కృష్ణ

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 29: అన్న నందమూరి తారక రామారావు ఆశయ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పని చేస్తున్నారని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత బస్టాండ్ సెంటరులోని ఎన్టీఆర్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పని చేస్తున్నారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ను ప్రపంచ దేశాల్లో మేటిగా అభివృద్ధి పరుస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలన్నారు. శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలబడేది ఒక్క తెలుగుదేశం పార్టీయేనన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), బూరగడ్డ రమేష్ నాయుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం (చంటి), ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, మండల పార్టీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం లాటరీలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
* ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్

మచిలీపట్నం, మార్చి 29: జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సులు జారీ ప్రక్రియకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 31వతేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిన లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్‌లో చేపట్టాల్సిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంట్రీ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లాటరీ తీసే కార్యక్రమానికి అనుమతిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మూడు నెలలకు ముందుగా లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను చేపట్టామన్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 3వేలకు పైబడి దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తుల వెరిఫికేషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెరిఫికేషన్ పూర్తిచేయించుకున్న వారికి ఎంట్రీ పాస్ ఇస్తున్నామన్నారు. ఈ పాస్‌తోనే లాటరీ తీసే కార్యక్రమానికి దరఖాస్తుదారులు హాజరు కావాలన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా తగ్గించడం వల్ల ఈ సంవత్సరం 10వేలు పైబడి దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. 30వతేదీ సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుందన్నారు. అర్ధరాత్రి 12గంటలకు దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత ఎవరు వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మురళీధర్, మనోహా, సిబ్బంది పాల్గొన్నారు.