కృష్ణ

కొలిక్కిరాని వస్తల్రత కాంప్లెక్సు వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 19: నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన వస్తల్రత షాపింగ్ కాంప్లెక్సు వ్యవహారం అపరిష్కృతంగా తయారైంది. అధికారిక రికార్డుల పరంగా కాంప్లెక్సు యాజమాన్య హక్కులు విఎంసికే చెందినా కాంప్లెక్స్‌పై పెత్తనం మాత్రం ప్రైవేటు వ్యక్తుల పరమైంది. దశాబ్దాల తరబడి విఎంసికి ఎటువంటి అద్దె చెల్లించకుండా నెట్టుకురావడమే గాక షాపు లీజు రెన్యువల్స్, సబ్ లీజు వ్యవహారంలో కూడా వస్తల్రత వ్యాపారులదే పై చేయిగా ఉంటుందంటే ఈ కాంప్లెక్స్ నిర్వహణలో విఎంసి తీరు ఏమిటో స్పష్టమవుతోంది. రికార్డుల పరంగా ప్రస్తుతం వస్తల్రత వ్యాపారులందరూ సుమారు 14 కోట్ల రూపాయల మేర విఎంసికి అద్దె బకాయిలున్నట్టు సమాచారం. ఈ కాంప్లెక్సు నిర్మాణంలో భాగస్వాములైన వ్యాపారులకు 25 సంవత్సరాల లీజు కాలంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈలీజు కాలం ముగిసింది. విఎంసి నిబంధనల ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు షాపు లీజు రెన్యువల్ చేసుకోవాలి, లేదా 33.1/3 శాతం అద్దె పెంపుతో లీజు కొనసాగింపు జరగాలి. వీరి లీజు కాలం 25 సంవత్సరాలు ముగిసిన తరువాత లీజు కాలం పెంపు, అద్దె ఖరారులో వ్యాపారులకు, విఎంసి అధికారులకు అభిప్రాయ విభేదాలు తలెత్తడంతో వ్యాపారులు ఒక అసోసియేషన్‌గా ఏర్పడి కోర్టు కెళ్లారు. అయితే కోర్టు విఎంసికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు వచ్చేంత వరకూ వ్యాపారులు అద్దెలు చెల్లించడం కానీ, లీజు పెంపు కానీ జరగలేదు. కాగా విఎంసి అధికారులు మాత్రం 25 సంవత్సరాల లీజు కాలం ముగిసిన తరువాత వ్యాపారులు చెల్లించాల్సిన అద్దె, వాటిపై అపరాధ రుసుము మొత్తం కలిపి బకాయిగా చూపి చెల్లించమనడం గమనార్హం. మిగిలిన షాపింగ్ కాంప్లెక్సు వారితో సమానంగా తమకు 33.5 శాతం కాకుండా 15 శాతమే పెంచాలని కూడా మెలిక పెట్టారు. వీటన్నింటికీ చెక్ పెట్టి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు గాను ప్రస్తుత నగర పాలకులతోపాటు వ్యాపారులు కూడా నగర ప్రజా ప్రతినిధులను కలిసి తమ గోడును విన్నవించుకోగా నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం బకాయిగా ఉన్న 14 కోట్లకు గాను 8 కోట్ల రూపాయలు చెల్లించే విధంగానే కాకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి లీజు రెన్యువల్స్ చేయించుకునే విధంగా ఇరుపక్షాల వారు నిర్ణయానికి వచ్చి ఆ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. ఈవిషయంపై ప్రభుత్వం నిర్ణయం ఇంకా ఖరారు కావాల్సి ఉండగా ముందుగా చేసుకున్న నిర్ణయం ప్రకారం 2కోట్ల 60 లక్షల రూపాయలను డిడి రూపంలో విఎంసికి అందించారు. మిగిలిన మొత్తాన్ని వ్యాపారులు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఇదిలావుండగా వ్యాపారులు, నగర పాలకులు కుమ్మక్కై కార్పొరేషన్ ఖజానాకు గండి కొట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి. చట్టప్రకారం వసూలు చేస్తే ఖజానాకు 8 కోట్లకు మించి ఆదాయం వస్తుందని, ప్రస్తుత వ్యాపారులను ఖాళీ చేయిస్తే అద్దెరూపంలో ఆదాయం కూడా చాలా పెరుగుతుందనే వాదన వున్నా అధికారులు వ్యాపారులకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

