కృష్ణ

చేయని నేరానికి శిక్ష అనుభవించిన సత్యంబాబుకు ప్రభుత్వం ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, ఏప్రిల్ 5: ఆయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి 8ఏళ్లు శిక్ష అనుభవించిన పిడతల సత్యంబాబును ప్రభుత్వం ఆదుకోవాలని బార్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు కనె్నకంటి జీవరత్నం తదితర న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. బుధవారం అనాసాగరంలో సత్యంబాబును న్యాయవాదులు పరామర్శించారు. ఈ సందర్భంగా సత్యంబాబు మాట్లాడుతూ న్యాయవాదుల వల్లనే తనకు న్యాయం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు బండి మల్లికార్జునరావు, సీనియర్ న్యాయవాదులు పోపూరి సంగీతరావు, తలమాల డేవిడ్‌రాజు, వేల్పుల పరమేశ్వరరావు, మట్టా ప్రసాద్, వేల్పుల స్వామి, విజయ్, కోట రాజు, గగులోతు రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధిహామీలో జిల్లాను అగ్రభాగాన నిలబెట్టటమే లక్ష్యం
* రూ.12,829 కోట్లతో 2017-18కి యాక్షన్ ప్లాన్
* రాష్ట్ర ఉపాధిహామీ మండలి డైరెక్టర్ గురుమూర్తి

తోట్లవల్లూరు, ఏప్రిల్ 5: వర్తమాన (2017-18) సంవత్సరానికి ఏపికి రూ.12,829 కోట్లతో రూపొందించిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం యాక్షన్ ప్లానును సక్రమంగా అమలు చేయించి రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకు రావటంతో పాటు జిల్లాను రాష్ట్రంలో అగ్రభాగాన నిలబెట్టటమే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర ఉపాధిహామీ మండలి డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. తోట్లవల్లూరులోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం సిఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన ఉపాధిహామీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రభుత్వం ఉపాధిహామి పథకం కింద 20 శాఖలను చేర్చి అభివృద్ధి పనులను నిర్వహిస్తోందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 4 లక్షల నీటికుంటల నిర్మాణం, 3 లక్షల మరుగుదొడ్లు నిర్మాణం, 2లక్షల వర్మికంపోస్టు యూనిట్ల ఏర్పాటు, 10 లక్షల కిలోమీటర్ల మేర మొక్కలు నాటటం, 4వేల అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాల నిర్మాణం, 5వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్ల నిర్మాణం, 2.50 లక్షల ఇళ్ళ నిర్మాణానికి నిధులు ఇవ్వటం, వెయ్యి శ్మశాన వాటికల అభివృద్ధి, వెయ్యి ఆట స్థలాల అభివృద్ధి, 500 పంచాయతీ భవనాల నిర్మాణం, 70 మీనీ స్టేడియాల నిర్మాణాన్ని రూ.12,829 కోట్లతో అమలు చేయాల్సి ఉందని గురుమూర్తి వివరించారు. అలాగే ఉపాధిహామీ పనులను విజయవంతంగా పూర్తి చేయిస్తామన్నారు. ఉపాధిహామి నిధులను 60:40 నిష్పత్తిలో కూలీలకు పనుల కల్పించటంతో పాటు అభివృద్ధి పనులను చేయిస్తామని తెలిపారు. సిఎం చంద్రబాబు నియమించిన 15 మంది సభ్యుల కమిటీ ఉపాధిహామీ పనులను పర్యవేక్షించి సమస్యలను తెలుసుకుంటూ ప్రతి మూడు నెలలకొకసారి సమావేశమవుతుందని గురుమూర్తి తెలిపారు. రాష్ట్ర ఉపాధిహామీ మండలి డైరెక్టర్‌గా నియమితుడైన గురుమూర్తిని బుధవారం జిల్లా ఎంపిటిసిల సంఘం ప్రధాన కార్యదర్శి మూడే శివశంకర్, టిడిపి నాయకులు రాజులపాటి వెంకట సుబ్బారావు, నెక్కలపూడి మురళీ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ గౌరవాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తన పేరుని ప్రపోజ్ చేయటంతో సిఎం చంద్రబాబు తనకు ఈ పదవి ఇచ్చారని అన్నారు. రాజేంద్రప్రసాద్‌కి, ఎంపి కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, ఇతర మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని గురుమూర్తి అన్నారు.
రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎస్‌విఎల్ విద్యార్థులు
అవనిగడ్డ, ఏప్రిల్ 5: స్థానిక ఎస్‌విఎల్ క్రాంతి కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంటు దుట్టా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇటీవల ఉయ్యూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన అండర్-17 జిల్లా సాఫ్ట్‌బాల్ పోటీల్లో చాట్రగడ్డ నవ్య, ఉప్పాల సాయి సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. వీరిద్దరూ ఈ నెల 7వతేదీ నుండి మూడు రోజులు పాటు అనంతపురం జిల్లా కదిరిలో జరిగే రాష్ట్ర స్థాయి సాప్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను కరస్పాండెంటు ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసరావు అభినందించారు.
అలరించిన భక్తి సంగీత విభావరి
మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 5: స్థానిక జవ్వారుపేట శ్రీ విజయ సీతారామాంజనేయ మందిరంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవాలలో భాగంగా బుధవారం జరిగిన భక్తి సంగీత విభావరి భక్తులను ఆకట్టుకుంది. సుప్రసిద్ధ సంగీత కళాకారిణి రాధికా సుబ్రహ్మణ్యం శిష్య బృందం ఆలపించిన కీర్తనలు, గేయాలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులందుకున్నాయి. భక్తబృందం కన్వీనర్ కె రాజేంద్రప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
అవనిగడ్డ, ఏప్రిల్ 5: స్థానిక ప్రభుత్వ వైద్యశాల సమీపంలో బుధవారం రెండు మోటారు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. నాగాయలంక నుండి పైడిపాముల కోటేశ్వరరావు మరో ఇద్దరు పిల్లలతో వస్తుండగా ఎదురుగా సింహాద్రి శ్రీరామన్నారాయణ వస్తున్న బైక్ ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కోటేశ్వరరావు ఎడమ చేయి విరిగింది. సింహాద్రి శ్రీమన్నారాయణకు తలపై తీవ్రగాయమైంది. పిల్లలకు ఏ విధమైన గాయాలు లేకపోవటంతో ఊపిరిపీల్చుకున్నారు. క్షతగాత్రులను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.