌పై ఉన్న నరేంద్ర మెడపై నరకగా అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన పద్మ తలపై నరికి పరారైనట్లు డిసిపి తెలిపారు. గాయపడిన పద్మ ఫిర్యాదు మేరకు హత్య, హత్యాయత్నం నేరాల కింద కేసు నమోదు చేసి నిందితుడు శివను అరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు. విలేఖరుల సమావేశంలో సత్యనారాయణపురం సిఐ ఎం సత్యనారాయణ పాల్గొన్నారు.

చిన్నారిని చిదిమేసిన స్కూల్‌బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం
* మృతదేహంతో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన గ్రామస్థులు
కృత్తివెన్ను,మార్చి 22: ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడేళ్ల చిన్నారి నిండు ప్రాణం బలైపోయింది. ప్రమాదానికి కారకుడైన బస్సు డ్రైవర్, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిన్నారి మృతదేహంతో బంధువులు, గ్రామస్థులు స్కూల్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. రాత్రి పొద్దుపోయే వరకు ఆందోళన కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పడతడిక గ్రామ పంచాయతీ పరిధిలోని దండుదారి గ్రామానికి చెందిన మల్లవోలు వీరాంజనేయులు కుమారుడు లక్ష్మీ గణేష్ (09), అక్షయ (07)లు లక్ష్మీపురం శాంతినికేతన్ హైస్కూల్‌లో యుకేజి, ఎల్‌కేజీ చదువుతున్నారు. రోజు మాదిరిగానే బుధవారం కూడా ఆ అన్నా చెల్లెల్లు స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం 4.30ని.లకు అదే స్కూల్ బస్సులో తిరుగు ప్రయాణం పట్టారు. కుమ్మరిపాలెం వద్ద ముందుగా బస్సు దిగిన అక్షయ బస్సు ముందుకు వెళ్లింది. ఆ తర్వాత సోదరుడు లక్ష్మీ గణేష్ బస్సు దిగారు. అప్పటికే బస్సు డ్రైవర్ చూసుకోకుండా అక్షయ మీదుగా బస్సు ఎక్కించేశాడు. దీంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది.