కృష్ణ

ఇతర దేశాల నుండి సిమెంట్ దిగుమతి చేసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 22: ఇతర దేశాల నుండి సిమెంట్ దిగుమతి చేసుకోడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు బిల్డర్స్ జెఎసి ప్రతినిధులు స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో జెఎసి ప్రతినిధి, క్రిడాయ్ అధ్యక్షుడు వైవి రమణారావు మాట్లాడుతూ సిమెంట్ కంపెనీలు ఒక్కసారిగా 230 నుండి 390 రూపాయలకు పెంచాయన్నారు. లాభాలను పెంచుకోవడానికి కంపెనీల యాజమాన్యాలు చూస్తున్నాయని, దీని వలన కాంట్రాక్టర్లు, సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం తరువాత నిర్మాణరంగం పెద్దదన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని లేకపోతే ఎంతోమంది జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. ప్రధానమంత్రి ప్రకటించిన హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ దెబ్బతీనే అవకాశం ఉందన్నారు. నిర్మాణరంగం పనులు నిలిపివేస్తే ఎంతో మంది ఉ పాధి కోల్పోయి జీతభత్యాలు లేక రో డ్డునపడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సిమెంట్ ధరలను అదుపులోనికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈవిలేఖర్ల సమావేశంలో ఎపిరీడా అధ్యక్షుడు జిఎస్‌ఎస్ ప్రసాద్, సిఆర్‌బిఎ అధ్యక్షుడు వి సుబ్బారావు, రాజేంద్ర, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

పోస్టింగ్‌లు పెడితే విజయసాయిరెడ్డినీ వదలం
* ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 22: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే విజయసాయిరెడ్డినీ వదిలేదిలేదని ఎమ్మెల్సీ, విజయవాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న హెచ్చరించారు. సోషల్ మీడియాలో తమ నాయకులు చంద్రబాబు, లోకేష్‌లపై చట్టసభలను కించపరిచేవిధంగా పోస్టింగ్‌లు పెట్టిన ఇంటూరి కిరణ్‌ను వెనుకేసుకువస్తూ అసెంబ్లీ కార్యదర్శికి హెచ్చరికలు చేసి, ఇకపై తానే పోస్టింగ్‌లు పెడతానన్న విజయసాయిరెడ్డినీ వదిలేది లేదని వెంకన్న అన్నారు. ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించినా ఊరుకునేది లేదన్నారు. అవినీతి కేసుల్లో 12 ఛార్జిషీటుల్లో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబ అవినీతి అక్రమాలకు రూపశిల్పని ధ్వజమెత్తారు. ఉగ్రవాదుల్లా కోడ్ భాషను ఉపయోగిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడిన విజయసాయి మరోసారి పోస్టింగ్‌లు పెట్టిన అరగంటలోపే కేసు పెట్టి జైలుకు పంపుతామంటూ వెంకన్న హెచ్చరించారు.

