కృష్ణ

ఆయుర్వేద వైద్యాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 7: ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయుర్వేద వైద్యులు తమ వంతు కృషి చేయాల్సిందిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వపరంగా ఆయుర్వేద వైద్యానికి పూర్వ వైభవం తీసుకురాగలమన్నారు. ఆయుర్వేద వైద్యాధికారుల రాష్ట్ర సంఘం నూతన కార్యవర్గ బాధ్యతల స్వీకరణ శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో కోలాహలంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డాక్టర్ కామినేని సంఘ డైరీని ఆవిష్కరించారు. ఆయుర్వేద ఆసుపత్రుల అభివృద్ధికి ముఖ్యంగా వౌలిక సదుపాయాల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిసి వెంకట్రావు, ఎం.రేవతి, డాక్టర్ మల్లు ప్రసాద్, డాక్టర్ జివి పూర్ణచంద్, సంఘ అధ్యక్షుడు డాక్టర్ సత్యబాబు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.బుల్లయ్య తదితరులు ప్రసంగించారు. సభానంతరం నూతన కార్యవర్గం తాజాగా కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కెఎమ్‌విడి ప్రసాద్‌ను కల్సి అభినందించారు. కళాశాల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందిస్తామన్నారు.

అందం, ఆనందమయ నగరంగా
రాజధాని అమరావతి
* అత్యుత్తమ ప్రమాణాల కోసమే అభిప్రాయ సేకరణ
* మేటి విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకుల వర్క్‌షాప్‌లో అదనపు కమిషనర్ మల్లికార్జున
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 7: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరాన్ని కేవలం అందంలోనే కాక ఆనందం పంచే నగరంగా తీర్చిదిద్దేందుకే అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు ఎపిసిఆర్‌డిఎ అదనపు కమిషనర్ డాక్టర్ ఎ మల్లికార్జున పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం డిజైన్లపై శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో దేశంలోని మేటి విద్యా సంస్థల నుంచి విచ్చేసిన విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో గ్రీన్ స్మార్ట్ సిటీని అత్యున్నత అర్బన్ డిజైనింగ్ ప్రమాణాళకనుగుణంగా నిర్మిస్తున్నామని తెలిపారు. అదనపు కమిషనర్ వి రామమనోహరరావు మాట్లాడుతూ విశిష్ట విజన్‌తో గ్రీన్ ఫీల్డ్, ఆర్థికంగా వైబ్రెంట్, అత్యంత అనువైన జీవనానికి అమరావతి వేదిక కానుందన్నారు. దీని నిర్మాణంలో విద్యార్థుల ఆలోచనలు, సూచనలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సిఆర్‌డిఎ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 10 మంది సభ్యులతో కూడిన మొత్తం 5గ్రూపులుగా పాల్గొన్నారు. వివబుల్ అర్బన్ ఎన్విరాన్‌మెంట్, మొబిలిటీ- ట్రాన్స్‌పోర్టు, సోషల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సస్టెయినబిలిటీ, బ్లూ అండ్ గ్రీన్ ఎలిమెంట్స్, మైక్రో క్లయిమేట్స్ డిజైన్, ఫ్యూచరిస్టిక్ అండ్ స్మార్ట్ కానె్సప్ట్ ఫర్ జనరేషన్ నెక్ట్స్ సిటీ అంశాలపై చర్చించిన విద్యార్థులు, అధ్యాపకులకు తొలుత నార్మన్ ఫోస్టర్స్ ప్లస్ పార్టనర్స్ సంస్థ ప్రతినిధులు రూపొందించిన అమరావతి డిజైన్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు.

అనారోగ్య శ్రీగా మారుతున్న ఆరోగ్యశ్రీ
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 7: గత కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసి రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య, వైద్య సేవలందించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుత టిడిపి ప్రభుత్వం అనారోగ్య శ్రీ గా మార్చేసిందని మాజీ మంత్రి, ఎపిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ సరైన వైద్య, ఆరోగ్య సేవలందక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన శైలజానాథ్ ఆరోగ్య శ్రీ పథకంపై ఇప్పటివరకూ కేటాయించిన నిధులు, చేసిన ఖర్చులపై స్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ దాదాపు 477 కోట్ల రూపాయల మేర బకాయిలున్నట్టుగా పేర్కొన్న ఆయన మధుమేహం, రక్తపోటు, బాలింతల మరణాలు దక్షిణాది రాష్ట్రాల్లో కెల్ల మన రాష్ట్రంలోనే అధికంగా జరుగుతున్న వైనం ఆరోగ్యశ్రీ పథకం పనితీరుకు అద్దం పడుతోందన్నారు. సబ్ సెంటర్లు, పిహెచ్‌సిలు సక్రమంగా పనిచేయడం లేదని, గుంటూరు ప్రభుత్వ హాస్పటల్‌లో ఎలుకల సంచారమే కాకుండా కుక్కలు చిన్నారులను ఎత్తుకెళ్లిన దుర్ఘటనలు గర్హనీయమన్నారు. చంద్రబాబుకు దళిత వర్గాలపై చిత్తశుద్ధి ఉంటే సిఎం పదవిని దళితులకు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ చేసిన సబ్‌ప్లాన్ చట్టాన్ని సక్రమంగా అమలుచేయని బాబు వైనం దళిత వ్యతిరేక చర్యలకు నిదర్శనమన్నారు. సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్ నిధులలో సుమారు రూ.30వేల కోట్లను కేటాయించాల్సి ఉండగా కేవలం ప్రచారంతోనే దళితుల అభివృద్ధి చూపుతున్నారే కానీ కేటాయించిన నిధుల వినియోగంలో చూపడం లేదని ఎద్దేవా చేశారు. దేశంలోనే ధనిక సిఎంగా చంద్రబాబు నిలిచారని, సిఎం కాగానే తన కుటుంబీకుల ఆస్తులు 300 రెట్లు ఎలా పెరుగుతాయని ఆయన ప్రశ్నించారు.