కృష్ణ

ఇక బహుజన పార్టీగా బిజెపి .... * కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఏప్రిల్ 22: భారతీయ జనతా పార్టీని బహుజన పార్టీగా విస్తరింపచేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక విఎస్ సెయింట్ జాన్స్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన బిజెపి మూడేళ్ల సుపరిపాలన విజయోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి సభకు అధ్యక్షత వహించారు. మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బిజెపి అన్నారు. 11 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారని, 1385 మంది ఎమ్మెల్యేలు, 352 మంది ఎంపిలు ఉన్న అతి పెద్ద పార్టీ అని విశే్లషించారు. భారతదేశంలోని 15 రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో ఉందన్నారు. పార్టీ సందేశాన్ని పల్లెపల్లెకు, బస్తీబస్తీకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల భుజస్కంధాలపై ఉందన్నారు. ముస్లిం, మైనార్టీ వర్గాలను పార్టీలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. విశిష్ట అతిథి కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ చేనేత, హస్త కళలు, కళాకారులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారికి సబ్సిడీపై రుణాలు, పనిముట్లు, పహచాన్ గుర్తింపుకార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. పహచాన్ కార్డుల కోసం రాష్ట్రంలో 48,714 మంది కళాకారులు దరఖాస్తులు చేసుకున్నారని వీరికి త్వరలో కార్డులు అందజేస్తామన్నారు. చేనేత, హస్తకళల కళాకారుల ఉత్పత్తులకు మెరుగైన ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కె హరిబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల అంజిబాబు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దారా సాంబయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎస్ మాలతీరాణి, జిల్లా కార్యదర్శి ఎన్ మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోటుపల్లి శ్యామ్యూల్, నియోజకవర్గ కన్వీనర్ పి జయరావు, మండల అధ్యక్షులు నెర్సు వెంకట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అడిగిన ప్రతి కుటుంబానికీ పని కల్పించాలి
* వ్యకాసం డిమాండ్
మైలవరం, ఏప్రిల్ 22: అడిగిన ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని సీపీఎం అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. మండలంలోని మొర్సుమిల్లి తండా వద్ద జరుగుతున్న ఉపాధి హామీపనులను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రావూరి రామారావు, కార్యదర్శి కోట కల్యాణ్‌లు శనివారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. చేసిన పనికి కూలీలకు పే స్లిప్‌లు ఇవ్వాలన్నారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూలీలు పని చేస్తున్న ప్రదేశంలో కనీస వసతులు కూడా లేవన్నారు. షామియానా, మెడికల్ కిట్‌లు అందుబాటులో లేవని, కనీసం మస్తర్లు కూడా వేయటం లేదన్నారు. గట్టి నేల కావటంతో కూలీ ఒక్కొక్కరికీ 50నుండి 60 రూపాయలకు మించి పడటం లేదన్నారు. మేట్లు కూడా రావటం లేదన్నారు. వారం వారం పే స్లిప్‌లు ఇస్తే ఎంత కూలి పడేది తెలుస్తుందన్నారు. కూలిపై సిబ్బంది అవగాహన కల్పించటం లేదన్నారు. ప్రతి కూలీకి ఏడాదికి 150 రోజులు పని కల్పించాలన్నారు. ఎండాకాలం అలవెన్స్ 50శాతం పెంచాలన్నారు. మంచినీటికి ఎనిమిది రూపాయలు అదనంగా ఇవ్వాలని, గునపం సానపెట్టించుకోవటానికి 20 రూపాయలు ఇవ్వాలని, కూలీకి రాను, పోను చార్జీలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనేక పోరాటాల ఫలితంగా ఈ పథకాన్ని సాధించుకున్నామని వారు గుర్తు చేశారు. ఈపథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ ఈనెల 28న వెలగపూడి పిడి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూలీలంతా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

గవర్నర్‌ను ఆకట్టుకున్న కలంకారీ అద్దకం
పెడన, ఏప్రిల్ 22: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎల్‌ఎన్ నరసింహన్ కలంకారీ డిజైన్‌ను చూసి ముగ్ధులయ్యారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం పట్టణంలోని కలంకారీ యూనిట్‌ను సందర్శించి డిజైన్‌లను చూసి నిర్వహకులను ప్రశంసించారు. స్థానిక బ్రహ్మపురంలోని పిచ్చుక శ్రీనివాస్‌కు సంబంధించిన యూనిట్‌ను ఆయన సందర్శించారు. పరిశ్రమ బాగోగులు గురించి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే కలంకారీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. కలంకారీ పరిశ్రమకు ప్రపంచంలో మంచి ఆదరణ ఉందని, కలంకారీ ఉత్పత్తులను మరింత నాణ్యత ప్రమాణాలతో తయారు చేయాలని గవర్నర్ సూచించారు. ఈ సందర్భంగా పలు డిజైన్‌లను ఆయన పరిశీలించారు. గవర్నర్‌తో పాటు జిల్లా ఎస్పీ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు లక్ష్మణరావు, పెడన మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, వైస్ చైర్మన్ అబ్దుల్ హన్ను, మున్సిపల్ కమీషనర్ మనె్నం గోపాలరావు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. బ్రహ్మపురంలో గవర్నర్‌కు అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.

విద్యను కాషారుూకరణ చేసేందుకు కుట్ర
జగ్గయ్యపేట, ఏప్రిల్ 22: కేంద్ర ప్రభుత్వం విద్యను కాషారుూకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం మహేష్ అన్నారు.
శనివారం పట్టణంలోని జెఆర్‌సి కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా, విద్య, వైజ్ఞానిక శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యలో మతాన్ని చూపించాలని చూస్తోందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు తక్కువ ఉన్నాయని ఆయన ఆరోపించారు. సభలో ఐద్వా నాయకురాలు ఎం నాగమణి, జిల్లా కార్యదర్శి ఎం సోమేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పి ప్రవీణ్ తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి ఎం రామకృష్ణ, జిల్లా నాయకులు ఆర్ రాము తదితరులు పాల్గొన్నారు.

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
గన్నవరం, ఏప్రిల్ 22: ఉద్యోగులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. శనివారం గన్నవరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్ర కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత మండ తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి కార్యాలయంలో జరుగుతున్న కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు కంప్యూటరీకరణ చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. నాయక్ అనే ఉద్యోగి గత నాలుగు రోజులుగా సంతకం చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజాయిషీ కోరాలని ఆదేశించారు. వైద్యం కోసం నిరీక్షిస్తున్న రోగుల వద్దకు వెళ్లి వైద్యులు వైద్యం సక్రమంగా చేస్తున్నారా? మందులు ఇస్తున్నారా ? అని అడిగి తెలుసుకున్నారు. కేసరపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, ఎంపిపి పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎం మాధురి, పాఠశాల హచ్‌ఎం ప్రసూనాంబ పాల్గొన్నారు.