కృష్ణ

క్రీడలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), మే 17: క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో జరుగుతున్న శాప్ సమ్మర్ రెసిడెన్షియల్ శిక్షణా శిబిరాలను పరిశీలించారు. శాప్ ఆధ్వర్యంలో కబడ్డీ, అథ్లెటిక్స్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్ క్రీడాంశాల్లో శిబిరాలు జరుగుతున్నాయి. బుధవారం ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్, శాప్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక శ్రీదుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మారుస్తామని, క్రీడాపాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందన్నారు. క్రీడాపాలసీలో క్రీడల నిర్వహణకు అనేక అంశాలతో పటిష్ఠమైన జాబితాను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో జాతీయక్రీడల నిర్వహణకు సిఎం కృషి చేస్తున్నారని, క్రీడల అభివృద్ధికి అకాడమిలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్రీడా కోటాలో 2శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను 5 శాతానికి పెంచడం జరిగిందన్నారు. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించడానికి సిద్ధార్థ అకాడమి ముందుటుందని, శాప్ నుండి క్రీడలకు అవసరమైన సహయ సహకారాలు అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. తెలుగుతేజం ఒలింపియన్ పివి సింధుకు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు అసెంబ్లీలో ఆమోదించడం జరిగిందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శాప్ ఎండి బంగార్రాజును ఘనంగా సత్కరించారు. అంతకు ముందు కళాశాల ఇండోర్ స్టేడియంను సందర్శించిన మంత్రి, ఎమ్మెల్యే కొద్దిసేపు బాడ్మింటన్ ఆడారు. టేబుల్ టెన్నిస్‌లో రోబోపై శిక్షణానిచ్చే తీరును శిక్షకులను అడిగి తెలుసుకుని టేబుల్ టెన్నిస్ ఆడారు. టిటి అంతర్జాతీయ క్రీడాకారిణులు శైలూనూర్ భాషా, కాజోల్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, శాప్ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగార్రాజు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎ రాఘవేంద్ర, కోచ్ వినాయక్ ప్రసాద్, ఆర్చరీ రాష్ట్ర సంఘ కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణ, కబడ్డీ జిల్లా సంఘ కార్యదర్శి వై శ్రీకాంత్, జిల్లా అథ్లెటిక్స్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌జైన్, నాగేశ్వరరావు, డిఎస్‌డిఓ ఎండి సిరాజుద్దీన్, శాప్ ఒఎస్‌డి పి రామకృష్ణ, టేబుల్ టెన్నిస్ కోచ్‌లు అచ్యుత్, దామోదరరెడ్డి, పాండురంగారావు, సిద్దార్థ కళాశాల ప్రిన్సిపాల్ డా టి విజయలక్ష్మీ, వ్యాయామవిద్యా సంచాలకురాలు రవికాంత, పిడి భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ల దందా కేసులో
రాజకీయ మంత్రాంగం!
* ఓ మంత్రి అండతో రాజీకి రాయ‘బేరాలు’?