మహిళ అనుమానాస్పద మృతి
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 19: ఓ మహిళ అనుమానాస్పద మృతిపై సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో చనిపోయినట్లు కొడుకు చెబుతుండగా, తన తల్లి మృతి వెనుక అనేక అనుమానాలున్నాయంటూ కుమార్తెలు గగ్గోలు పెట్టారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న బడుగు రామారావు అనే రైల్వే ఉద్యోగి తన తల్లి సావిత్రి (57)ని తన వద్దే ఉంచుకుని మంచి చెడు చూస్తున్నాడు. కాగా ఆమె మంగళవారం మరణించింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి మృత్యువాత పడినట్లు కొడుకు రామారావు చెబుతున్నాడు. ఈలోగా విషయం తెలుసుకున్న ఆమె కుమార్తెలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి తల్లి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన తల్లి చావుకు సోదరుడు రామారావే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద కుమార్తె గొల్ల లావణ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సత్యనారాయణపురం పోలీసులు మృతురాలు సావిత్రిని బుధవారం ప్రభుత్వాస్పత్రికి తరలించి పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లా సెక్రటరీని కలిసిన బిబిఏ ప్రతినిధి బృందం
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 19: బెజవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లా సెక్రటరీ సిఎస్‌ఎస్‌వి దుర్గాప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిసింది. బార్ అధ్యక్షుడు సోము కృష్ణమూర్తి నేతృత్వంలో లాయర్లు ఆయన్ను ఘనంగా శాలువాతో సత్కరించారు. బెజవాడ బార్ అసోసియేషన్ లైబ్రరీ అభివృద్ధి నిమిత్తం రూ.50 లక్షలు మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా లా సెక్రటరీని కోరారు. న్యాయవాదులకు జస్టీస్ సిటి పరిధిలో న్యాయవాదుల కాలనీ నిర్మాణానికి కొంత స్థలం కేటాయించాలని, ఉన్నత న్యాయస్థానం అమరావతిలో కోరగా ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరగా సానుకూలంగా స్పందించిన లా సెక్రటరీ త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కందుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు యోబు, కార్యదర్శి మధు, లైబ్రరీ సెక్రటరీ శేఖర్, కోశాధికారి లోకేష్, మహిళా కార్యదర్శి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

దొంగనోట్ల కేసులో 8మందికి జైలు, జరిమానా
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 19: దొంగనోట్ల కేసులో 8మంది నిందితులపై నేరం రుజువుకావడంతో ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ 12వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం టాస్క్ఫోర్స్ పోలీసులు వారికి అందిన సమాచారం మేరకు 2011 నవంబర్ 13న కృష్ణలంక పోలీస్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న చొల్లేటి సాయి కిరణ్, గౌరిసెట్టి ప్రదీప్, చింతా శివరామకృష్ణ, గొడ అరుణ్‌కుమార్, చంద్రకిషోర్ కుమార్, కాపవరపు విజయ్, షేక్ అలి, మహ్మద్ షఫీ అనే 8మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4.5లక్షల దొంగనోట్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నిందితులపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

క్రికెట్ బెట్టింగ్‌పై
టాస్క్ఫోర్స్ దాడులు
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 19: క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్లను టాస్క్ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం వించిపేటలో నివాసముంటున్న కాపుల పవన్ చంద్ అనే వ్యక్తి తన ఇంట్లో టివి ఏర్పాటు చేసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసిపి పి మురళీధర్ నేతృత్వంలో సిఐ సురేష్‌రెడ్డి సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈదాడిలో నిర్వహకునితోపాటు బెట్టింగ్‌కు పాల్పడుతున్న 11మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.31వేల నగదు, ఏడు సెల్‌ఫోన్లు, 4బైక్‌లు, టివి స్వాధీనం చేసుకుని కొత్తపేట పోలీసులకు అప్పగించారు.

ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్, పెర్ఫార్మెన్స్ పాయింట్లు వద్దు
విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 19: విద్యాశాఖ త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్‌ను పెర్ఫార్మెన్స్ పాయింట్లను రెండింటినీ రద్దుచేసి బదిలీలు నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఏపి రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ బదిలీల పేరుతో ఉపాధ్యాయులను మానసిక ఆందోళనకు గురిచేయడం ప్రభుత్వానికి తగదన్నారు. డిఎస్‌సి టీచర్ పోస్టుల నియామకాలకు కూడా లేని సరికొత్త నిబంధనలు, ఏ ప్రభుత్వ శాఖలో లేని పెర్ఫార్మెన్స్ పాయింట్లు కేవలం ఉపాధ్యాయులకే వర్తింపజేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం జాప్యం చేయకుండా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

25న భవన నిర్మాణ కార్మికుల చలో విజయవాడ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 19: సంక్షేమ నిధుల దారి మళ్లింపు, వృద్ధ కార్మికులకు పెన్షన్, సిమెంట్ ధర పెంపుదల అంశాలపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 25న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్లు ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు తెలిపారు. బుధవారం ఉదయం హనుమాన్‌పేటలోని దాసరిభవన్‌లో చలో విజయవాడ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధుల దారి మళ్లింపుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఓట్ల లబ్ధికోసం గతంలో అమలులో ఉన్న పథకాన్ని సవరించి చంద్రన్న బీమాగా మార్చిందని ఎద్దేవా చేశారు. గతంలో రోశయ్య, కిరణ్‌కుమార్ హయాంల నుండే వేలకోట్ల నిధులు దారి మళ్లాయన్నారు. చంద్రన్న బీమా నుండి నిర్మాణ రంగ కార్మికులను మినహాయించాలని, 13 రకాల సంక్షేమ సౌకర్యాలు తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎఐటియుసి అనుబంధ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి కోటేశ్వరరావు, నాయకులు చింతల శ్రీనివాసరావు, చల్లా రమణ, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
22న బిజెపి విజయోత్సవ వేడుకలు
బెంజిసర్కిల్, ఏప్రిల్ 19: భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోనికి వచ్చి మూడేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో విజయోత్సవాలను నిర్వహించుకుంనేందుకు సిద్ధపడింది. గడిచిన మూడు సంవత్సరాల్లో అవినీతి రహిత సుపరిపాలన కేంద్రంలో అందిస్తున్న విషయాన్ని ప్రచారంగా మలిచి విజయోత్సవాలను నిర్వహించాలని భావిస్తోంది. ముఖ్యంగా బిజెపి నాయకత్వం ఆర్థికాభివృద్ధిని అడ్డుకుంటోన్న నల్లధనం, నకిలీధనాన్ని నిలుపుదల చేసేందుకు పెద్దనోట్ల రద్దును ప్రధాని మోదీ ప్రకటించారనే అంశాన్ని ప్రచారాస్త్రంగా వినియోగించనుంది. అంత్యోదయ లక్ష్యమే నినాదంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తూ, జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా బిజెపి మూడేళ్ల సుపరిపాలన విజయోత్సవం వేడుకలను ఏప్రిల్ 22న గన్నవరంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. గన్నవరంలోని సెయింట్ జాన్స్ పాఠశాల ఆడిటోరియంలో నిర్వహించే ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కె హరిబాబు పాల్గొననున్నారు.

ఉపాధి కూలి రుణాలకు జమచేసుకోవడం దారుణం

బెంజిసర్కిల్, ఏప్రిల్ 19: కష్టపడి పనిచేసిన ఉపాధి వేతనాలను డ్వాక్రారుణాలు, వ్యవసాయ రుణాలకు జమ చేసుకోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బారావు, వెంకటేశ్వరరావులు వాఖ్యానించారు. ఉపాధి పని ద్వారా వచ్చిన వేతనాలను తక్షణమే కూలీలకు చెల్లించాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. గతంలో కూలి డబ్బులను పోస్ట్ఫాసుల ద్వారా చెల్లించేవారని, టిడిపి ప్రభుత్వం వచ్చాక బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్నట్లు తెలిపి, తీరా బ్యాంకుల్లో డబ్బులు జమఅయ్యాక బ్యాంకులు వారి పాత రుణాలకు జమ వేసుకుంటున్నట్లు తెలిపారు. దీని ద్వారా కూలీ పనులు చేసుకుంటున్న వారికి డబ్బులు మిగలడం లేదన్నారు. బ్యాంకులు అప్పులకు జమ చేయకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించక పోతే ఈ నెల 26న అన్ని కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.