కృష్ణ

ప్రైవేట్ సెక్టార్లపైనే చంద్రబాబు మోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 19: ప్రైవేట్ సెక్టార్‌ల బాగు కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని మాజీమంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. జిల్లావాసుల చిరకాల వాంఛ బందరు ఓడరేవు నిర్మాణ విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వడ్డే తీవ్ర విమర్శలు చేశారు. పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరుతో పేదల కష్టార్జితమైన భూములను నవయుగ సంస్థకు దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణపట్నం పోర్టు ద్వారా నవయుగకు లబ్ధి చేకూర్చగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బందరు పోర్టు పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు. బందరు ఓడరేవు నిర్మాణానికి 1200 ఎకరాల భూమి సరిపోతుందన్నారు. 3వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెబుతున్న ప్రభుత్వం ముందు ఆ భూముల్లో పోర్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. మన పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే మూడు మేజర్ పోర్టులు ఉండగా మరో మేజర్ పోర్టును కేంద్రం నుండి సాధించుకుందన్నారు. ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేకుండా రూ.21వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో నాల్గవ మేజర్ పోర్టు నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధమయిందన్నారు. మన రాష్ట్రంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం, విశాఖపట్నం పోర్టు ట్రస్టు మేజర్ పోర్టు నిర్మాణానికి ముందుకు వస్తున్నా ప్రైవేట్ రంగ సంస్థ నవయుగతో బందరు ఓడరేవు నిర్మాణానికి పూనుకోవడం గర్హనీయమని వడ్డే శోభనాధీశ్వరరావు మండిపడ్డారు.