* పరారీలోని వైద్యుల కోసం సిసిఎస్ బృందాల గాలింపు
విజయవాడ (క్రైం), మే 17: రంగురాళ్ల వ్యాపారి కిడ్నాప్, దాడి వ్యవహారం రాజకీయరంగు పులుముకుంటోంది. ఒక స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో కేసు నేరుగారిపోతుందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తవౌతున్నాయి. అయితే ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించని సీపీ గౌతం సవాంగ్ మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా తనదైన శైలిలో దర్యాప్తు చేయస్తున్నారు. అయితే వైద్యుల తరఫు మంత్రి స్థాయిలో మంతనాలు మొదలైనట్లు తెలుస్తోంది. బాధితుని తరుపు వ్యక్తులతో మధ్యవర్తులు రాయ‘బేరాలు’ సాగిస్తున్నట్లు సమాచారం. తనను నిర్బంధించి పైశాచికంగా కొట్టి నరకం చూపిన డాక్టర్లు తన రూ. 2కోట్ల విలువైన ఆస్తులను స్వాహా చేయాలనే తనను కిడ్నాప్ చేసినట్లు బాధితుడు బ్రహ్మాజీరావు ఆరోపిస్తున్నాడు. ఓ ప్రముఖ దినపత్రిక, టివి ఛానల్‌కి చెందిన విలేఖరి సమక్షంలోనే డాక్టర్లు తనను బాధించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒంటిపై బంగారం, నగదు నిలువుదోపిడీ చేసినట్లు పేర్కొన్నాడు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులు పరారీలో ఉండగా వీరికోసం సిసిఎస్ బృందాలు మమ్మరంగా గాలిస్తున్నాయి. ఉన్నతస్థాయి వ్యక్తులు, కొందరు పోలీసు అధికారులు, రాజకీయ ప్రముఖల అండదండలతో వారు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పటమట కోనేరు వీధికి చెందిన తమ్మారెడ్డి బ్రహ్మాజీరావు అనే రంగురాళ్లు, గ్రానైట్ వ్యాపారిని నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు పువ్వాడ రామకృష్ణ, హేమంత్, సన్నీ, చలపాటి రవి, చలపాటి వెంకటేశ్వరరావు, శ్రావణ్, తదితరులు కిడ్నాప్ చేసి నున్న శివారు తోటల్లో నిర్బంధించి చితకబాదిన విషయం తెలిసిందే. బాధితుడు సీపీని ఆశ్రయించడంతో ఈ డాక్టర్ల దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సహకరించిన ఏసిపి కె సూర్యచంద్రరావు, పటమట సిఐ కెనడీలపై సీపి చర్యలు తీసుకున్న సంగతి విదితమే. నగరంలో అలజడి రేకెత్తించిన ఈ వ్యవహారంపై బాధితుని ఫిర్యాదు మేరకు పటమట స్టేషన్‌లో వైద్యులపై కేసు నమోదైంది. బాధితుడు బ్రహ్మాజీరావు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ఒంటిపై ఉన్న బంగారం, నగదు మొత్తం దోచుకుని వదిలేస్తారనుకుంటే ‘నీకు పిల్లలు లేరు. ఎవరూ లేరుగా.. 2కోట్ల ప్రాపర్టీ మా పేరుమీద రాయమంటూ కర్రలు, రబ్బరు ట్యూబ్‌లతో ఇష్టమొచ్చినట్లు చావబాదారని ఆస్పత్రిలో బుధవారం విలేఖరులకు వెల్లడించాడు. ఇంట్లో ఎర్రసంచిలో ఉన్న వజ్రాలు ఇవ్వాలంటూ వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని తన ఇంటికి పంపగా అనుమానం వచ్చిన తన భార్య పోలీసులను ఆశ్రయించడం వల్లనే తాను బతికి బయటపడ్డానని, లేకుంటే చంపేసి డాక్టర్లు పోస్టుమార్టం కూడా చేసేసేవారని వాపోయాడు. ఓ ప్రముఖ దినపత్రికకు చెందిన విలేఖరి సమక్షంలోనే కొడుతున్నా.. బీరు తాగుతూ వౌనంగా చూస్తున్న సదరు వ్యక్తి కెమెరాతో షూట్ చేశాడని ఆరోపించాడు. డాక్టర్లు కిరాయి రౌడీలతో కొట్టించారని చెప్పాడు. ఇదిలావుండగా ఈ వ్యవహారంపై జిల్లాకు చెందిన ఓ మంత్రి వైద్యులకు అండగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే భారతినగర్ పరిసరాల్లో మంత్రి తాలూకూ వ్యక్తులు బుధవారం ఓ ఇంట్లో భేటీ అయి బాధితుడు బ్రహ్మాజీరావు తరఫువారితో రాజీయత్నాలు సాగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. బుజ్జగించి, భయపెట్టి రాయ‘బేరాలు’ సాగిస్తున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకాధికారిగా నియమితులైన డిసిపి జి పాలరాజు సీపీ సవాంగ్ నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగేది లేదని తెగేసి చెబుతున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. అయితే వారిని అదుపులోకి తీసుకునేందుకు రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ బృందంలోని ఓ వైద్యునిపై ఆరోగ్యశ్రీ స్కాం కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో అరెస్టు కూడా అయినట్లు పోలీసులు నిగ్గు తేల్చారు.