కృష్ణ

ప్రజలకు జవాబుదారీగా ఉందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సంతృప్తికరమైన పాలనే అంతిమ లక్ష్యం కావాలి
* ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా ‘మీకోసం’
* ఉదయం 10గంటలకే అధికారులంతా సిద్ధం కావాలి
* ప్రతి ఫైల్ ఈ-ఆఫీస్ ద్వారానే రావాలి
* ఇకపై ఈ-సీడ్స్ ద్వారా విత్తనాలు పంపిణీ
* కార్పొరేషన్ రుణాలపై ఎంపిడివోలు శ్రద్ధ చూపాలి
* వసతి గృహాల్లో వసతుల మెరుగుకు ‘స్వీకారం’
* విద్యార్థుల కోసం ‘సదా మీ సేవలో’
* కలెక్టర్ బాలయ్య నాయుడు లక్ష్మీకాంతం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఏప్రిల్ 24: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ‘మీకోసం’ ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బాలయ్యనాయుడు మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టారు. జిల్లా నలుమూలల నుండి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ‘మీకోసం’లో తమ సమస్యలపై అనేక సార్లు అర్జీలు ఇస్తున్నా పరిష్కార చర్యలు సక్రమంగా ఉండటం లేదన్న విషయం తెలుసుకున్న కలెక్టర్ లక్ష్మీకాంతం ఇకపై అర్జీలపై ఆడిటింగ్ సిస్టమ్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని కూడా నియమించడం జరుగుతుందన్నారు. పరిష్కరించిన అర్జీ సంబంధిత అర్జీదారుడికి సంతృప్తికరంగా ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ ఆడిటింగ్ సిస్టమ్ దోహదం చేస్తుందన్నారు. కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ తర్వాత తొలిసారిగా సోమవారం నిర్వహించిన ‘మీకోసం’లో పాల్గొన్న ఆయన కార్యక్రమ నిర్వహణలో సమూలమైన మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి సోమవారం 11.30ని.లకు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని ఇకపై గంట ముందుగా 10గంటలకే ప్రారంభించడం జరుగుతుందన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ఆ సమయానికి తమ తమ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు వేసి సిద్ధంగా ఉండాలన్నారు. బయోమెట్రిక్ హాజరును ఆన్‌లైన్‌లో పరిశీలించడం జరుగుతుందన్నారు. అరగంట పాటు వివిధ శాఖల మధ్య నెలకొన్న సమన్వయంపై సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రజలకు సంతృప్తికరమైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి పని చేయాలన్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, వైద్య, విద్య శాఖలలో అధిక శాతం అర్జీలు పరిష్కారానికి నోచుకోవాల్సి ఉందన్నారు. జన్మభూమిలో వచ్చిన అర్జీలు కూడా పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు. వారం రోజుల్లో పెండింగ్ అర్జీలన్నింటినీ పరిష్కరించాలని అధికారులను ఆదేశారు. గత కలెక్టర్ బాబు.ఎ అవలంబించిన విధానం మాదిరి ప్రతి ఫైల్ ఈ-ఆఫీస్ ద్వారానే తనకు రావాలన్నారు. కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన లబ్ధిదారులకు రెండు అకౌంట్లు తెరిపించాల్సిన బాధ్యత ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లపై ఉందన్నారు. సత్వరమే బ్యాంకర్ల వద్దకు వెళ్లి రెండు రుకౌంట్లు ఓపెన్ చేయించి రుణ మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 2వతేదీ నాటికి జిల్లాను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత, పొగరహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఎంపిడివో, తహశీల్దార్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి తీర ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. మడ అడవులను నరికివేతదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చిన స్వీకారం, సదా మీసేవలో కార్యక్రమాన్ని కృష్ణాజిల్లాలో కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. స్వీకారం పేరుతో దాతల సహకారంతో వసతి గృహాల్లో వౌలిక సదుపాయాల కల్పించనున్నట్లు చెప్పారు. ఏ విద్యార్థీ సర్ట్ఫికేట్స్ కారణంగా విద్యా సంవత్సరం కోల్పోకూడదన్న లక్ష్యంతో సదామీసేవలో కార్యక్రమం పేరుతో మొబైల్ మీసేవా కేంద్రాలను నేరుగా విద్యా సంస్థల వద్దకు పంపి విద్యార్థులకు అవసరమైన ఇంటిగ్రేటెడ్ సర్ట్ఫికేట్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ-సీడ్స్ ద్వారా జిల్లాలో ఎరువుల పంపిణీని పటిష్ఠవంతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖరరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉత్తమ జెడ్‌పిటిసిగా వాసిరెడ్డికి పురష్కారం

చందర్లపాడు, ఏప్రిల్ 24: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జిల్లాపరిషత్ నిర్వహించిన పంచాయతీరాజ్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఉత్తమ జెడ్‌పిటిసి సభ్యులుగా వాసిరెడ్డి ప్రసాద్‌కు పురష్కారం అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనూరాధ, మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.