కృష్ణ

ఆపన్నులకు అండ బ్లూఫోర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఏప్రిల్ 26: ప్రత్యేక బ్లూఫోర్స్ బృందాలతో నిరంతరం శాంతి భద్రతలను పర్యవేక్షించేలా చ ర్యలు తీసుకుంటామని సిఐ మూర్తి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్ వద్ద బుధవారం బ్లూఫోర్స్ బృందం కార్యక్రమాలను సిఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ ద్దరు చొప్పున రెండు బృందాలు రద్దీ గా ఉండే ప్రాంతాలలో నిరంతరం ప ర్యవేక్షిస్తాయన్నారు. బ్యాంకులు, ఎటి ఎం సెంటర్లు, పాఠశాలలు, కళాశాలల తో పాటు రద్దీగా ఉండే ప్రాంతాలో ఈ బృందాలు పెట్రోలింగ్ చేస్తాయని తెలిపారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చి నా, సహాయం కావాలన్నా ఫోన్ చేస్తే ఈ బృందాలు వెంటనే సహాయపడతాయన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు, నేరాలను అదుపు చేసేందుకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మణి కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని సహించేదిలేదు
* అధికారులపై మండిపడ్డ మంత్రి రవీంద్ర
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఏప్రిల్ 26: అమృత స్కీమ్ పథకం కింద పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు జాప్యం జరగటం పట్ల రాష్ట్ర న్యాయ, యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రవీంద్ర తన నివాసంలో మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ బైపాస్ రోడ్డు, ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్‌కు అవరోధంగా ఉన్న విద్యుత్ స్థంబాలను మార్చి ట్రాఫిక్ ఐలెండ్స్‌ను నిర్మించాలని, లోఓల్టేజ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అమృత స్కీమ్, సబ్ ప్లాన్ నిధులు, 13వ ఆర్థిక సంఘం నిధులు, ముఖ్యమంత్రి హామీ నిధులతో రిజర్వాయర్లు, పైపులైన్ల నిర్మాణం, డ్రైనేజిల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పి కాశీవిశ్వనాధం, ప్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, నారగాని ఆంజనేయ ప్రసాద్, కమీషనర్ జస్వంతరావు, ఇంజనీర్ త్రినాధరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.