కృష్ణ

పోర్టుకోసం ‘రైతు దర్బారు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 17: బందరు ఓడరేవు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సమీకరణ విషయంలో రైతుల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను నివృత్తి చేసేందుకు ‘రైతు దర్బారు’ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు సమీపంలో ఓ ప్రైవేట్ గృహంలో ‘రైతు దర్బారు’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని గురువారం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు ప్రారంభిస్తున్నారు. ఓడరేవు, పారిశ్రామిక వాడ నిర్మాణానికి ప్రభుత్వం 33వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించనున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ఇప్పటికే మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ)ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం భూ సమీకరణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు గాను పార్టీ పరంగా ఈ రైతు దర్బార్‌ను ఏర్పాటు చేశారు. పూలింగ్‌లో ఎటువంటి సమస్య ఉన్నా రైతులు ఈ కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించారు. పార్టీ పరంగా ఏర్పాటు చేసిన భూసమీకరణ కమిటీల ప్రతినిధులు రైతులకు సేవలు అందించనున్నారు. భూసమీకరణ ఫారాలు పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేయనున్న ప్యాకేజీపై కూడా రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించడం ఈ రైతు దర్బారు ముఖ్య ఉద్దేశమని పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు కార్యాలయ వర్గాలు తెలిపాయి. రైతు దర్బారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ తదితరులు పాల్గొనున్నారు.

వడదెబ్బకు ముగ్గురు మృతి
పామర్రు, మే 17: వడగాల్పులకు గురై పామర్రులో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్రమైన వడగాల్పులకు బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయం సమీపంలో గుడివాడ - పామర్రు జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న పామర్రు బాపూజీ పేటకు చెందిన చలపాటి శివాజీ (32) వడదెబ్బకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్ళే సమయంలోనే మృతి చెందాడు. శివాజీ కుటుంబ సభ్యులను పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పరామర్శించారు. తహశీల్దార్ ఎం పద్మారాణి ఆధ్వర్యంలో ఎఎస్‌ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు గుడివాడ తరలించారు. అదే విధంగా స్థానిక వీరాంజనేయ కాలనీలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పూడి సూర్యనారాయణ (60) అనే వృద్ధుడు వడగాల్పులకు మృతి చెందినట్లు కుమారుడు పూడి రామారావు తెలిపారు. స్థానిక నాగులేరు గట్టు వద్ద శాకమూరి రాంబాబు (50) అనే వ్యక్తి వడగాల్పులకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నిర్మాణంలో 140 గృహాలు
* ఇల్లు కట్టలేమన్న 52 మంది

తోట్లవల్లూరు, మే 17: తోట్లవల్లూరు మండలంలో 2016-17 సంవత్సరంలో ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద మంజూరైన గృహాలను లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవటం లేకపోతున్నారు. గృహం నిర్మించుకోవాలన్న ఆసక్తి లేని వారు జాబితాలో ఉండటం వల్ల వందశాతం ప్రగతి కనిపించటంలేదు. మండలంలోని 16 గ్రామాలలో 214 గృహాలు మంజూరవ్వగా ఇప్పటి వరకు 140 మంది నిర్మాణాలు ప్రారంభించారు. 140 మంది ఒక బిల్లు తీసుకుని నిర్మాణాలు కొనసాగిస్తుండగా ఇంకా 74 మంది ఇళ్ళ నిర్మాణాలను చేపట్టలేదు. అధికారులు లబ్ధిదారుల చుట్టూ ఎన్ని రోజులు తిరిగి నిర్మాణ పనులు మొదలు పెట్టాలని కోరినా ఫలితం లేకుండా ఉంది. ఈ 74 మందిలో 52 మంది తమకు గృహం అవసరం లేదని హౌసింగ్ అధికారులకు లెటరు రాసి ఇచ్చారు. అంటే ఇల్లు నిర్మించుకోవాలన్న ఆసక్తి లేని వ్యక్తులను జాబితాలో చేర్చటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. నిజంగా ఇల్లు కట్టుకోవాలన్న వ్యక్తులను పక్కన పెట్టి రాజకీయ వత్తిళ్లతో అనర్హులకు గృహాలు కేటాయించటం వల్ల ఇళ్ళు ఇవ్వటం లేదని ప్రభుత్వం విమర్శలకు గురికావలసి వచ్చింది. ఇళ్ళు నిర్మించుకోలేమని చెప్పిన 52 మంది స్థానంలో కొత్తవారి పేర్లను ప్రపోజ్ చేస్తూ అధికారులకు పంపించాం. త్వరలో కొత్త వారికి గృహాలు వస్తాయి. అలాగే నియోజకవర్గానికి కొత్తగా 2200 గృహాలు వస్తున్నాయి. ఇందులో మండలానికి వచ్చే వాటాలో గతంలో మిగిలిపోయిన అందరికి గృహాలు మంజూరవుతాయి. 200 చదరపు అడుగులకు తగ్గకుండా 500 చదరపు అడుగులకు మించకుండా గృహాలను నిర్మించుకోవాలి. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే బిల్లులు రావు.

ఎస్‌ఎస్‌సిలో ప్రతిభ చాటిన
విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
మచిలీపట్నం (కల్చరల్), మే 17: పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అభినందించారు. బుధవారం స్థానిక బందరు కోట, గిలకలదిండి మున్సిపల్ హైస్కూల్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సమకూర్చిన నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హైస్కూల్స్ సూపర్‌వైజర్ యు శ్రీనివాసరావు, కౌన్సిలర్లు బచ్చుల అనీల్, సాయి పద్మజ, ప్రధానోపాధ్యాయులు టివి రఘుకాంత్, మోపిదేవి రామారావు తదితరులు పాల్గొన్నారు.

టాస్క్ఫోర్స్ దాడిలో
160 కేజీల గంజాయి పట్టివేత
* పోలీసుల అదుపులో మహిళ సహా ఇద్దరు
విజయవాడ (క్రైం), మే 17: విశాఖ జిల్లా నుంచి నగరం మీదుగా పెద్ద మొత్తంలో రవాణా అవుతున్న గంజాయిని టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. అనకాపల్లి నుంచి కారులో నాసిక్ తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసిపి ప్రసాద్ నేతృత్వంలో ఎస్‌ఐ శ్రీనివాస్ సిబ్బందితో గన్నవరం పొట్టిపాడు చెక్‌పోస్టు వద్ద నిఘా వేసి గంజాయితో వెళ్తున్న ఇండికా కారును పట్టుకున్నారు. సుమారు రూ.8లక్షల విలువ చేసే 160కేజీల గంజాయిని కారుతో సహా స్వాధీనం చేసుకుని తరలిస్తున్న ఓ మహిళ, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నారు.