కృష్ణ

పోర్టు భూముల సమీకరణలో జాప్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 17: బందరు పోర్టు భూముల సమీకరణలో జాప్యాని సహించేది లేదని మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. భూసమీకరణపై బుధవారం ముడ అధికారులతో ఆయన సమీక్షించారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చే రైతులకు ప్రభుత్వం అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చిందని, ఈ విషయాన్ని రైతుల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడరేవు నిర్మాణానికి అవసరమైన 5వేల ఎకరాల్లో 3వేల ఎకరాలు ప్రభుత్వ, అసైన్డ్ భూముల సేకరణ పూర్తయినా పట్టా భూముల సమీకరణలో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. 15 రోజుల్లో పోర్టు భూముల సమీకరణ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ప్లానింగ్ అధికారి శిల్ప, ముడ డెప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. పిటిషన్ ఆడిటింగ్ సిస్టంపై కలెక్టరేట్ సూపరింటెండెంట్లతో సమీక్ష జరిపిన కలెక్టర్ రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలను విశే్లషించి గురువారం నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మండలాల వారీగా గత ఏడాది అందిన పిటిషన్లను పరిశీలించి నేరుగా అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎఓ మూర్తితో పాటు సెక్షన్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

సిబి కెనాల్‌లో కుళ్లిపోయిన యువకుని మృతదేహం
కలిదిండి, మే 17: మండల పరిధిలోని గుర్వాయిపాలెం పంచాయతీ శివారు సిబి కెనాల్‌లో కుళ్లిపోయిన యువకుని మృతదేహం బుధవారం బయటపడింది. స్థానికుల వివరాల ప్రకారం సిబి కెనాల్‌లో సూపర్ సంచిలో మూటకట్టి ఉండి దుర్వాసన వెదజల్లటంతో సమీంపలోని గ్రామస్థులు గమనించి విఆర్‌ఎ యాకోబుకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మూటను వెలికి తీయించి చూడగా కుళ్లిపోయిన యువకుని మృతదేహంగా కనిపించింది. మృతుడు బ్లాక్ జిన్స్ పాయింట్, బిస్కెట్ కలర్ పుల్ హ్యాండ్ షర్టులో ఉన్నట్లు గుర్తించారు. దుస్తులు ఆధారంగా మృతుడికి 25 సంవత్సరాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. కైకలూరు ప్రభుత్వాసుపత్రి నుండి వచ్చిన వైద్యురాలు డా. ప్రశాంతి అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. విఆర్‌ఓ కె వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌతమ్ కుమార్ తెలిపారు. కైకలూరు సిఐ రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అవనిగడ్డలో సమష్టి శ్రమదానం
అవనిగడ్డ, మే 17: స్వచ్ఛ అవనిగడ్డ కార్యక్రమంలో భాగంగా బుధవారం అవనిగడ్డలో ఎన్‌సిసికి చెందిన 105 మంది విద్యార్థులు, స్వచ్ఛ సైనికులు అవనిగడ్డ సేవాదళ్ ఆధ్వర్యంలో సమిష్టి శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం పులిగడ్డలోని గురుకుల విద్యాలయానికి చెందిన 34మంది విద్యార్థులతో పాటు పలు సంస్థలకు చెందిన మొత్తం 105 మంది విద్యార్థులు పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్‌సిసి కల్నల్, రాజశేఖర్, హవల్దార్ మస్తాన్‌వలీ, వెంకటేశ్వర్లు, ఎం కుమారి, ఎఎస్‌ఓ మత్తి అరుణ, బడె వెంకట్రామ్, బడే శేషగిరి, ఎంపిటిసి మురళీకృష్ణ, ఎం ఈశ్వరరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక భారతీ వైద్యశాల నుండి పులిగడ్డ గౌడపాలెం వరకు ఆర్‌అండ్‌బి రహదారికి ఇరువైపులాగల పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో దాదాపు 100 మంది ఎన్‌సిసి విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని వైద్యశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మత్తి శ్రీనివాసరావు, డా. కృష్ణదొర పర్యవేక్షించారు.