కృష్ణ

కవులు, కళాకారుల్ని ఆదరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), మార్చి 29: తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులను ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటి, మైనార్టీ, బాషా సాంస్కృతిక శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం హేమలంబ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా భాషా సంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్తంగా ఘంటసాల ప్రభుత్వ నృత్య కళాశాలలో కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామగ్రామాల్లో తెలుగుతనానికి సృజనాత్మకత ఉటుందని, దీనిని భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో భాషా సంస్కృతిక శాఖ నేతృత్వంలో కృషి జరుగుతుందని తెలిపారు. ఉగాది పర్వదినం లాంటి పండుగల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించే విధంగా కవులు, కళాకారులను ప్రోత్సహించి తెలుగుభాష విశిష్టత పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విధానమని మంత్రి పల్లె అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కవితా పత్రికా పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా భాషా సాంస్కృతిక శాఖ ఆర్ట్స్ అసోసియేషన్ గిల్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మన సంస్కృతి చిత్ర కళా ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 43 మంది కవులను రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి, భాషా సంస్కృతిక శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, సంచాలకులు డి విజయ్‌భాస్కర్‌లు దుశ్శాలువా, మెమోంటో, పుష్పగుచ్చాన్ని ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా వెలుగు రామకృష్ణ, వెలవెల నాగలక్ష్మి ఆదినారాయణ, రామాంజనేయులు, రావి రంగారావు, పాడిబండ్ల రజనీ, శిఖామణి, చింతాడ రామారావు, కృష్ణారావు, రంగాచార్యులు, పద్మనాభరావు లాంటి కవులు తాము రచించిన, వినిపించిన కవితలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాషాభిమానులు పాల్గొన్నారు.

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రి, మార్చి 29: తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధి, కొండ కింద ఉన్న ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆంధ్రుల ఇలువేల్పు దుర్గమ్మ దర్శనార్థం వేకువజామునే భక్తులు తరలివచ్చారు. ఇవో ఆదేశాలతో స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు దుర్గమ్మకు స్నపనాభిషేకం, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు శ్రద్ధతో నిర్వహించారు. అనంతరం క్యూమార్గంలో వేచివున్న భక్తులు దర్శించుకునేందుకు ఆలయాధికారులు అనుమతించారు. ఉదయం ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. తిరిగి సాయంత్రం 5నుండి రాత్రి 9గంటల వరకు రద్దీ కొనసాగింది. పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కొలువైన స్వామి దర్శనార్థం భక్తులు వేకువజామునే వచ్చారు. ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు నాగరాజుశర్మ, రాఘవేంద్రశర్మ స్వామికి మహాన్యాస ఏకదశ రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 6గంటలకు ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది.

ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక టిడిపి
* దేశ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన రోజు
* భవిష్యత్ తరాలకు ఆదర్శ పాలన
* పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
బెంజిసర్కిల్, మార్చి 29: తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసమే ఆలంబనగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. పార్టీ ఆవిర్భావంతోనే దేశ రాజకీయాల్లో నూతన ఒరవడి వచ్చిందన్నారు. భవిష్యత్ తరాలకు సుపరిపాలన అందించి అందరికీ ఆదర్శంగా నిలిచేలా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ 36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతీకగా పార్టీ ఆవిర్భవించి వారి అభ్యున్నతికి ఎల్లవేలల కృషి చేస్తోందన్నారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా పార్లమెంట్ స్పీకర్‌గా దళితులకు అవకాశం కల్పించింది టిడిపినే అన్నారు. మహిళలకు అన్నింటా 33శాతం రిజర్వేషన్లు, ఆస్థిలో సమాన హక్కు, ప్రజల వద్దకు పాలన, జన్మభూమితో పాటు సింగిల్ విండో విధానం ద్వారా రైతులకు ఎంతో మేలు చేశారని తెలిపారు. ఇటువంటి వినూత్న కార్యక్రమలను ప్రవేశపెట్టడం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సిఎం చంద్రబాబు నాయకత్వాన్ని మొత్తం తెలుగుజాతి బలపరుస్తుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందరి అభ్యున్నతికి పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు యలమంచిలి గౌరంగబాబు, ప్రేమనాథ్, సొంగా రవీంద్రవర్మ, లుక్కాసాయిరామ్, యెర్నేని వేద వ్యాస్‌తో పాటు పలువురు నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజాసంస్కృతిని స్థిరీకరించుకోవాలి
* ఉగాది వేడుకల్లో పాపినేని
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 29: నిజమైన మానవీయ, ప్రజాసంస్కృతిని స్థిరీకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, నేడు పాశ్చాత్య విష సంస్కృతి అనేక మాధ్యమాల ద్వారా దిగుమతి అవుతోందని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అన్నారు. నగరంలోని ఎం.బి విజ్ఞాన కేంద్రంలో ఉగాది వేడుకలను బుధవారం నాస్తిక, హేతువాద సమ్మేళనంగా ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యమ్రాలు, హాస్యనాటికలు ఆహూతుల్ని అలరించాయి. ముఖ్యఅతిథిగా శివశంకర్ మాట్లాడుతూ తెలుగుభాష, సంస్కృతి అంతరించిపోతున్నాయని, భాష అంటే కేవలం 56 అక్షరాలు మాత్రమే కాదన్నారు. అందులో సంస్కృతి, సుమతీ శతకం, గురజాడ వ్యాఖ్యలు, పండుగలు, సంప్రదాయలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. 33వేల ఎకరాల్లో రాజధాని నిర్మించటం వల్ల గ్రామ ప్రాంతాలు, వ్యవసాయం అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాస్తిక కేంద్రం సంచాలకులు జి విజయం మాట్లాడుతూ శాస్తవ్రిజ్ఞానం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుందో అంతే గొప్పగా మత, మూఢ విశ్వాసాలు పెరుగుతున్నాయన్నారు. భౌతికశాస్త్ర అధ్యాపకులు తుమ్మల శ్రీకుమార్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుందన్నారు. ఎం.బి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ, పి లక్ష్మీనారాయణ, చల్లా రవికుమార్, ఎన్ వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణ దిశగా తనిఖీలు
* విద్యార్థులకు ట్రాఫిక్ ఎసిపి కౌనె్సలింగ్
విజయవాడ (క్రైం), మార్చి 29: రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా నగరంలోని కళాశాలల వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఏసిపి కె సూర్యచంద్రరావు అన్నారు. తనిఖీ సమయాల్లో పోలీసులకు ప్రజలు సహకరించాలని, అతి వేగంతో వాహనం నడిపి తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురవుతారని, వారి ప్రాణాలకే కాకుండా పక్కవారి ప్రాణాలకు హాని జరుగుతుందని సూచించారు. నగరంలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన విద్యార్థులకు బుధవారం బందరురోడ్డులోని కెఎస్ వ్యాస్ కాంప్లెక్స్‌లో కౌనె్సలింగ్ నిర్వహించారు. నగరంలోని వివిధ కళాశాలల వద్ద, ముఖ్య కూడళ్లలో తనిఖీలు చేపట్టగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ 25మంది విద్యార్థులు, యువకులు పట్టుబడ్డారు. ఈ విద్యార్థులు నలంద, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఐటిఐ కళాశాల, నారాయణ జూనియర్ కాలేజీ, పిబి సిద్ధార్థ కాలేజీ, కెబిఎన్ కాలేజీ, ఇతర కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్నారు. వీరందరికీ వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఏసిపి మాట్లాడుతూ ప్రమాద నివారణ దిశగా నగరంలో గతనెల ఫిబ్రవరి 21నుంచి విద్యార్థులు, యువకులపై తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1245 మంది విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కలిగించినట్లు చెప్పారు. నగరంలో సగటున రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృత్యువాత పడుతున్నారని, వీరిలో ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా చనిపోతున్నట్లు చెప్పారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 రూపాయలు జరిమానా, లేదా మూడు నెలలు జైలుశిక్ష విధించడం జరుగుతుందని చెప్పారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే రెండు వేలు జరిమానా లేదా ఆరు మాసాలు జైలుశిక్ష, లేదా రెండూ విధించే అవకాశం ఉందన్నారు. మూడేళ్ల కాలంలో రెండోసారి మద్యం సేవించి పట్టుబడితే రెండు సంవత్సరాలు జైలు, మూడు వేలు జరిమానా లేదా రెండూ విధించడం జరుగుతుందని, మైనర్లు లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరమని, అదేవిధంగా ప్రమాదమని తల్లిదండ్రులకు సూచించారు. వరుసగా నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై ఆధార్ నెంబర్ ట్రాఫిక్ డేటా ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వలంటరీ హెల్త్ ఎడ్యుకేషన్ ఎకానమీ డెవలప్‌మెంట్ యూనిట్ స్వచ్చంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం వాసు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ కలిగి ఉండి, విధంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు భద్రతలో విద్యార్థుల పాత్ర గూర్చి అవగాహన కలిగించారు.

