కృష్ణ

ఆన్‌లైన్‌లో బిల్డింగ్ ప్లాన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, ఘన, వ్యర్ధ పదార్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్రవ, వ్యర్ధాల ట్రీట్‌మెంట్ వంటి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు మున్సిపల్ వ్యవహారాల మంత్రి డా. పి నారాయణ తెలిపారు. స్థానిక సిఎం క్యాంప్ కార్యాలయంలో మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇందుకోసం జర్మన్ అంతర్జాతీయ కార్పొరేషన్, వాటర్, ఒఆర్‌జి, డ్రెమన్ ఓవర్‌సీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లతో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు సమక్షంలో తమ శాఖ ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు. ప్రపంచంలో ఉన్న అత్తుత్తమ సాంకేతికతను వినియోగించి ఘన వ్యర్ధాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంట్లు ప్రతి జిల్లాలో కనీసం ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం నుంచి ఘన వ్యర్ధాలను మున్సిపల్ శాఖ ఈ ప్లాంట్ల వద్దకు చేరవేస్తుందన్నారు. విద్యుత్ శాఖ ఈ ప్లాంట్ల నిర్వహణను చేపడుతుందన్నారు. ఈవిధంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇందుకు యూనిట్ ధరను నిర్ణయించేందుకు టెండర్లు పిలుస్తామని మంత్రి చెప్పారు. ద్రవ వ్యర్ధాలను పూర్తిస్థాయిలో ట్రీట్‌మెంట్ చేసి సాధారణ అవసరాలకు వినియోగించేలా తీర్చిదిద్దుతామన్నారు. నెల్లూరులో రూ.220కోట్లతో, గుంటూరులో రూ.500కోట్లతో భూగర్భ డ్రైనేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్య తీసుకుంటోందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు సామర్ధ్యం పెంపు, వ్యర్ధాల నిర్వహణ వంటి అంశాల్లో మున్సిపాలిటీలకు తగిన సూచనలు, సలహాలు ఇస్తాయన్నారు.
దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో బిల్డింగ్ ప్లాన్‌కు ఆమోదం ఇచ్చే సాఫ్ట్‌వేర్ రూపొందించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. భవన నిర్మాణం చేపట్టదలచిన వ్యక్తులు తమ సర్వే నెంబరు, పట్టా నెంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే సంబంధిత లేఅవుట్ కంప్యూటర్ తెరపై డిస్‌ప్లే అవుతుందన్నారు. సంబంధిత లేఅవుట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్న బిల్డింగ్ ప్లాన్‌ను సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తిస్తామన్నారు. నిబంధనలకు అనుగుణంగా లేకపోతే మార్పులు చెయ్యాల్సిన అంశాలను సాఫ్ట్‌వేర్ తెలియజేస్తుందన్నారు. దీనికి అనుగుణంగా భవన యజమానులు తమ బిల్డింగ్ ప్లాన్‌ను మార్పుచేసి సంబంధిత రుసుము ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే కేవలం ఒక నిముషం సమయంలోనే బిల్డింగ్ ప్లాన్‌కు ఆమోదం పొందవచ్చన్నారు. ఈ విధానాన్ని అమలుచేసి విజయవాడ నగరంలో 20 బిల్డింగ్ ప్లాన్లకు ఆమోదం ఆన్‌లైన్ ద్వారా ఇచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 8 నాటికి ఈ విధానాన్ని గుంటూరు, విశాఖపట్నం కార్పొరేషన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ఆన్‌లైన్ విధానంలోనే బిల్డింగ్ ప్లాన్లను ఆమోదిస్తామని మంత్రి వివరించారు. పాత్రికేయుల సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిఇవో మురళీధరరెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పి ప్రభాకర్, ఇఇ సోమ భారత్, జర్మన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధి డి వాల్‌తర్ వాటర్, ఒఆర్‌జి కంట్రీ డైరెక్టర్ ఉదయ్‌శంకర్, బ్రమణ్ ఓవర్‌సీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధి సుస్మితా సింహ, తదితరులు పాల్గొన్నారు.