కృష్ణ

ఆర్జీయూకెటిలను బలోపేతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 26: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందిస్తున్న రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకెటి) వర్శిటీ అభివృద్ధిపై మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం అధికారులతో కలిసి సమీక్షించారు. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో వర్శిటీ ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చిస్తూ సిబ్బంది నియామకాలు, 2017-18 ప్రవేశాలు, భవన నిర్మాణ పనులపై దృష్టి సారించారు. నూజివీడు, ఆర్‌కె వ్యాలీ క్యాంపస్‌లలో భవనాల నిర్మాణ పనుల్లో జరుగుతున్న అలక్ష్యంపై మంత్రి గంటా అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం వర్శిటీలో అతి తక్కువ మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు ఉండటంతో కొత్తగా శాశ్వత సిబ్బంది నియామక ప్రక్రియకు కసరత్తు చేపట్టాలని ఈ క్రమంలోనే న్యాయపరమైన అడ్డంకులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. బోధనేతర సిబ్బంది నియామకంతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని స్ట్రీమ్ లైన్ చేయాలని సూచించారు. 2017-18 అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను చర్చించారు. శ్రీకాకుళం ఐఐఐటికి గురుకుల క్యాంపస్ భవనాలు ఇచ్చినప్పటికీ అక్కడ 600 మంది విద్యార్థులకు మాత్రమే వసతి ఉండటంతో ఇతర భవనాలు తీసుకునే అంశంపైనా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4 క్యాంపస్‌లు ఉన్నా కొత్త క్యాంపస్‌ల భవనాలు ఇంకా కేటాయింపు జరపకపోవటం దృష్ట్యా ఉన్న 2 క్యాంపస్‌లలోనే విద్యార్థులను ఏ విధంగా సర్దుబాటు చేయాలన్న అంశంపైనా మంత్రి పలు సూచనలు చేశారు. శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో సొంత భవనాల నిర్మాణాలు, స్థల పరిశీలనపైనా చర్చ జరిగింది. కొత్త క్యాంపస్‌లలో సొంతగా భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకొంటున్నామని మంత్రి పేర్కొన్నారు. మిగతా క్యాంపస్‌లలో ఎలాంటి వౌలిక సదుపాయాలు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గంటా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్జీయూకెటి వీసీ రాజు, డైరెక్టర్ దాసు తదితరులు పాల్గొన్నారు.