దుర్గమ్మ సేవలో మంత్రి మాణిక్యాలరావు
ఇంద్రకీలాద్రి, మార్చి 29: ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న ఆదిపరాశక్తి, శ్రీ జగన్మాతను తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ ఇవో ఎ సూర్యకుమారి మంత్రి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అంతరాలయంలోనికి తీసుకువెళ్ళారు. అమ్మవారి దర్శనం తర్వాత అమ్మవారి దివ్య అశీస్సులను ఇచ్చి ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు. ఇదేవిధంగా బుధవారం వేరు వేరు సమయాల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెవియస్ ప్రసాద్, కమిషనర్ వైవి అనూరాధ దర్శించుకున్నారు. ఇదేవిధంగా ఐఎయస్ అధికారులు మాల కొండయ్య, రామారావు, యల్‌వి సుబ్రహ్మణ్యం, రామారావు, అనంత్‌రామ్, ఐజి బి శ్రీనివాసరావు, ఐపియస్ అధికారి రవీంద్రప్రసాద్,తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. శాసన సభ్యులు శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్, శివప్రసాద్‌రెడ్డి, పుష్ప శ్రీ వాణి, బాబూరావు, రమణ, ఎమ్యెల్సీలు రామ్‌నారాయణ, నిరంజనరావు, సూర్యనారాయణ, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. యస్‌యస్‌సి బోర్డు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్‌స్వామి, రైల్వే జడ్జి రామారావు, డిజిఐ చంద్రశేఖర్ ఆజాద్, అమ్మవార్లను దర్శించుకున్నవారిలో ఉన్నారు.

ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 29: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఏప్రిల్ ఒకటవ తేదీ హౌరా - ఎర్నాకుళం మధ్య సువిధ స్పెషల్ రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు ఎం.ఉమాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు 82801గా హౌరా నుంచి ఎర్నాకుళం వెళ్లే ఈ రైలు ఏప్రిల్ ఒకటవ తేదీ హౌరాలో సాయంత్రం 1700 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు ఎర్నాకుళంకు సోమవారం ఉదయం ఆరు గంటలకు చేరుతుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 82802గా ఎర్నాకుళంలో ఏప్రిల్ 4న మంగళవారం ఉదయం 8.50 గంటలకు బయలుదేరి హౌరాకు బుధవారం రాత్రి 23.00 గంటలకు చేరుతుంది. ఈ రైలు ఇరుమార్గాలలో ఖరగ్‌పూర్, బద్రాక్, కటక్, భువనేశ్వర్, ఖుర్థారోడ్, బరంపురా, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, ఈ రోడ్, కోయంబత్తూర్, తిరుచూర్ స్టేషన్‌లలో ఆగుతుందని తెలిపారు. విద్యార్థులకు వేసవి సెలవలు ప్రకటించడంతో రైళ్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రత్యేకంగా ఈ రైలును ఏర్పాటు చేసింది.

పేదల అభ్యున్నతికే టిడిపి అంకితం
విజయవాడ (క్రైం), మార్చి 29: స్వర్గీ య నందమూరి తారక రామారావు పే దల అభివృద్ధి కోసం తెలుగుదేశం పా ర్టీని స్థాపించారని పార్లమెంట్ సభ్యు డు కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ తెదే పా కార్యాలయం కేశినేని భవన్‌లో ఘ నంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు ఇచ్చి పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరా వు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎపి పోలీ స్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కె.నా గుల్ మీరా విలేఖర్లతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల అభివృద్ధికి కృషి చేసే ఏకైక పార్టీ అని, రాష్ట్ర అభివృద్ధికి అనేక పథకాల ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేసిందని, తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది ఒక్క తెలుగుదేశం పార్టీ అని వక్తలు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ నూతన రాజధానిని నిర్మించడం, రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్నారని తెలిపారు. అర్బన్ ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణప్రసాద్, సీనియర్ నాయకులు కాట్రగడ్డ బాబు, యలమంచిలి గౌరంగబాబు, అర్బన్ అనుబంధ సంఘాల ఇన్‌ఛార్జి కొమ్మారెడ్డి పట్ట్భారామ్, తెలుగు యువత అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీను, టిఎన్‌టియుసి అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, కార్యాలయ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, కార్పొరేటర్లు , డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.