కృష్ణ

జల సంరక్షణ ఉద్యమంలో సైనికులు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం 90రోజుల పాటు కొనసాగిస్తున్న జల సంరక్షణ ఉద్యమంలో కార్యకర్తలు, నేతలంతా సైనికుల్లా పనిచేయాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో సోమవారం రాత్రి మైలవరం నియోజకవర్గ అభివృద్ధి, నీరు-ప్రగతి సమీక్షా సమావేశంలో మంత్రి ఉమ ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు-ప్రగతి కార్యాచరణ ప్రణాళికను ఆయన కార్యకర్తలకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని కరవు రహితంగా తయారు చేయాలనే సంకల్పంతో ఈనెల 22న ఈ పథకాన్ని అనంతపురంలో ప్రారంభించారన్నారు. ఇందుకు జలవనరుల శాఖ సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. విభజన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న సాగు, తాగునీటి ఎద్దడిని పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు ఈదీర్ఘకాలిక ఉద్యమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా నీటి నిల్వకు సంబంధించిన కార్యాచరణలో అందరూ పాల్గొనాలన్నారు.
నియోజకవర్గంలో 224 చెక్ డ్యాంలను పూర్తిచేయాలి
మైలవరం నియోజకవర్గంలో 224 చెక్ డ్యాంలను పూర్తి చేయాలని మంత్రి ఉమ సూచించారు. ఇస్రో అందించిన సమచారం మేరకు మైలవరం నియోజకవర్గంలో 239 చెక్ డ్యాంలను గుర్తించినట్లు, మైలవరం మండలంలో 68, రెడ్డిగూడెం మండలంలో 38, జి కొండూరు మండలంలో 99, ఇబ్రహీంపట్నం మండలంలో 7, విజయవాడ రూరల్ మండలంలో 4 చెక్ డ్యాంలు నిర్మించేందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. అనంతరం ఆయన వివిధ శాఖల వారీగా మైలవరం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించి, సమీక్షించారు. ఒక్కొక్క శాఖ అధికారి గడచిన మూడేళ్ళలో నియోజకవర్గంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధుల సమక్షంలో వివరించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రాలలో ఏడాదికి 12లక్షల రూపాయలు అన్ని రకాల పెన్షన్ల నిమిత్తం వెచ్చిస్తే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం హయాంలో సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఇదే విధంగా ఐదారు రెట్లు అభివృద్ధి జరిగిందని దీనిని కార్యకర్తలు, నేతలు ప్రజలకు తెలియజేయాలన్నారు. జలవనరులను సమృద్ధిగా, సురక్షితంగా ఉంచేందుకు చెరువులు, కాలువలు, కరకట్టలపై గుర్రపుడెక్కను, తూటు కాడను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మైలవరంలో పీతురు కాలువ మరమ్మతులకు 1.20కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 80లక్షల రూపాయలు మంజూరైనట్లు వెల్లడించారు. కీర్తిరాయినిగూడెం, పోరాటనగర్‌లలో ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలలో ఇళ్ళ స్థలాల సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఇన్‌చార్జ్ సబ్ కలెక్టర్ చక్రపాణిని, సంబంధిత తహశీల్దార్‌లను ఆదేశించారు. సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నుండి నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.