యువకుని హత్య కేసులో నిందితుని అరెస్టు

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 22: కృష్ణలంక పోలీస్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. క్రికెట్ బంతి తగిలిన ఘటన ఈనెల 18వ తేదీన హత్యకు దారి తీసిన విషయం తెలిసిందే. కేసులో నిందితుని అరెస్టుకు సంబంధించి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సౌత్ జోన్ ఏసిపి కె శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. బందరురోడ్డులోని పి అండ్ టి క్వార్టర్స్ జె బ్లాక్‌కు పడమరగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈనెల 18వ తేదీన తిమ్మిరి కిరణ్‌కుమార్, రవితేజ, కార్తిక్, వంశీకృష్ణ, రేవంత్, చందు, పవన్, ఆది, అవినాష్ మరికొందరు వ్యక్తులు క్రికెట్ ఆడుతూ ఉండగా సుమారు 4.45 గంటల సమయంలో ‘జె’ బ్లాకు బయట కనె్నగంటి దేవకీదేవి అనే మహిళ దండెం మీద ఆరవేసిన బట్టలు తీస్తున్న సమయంలో చందు అనే వ్యక్తి బ్యాట్‌తో కొట్టిన బాల్ వచ్చి ఈమెకు తగిలింది. వెంటనే ఆడుతున్న యువకులు వచ్చి ఆమెకు సారీ చెప్పారు. ఈలోగా ఆమె కుమారుడు శ్రీకాంత్ కిందకు దిగి వచ్చి వారిని దుర్భాషలాడి గొడవ పడ్డాడు. దీంతో కిరణ్‌కుమార్ కలిపించుకోగా ఘర్షణ పెరిగింది. పైగా.. కిరణ్‌కు, శ్రీకాంత్‌కు మధ్య గతంలో కూడా విభేదాలు ఉన్నాయి. గత ఏడాది హోలీ పండుగ సందర్భంగా శ్రీకాంత్‌పై కిరణ్ రంగు చల్లడాన్ని పురస్కరించుకుని గొడవ పడ్డారు. అదేవిధంగా ఈనెల 14వ తేదీ రాత్రి కూడా పి అండ్ టి క్వార్టర్స్‌లో బైక్ రైడింగ్ విషయమై కూడా ఇద్దరూ గొడవ పడ్డారు. ఈనేపధ్యంలో తల్లికి బాల్ తగలడాన్ని జీర్ణించుకోలేని శ్రీకాంత్ ఘటనను పురస్కరించుకుని ఇంట్లోకి వెళ్లి అరగంట తర్వాత చాకు తీసుకువచ్చి కిరణ్‌కుమార్‌ను తిడుతూ ఎడమ ఛాతి కింద పొడిచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడిపోయిన కిరణ్‌ను స్నేహితులు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారని, ఘటనపై హత్యకేసు నమోదు చేసి నిందితుడు పొలిమెట్ల శ్రీకాంత్ (28)ను అరెస్టు చేసి చాకు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. విలేఖరుల సమావేశంలో కృష్ణలంక సిఐ తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నారా లోకేష్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 22: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయవంతం వైపు నడిపించేందుకు గాను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు. రాష్ట్ర రాజధాని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రి నారా లోకేష్ నియమితులయ్యారు. దీంతో పార్టీ వర్గాల్లో సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తమవుతున్నది. మధ్యవర్తులు, గాడ్‌ఫాదర్‌లతో ప్రమేయం లేకుండా నేరుగా లోకేష్‌తో సత్సంబంధాలు పెంచుకోవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఈ నియామకం స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా శాసనసభ్యులకు పక్కలో బల్లెం వంటిదేనని చెప్పవచ్చు. తాము వేసే ప్రతి అడుగు నేరుగా లోకేష్ దృష్టికి వెళ్లగలదని అప్పుడే భయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆరు నెలలకు ముందుగానే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ సంకేతాలిస్తున్న సిఎం చంద్రబాబునాయుడు ఎంతో వ్యూహాత్మకంగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిలను నియమించినట్లు కన్పిస్తున్నది. వీరిలో అత్యధిక మందిని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా రంగంలోకి దింపేందుకు కూడా ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. దీనివలన వీరికి ఈ కొద్దికాలంలో నియోజకవర్గం పట్ల పూర్తి అవగాహన ఉంటుందని, పైగా శాసనసభకు గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని బాబు భావించినట్టు తెలుస్తున్నది. ఇటీవల కాలంలో ఎంపి కేశినేని నాని వివాదాల్లోకి వెళ్లటం, ఆపై మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ సిఎంను కలువటం పలు రకాల అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో నారా లోకేష్ నియామకం పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని చేసినట్టు కన్పిస్తున్నది. అలాగే నర్సరావుపేటకు ఆర్యవైశ్య వర్గానికి చెందిన శిద్ధా రాఘవరావును ఇన్‌చార్జిగా నియమించారు. గతంలో ఇదే వర్గానికి చెందిన ఎం.సుదర్శనం, కొణిజేటి రోశయ్య మూడు దఫాలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైకాపా రెడ్డి అభ్యర్థిని ఎదుర్కొనేందుకు శిద్ధా రాఘవరావును నియమించినట్లు కన్పిస్తున్నది. ఉన్న కొద్దికాలంలో ప్రస్తుత ఎంపిలు సక్రమంగా పనిచేయని పక్షంలో ఇన్‌ఛార్జీలే ఎంపి అభ్యర్థులు కాగలరని బెదిరింపు కూడా ఈ నియామకాల వెనుక ఉన్నట్లుగా అర్ధమవుతున్నది.

బాబు ఎ, వీరా జోడితో
అభివృద్ధిపథంలో విజయవాడ
* వీరపాండియన్ వీడ్కోలు సభలో ప్రజాప్రతినిధులు
* అందరి సహకారం అమోఘం: వీరపాండియన్

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 22: అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ అయిన విఎంసి కమిషనర్ వీరపాండియన్‌కు నగర ప్రజాప్రతినిధులు, విఎంసి అధికార సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. శనివారం సాయంత్రం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అత్మీయ వీడ్కోలు సభలో నగర ఎమ్మెల్యేలు బొండా ఉమమహేశ్వరరావు, జలీల్‌ఖాన్, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, నగర కార్పొరేటర్లు, విఎంసి అధికార, సిబ్బంది పలువురు వీరపాండియన్ తోపాటు ప్రత్యేక అతిథిగా కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్తున్న బాబు.ఎ లను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సత్కార సభలో ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ కలెక్టర్ బాబు, విఎంసి కమిషనర్ వీరపాండియన్‌లు కలిసి సమష్టిగా పనిచేసిన తీరు అమోఘమన్నారు. ప్రతినిత్యం నగరాభివృద్ధిపై పనిచేసిన తీరు అభినందనీయమని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కొనసాగింపుతోపాటు, జిల్లా మొత్తానికి వీరపాండియన్ సేవలు అందేలా చూసేందుకు వీరపాండియన్‌ను జిల్లా కలెక్టర్‌గా తీసుకొచ్చేందుకు అవసరమైన కృషి చేస్తానని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ అభివృద్ధితో రానున్న ఎన్నికలకు వెళ్తున్న తమకు వీరద్దరూ ఇంకా కొనసాగితే రానున్న ఎన్నికల్లో సులభంగా గెలిచేవారమని చలోక్తి విసిరారు. అనేక సమస్యలను పరిష్కరించడంతోపాటు ఎన్నడూ జరగని అభివృద్ది చేసి చూపించిన బాబు, వీరపాండియన్‌ల జోడి నగరానికి, జిల్లాకు ఎంతో మేలు చేసిందన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు మాట్లాడుతూ 450 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయి అర్థికంగా కష్టనష్టాలను చవిచూస్తున్న సమయంలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వీరపాండియన్ ప్రజలపై పన్ను భారాలను వేయకుండా ఇతర ఆదాయ మార్గాల ద్వారా అర్థిక పరిపుష్టి పెంచడమేగాక ఎంతో కాలంగా అవార్డులకు దూరంగా ఉన్న నగరానికి 5 స్వచ్ఛ మిషన్ స్క్వాచ్ అవార్డులను తీసుకురావడం అభినందనీయమన్నారు. వీరపాండియన్ బదిలీపై వెళ్ళడం కొంత బాధాకరమైనప్పటికీ మళ్లీ ఆయన కలెక్టర్‌గా జిల్లాకు తిరిగివస్తారని ఆశిస్తున్నానన్నారు. సత్కార గ్రహీత వీరపాండియన్ మాట్లాడుతూ నగర ప్రజాప్రతినిధులు, అధికార, సిబ్బంది సహకారంతోనే నగరాభివృద్ధిలో తన వంతుగా బాధ్యతలను నిర్వర్తించానని, నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు అందించిన సహాయ సహకారాలను తాను ఎన్నటికీ మరువలేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, నెల్లూరు జిల్లా కలెక్టర్ పి అరుణ్‌బాబు, టిడిపి ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, బిజెపి ఫ్లోర్ లీడర్ ఉత్తమ్ చంద్ బండారి, సిపిఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మీ, విఎంసి ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ మేడేపల్లి వరప్రసాద్, సిఎంహెచ్‌ఓ గోపినాయక్, డిసిఆర్ సుబ్బారావు, ఎస్టేట్ ఆఫీసర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొని వీరపాండియన్‌ను అభినందించారు. తొలుత విఎంసి పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.