కృష్ణ

ఆహ్లాదం.. ఆనందాల జాడేదీ!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 18: నవ్యాంధ్ర రాజధాని నగరమని చెప్పుకుంటున్న నగరంలో పార్కుల సొగసు చూడతరమా అన్న చందంగా దుర్భరంగా మారాయి. పేరుకే పార్కులైన విఎంసి పార్కుల్లో ఆనందంతో పాటు ఆహ్లాద వాతావరణం కూడా కొరవడింది. నగర యాంత్రిక జీవనంలో కొద్దిపాటి ఉపశమనం, ఆహ్లాదం, ఆనందం కలిగించేవి పార్కులేనన్న విషయం అందరికీ తెలిసిందే. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా ప్రస్తుత వేసవిలో ఆటవిడుపునకు సరైన పార్కులు లేక ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యం వర్ణనాతీతం. రూ.వంద కోట్ల పన్ను టార్గెట్ పెట్టి ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న నగర పాలకులు అందుకనుగుణంగా అందించే ఆయా సదుపాయాలలో భాగంగా పార్కుల అభివృద్ధి కూడా ఒక భాగమే అయినప్పటికీ ఈవిషయంలో తమ బాధ్యతలను విస్మరించిన అధికారుల తీరుతో ప్రజలకు ఆహ్లాదం, ఆనందం అందనంత దూరంలో ఉన్నాయనే చెప్పాలి. నగర పరిధిలో విఎంసికి చెందిన పార్కులు 133, ప్లానిటేషన్స్ 100 ఉన్నట్టుగా అధికారికంగానే కాకుండా విఎంసి వెబ్‌సైట్‌లో కనిపిస్తుండగా వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆహ్లాదంతోపాటు ఆనందాన్ని అందించే పార్కులేమైనా ఉన్నాయంటే వాటిని వేళ్ల మీద లెక్కించవచ్చు. వీటిలో కూడా లాన్ గడ్డి, క్రోటన్, పూల మొక్కలు తప్పించి మరే ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించే సాధనాలు లేవన్నది కళ్లకు కనిపిస్తున్న నిజం. మూడేళ్లుగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పార్కుల విషయంలో తీసుకొన్న అభివృద్ధి చర్యలేమిటన్నది కూడా ఆగమ్యగోచరమే. విఎంసి అధికారిక లెక్కల ప్రకారం విఎంసి పార్కులు 133గా చూపుతుండగా వీటిలో ప్రధానంగా రాజీవ్‌గాంధీ, పార్కు, డాక్టర్ కెఎల్ రావు పార్కు, రాఘవయ్య- అంబేద్కర్ పార్కు, జివిఎస్ శాస్ర్తి పార్కు, కనకదుర్గ గజిటెడ్ ఆఫీసర్స్ పార్కు, టీచర్స్ కాలనీ పార్కు, గుమ్మడి శ్రీనివాస చక్రవర్తి పార్కు, నాగార్జున నగర్ పార్కు, వెటర్నరీ కాలనీ పార్కు, కరెన్సీ నగర్ పార్కు, బాపూజీనగర్ పార్కు, శ్రీనివాసనగర్ పార్కు, ఇన్‌కం టాక్స్ కాలనీ పార్కు, ముత్తవరపు నాగరాజకుమారి పార్కులుగా ఉన్నాయి. గతంలో రాజీవ్‌గాంధీ పార్కు, డాక్టర్ కెఎల్ రావుపార్కు, అంబేద్కర్-రాఘవయ్యపార్కులు నగరానికి తలమానికంగా ఉండేవి. గత కాంగ్రెస్ నగర పాలన హయాంలో అప్పటి మేయర్ జంధ్యాల శంకర్ రాజీవ్‌గాంధీ పార్కును అంత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దారు. మ్యూజికల్ లైటింగ్ ఫౌంటేన్ తోపాటు వివిధ రకాల ఆకృతులు ఆహ్లాదకర వాతావరణం నగర ప్రజలను అలరించేవి. విఎంసి ఖజానాకు గణనీయ ఆదాయాన్ని అందించిన రాజీవ్‌గాంధీ పార్కు ప్రస్తుతం అత్యంత దయనీయంగా తయారైందంటే నగర పాలకులు పార్కుల అభివృద్ధిలో చూపుతున్న శ్రద్ధ ఏపాటిదో ఇట్టే చెప్పేయచ్చు. వందేళ్ల విఎంసి చరిత్రలో ప్రతిష్ఠాత్మకంగా నిలచిన రాజీవ్‌గాంధీ పార్కు మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకమే. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ల్యాండింగ్ రాజీవ్‌గాంధీ పార్కు వరకూ వస్తుందని, ఈ నిర్మాణానికి ఎంత స్థలం పోతుందో చూసి మిగిలిన స్థలంలో పార్కును అభివృద్ధి చేద్దామన్న మీమాంశలో అధికారులు కొట్టుమిట్టాడుతుండగా కనకదుర్గమ్మ బ్రిడ్జి పూర్తి గత రెండేళ్ల నుంచి అదిగో ఇదిగో అంటూ జరుగుతున్న కాలయాపనతో రాజీవ్‌గాంధీ పార్కు అభివృద్ధి పరిస్థితి కూడా త్రిశంకు స్వర్గంలా మారింది. ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత్ పథకంలో పార్కుల అభివృద్ధికి కోటి రూపాయలు కేటాయించగా ఈ మొత్తాన్ని రాజీవ్‌గాంధీ పార్కు అభివృద్ధికే కేటాయించగా ఇటు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక, అమృత్ పథకంలో మంజూరైన కోటి రూపాయలు వినియోగించలేక అధికరణం తీవ్ర సందిగ్ధంలో ఉండిపోయారు. కెఎల్ రావుపార్కు అభివృద్ధికి కూడా రూ.30 లక్షలు కేటాయించి కాంట్రాక్టర్‌తో చేయిస్తున్న పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఇక మిగిలిన పార్కుల పరిస్థితి పరిశీలిస్తే కొన్ని పార్కులను పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) కింద నిర్వహణలో ఉన్నాయి. ఈ పార్కుల పరిస్థితి కూడా అంతంతమాత్రమే. ప్రవేశ రుసుముం, క్యాంటిన్, కూల్‌డ్రింక్స్, చిట్‌చాట్‌ల వ్యాపారాలకే పరిమితమైన ఈ పార్కులకు సరైన ఆదరణ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. దిక్కుతోచక ఏవరైనా టైం పాస్ కోసం ఫ్యామిలీ తో వెళ్ళితే అక్కడ కనిపించే అసభ్య చిత్రాలు చూడలేక కళ్లు మూసుకొని 2నిమిషాల్లో వెనక్కిరావడం ఖాయమనించే విధంగా ఉండగా వాటిని నిలువరించే యంత్రాంగమే లేకపోయింది. ఇక దాతల సాయంతో ఏర్పాటైన అనేక పార్కులు దిష్టిబొమ్మలా ఉన్నాయి. పార్కుకు తమ పేరు పెట్టడంతోనే సరనుకొని ఇక వాటి ముఖం చూడని దాతల పార్కుల పరిస్థితి దుర్బరమన్నది సుస్పష్టం. ఇలా చెప్పుకొంటూ పొతే నగరంలోని ప్రతిపార్కుకూ ఒక కథ కనిపిస్తుంది. నగర జీవనంలో అంతర్భాంగా ఉండే పార్కుల అభివృద్ధిలో నగరంలోని పది లక్షల జనాభా ఆకాంక్ష ఎప్పటికి నెరవేరేనో వేచిచూడాల్సిందే.

గంగిరెద్దులదిబ్బ ప్లాంట్‌కు
రెట్టింపు నీటి సరఫరా
* మేయర్ కోనేరు శ్రీ్ధర్
* 120 హెచ్‌పి పంపింగ్ మోటార్లు ప్రారంభం
విజయవాడ (కార్పొరేషన్) మే 18: భవానీపురంలోని హెడ్‌వాటర్ వర్క్స్‌లో గుణదలలోని గంగిరెద్దులదిబ్బ వద్ద నిర్మించిన 46 ఎంఎల్‌డి ప్లాంట్‌కు కృష్ణానదీ నుంచి నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన 120 హెచ్‌పి సామర్ధ్యం కలిగిన 3 పంపింగ్ మోటార్లను నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ప్రారంభించారు. గురువారం ఉదయం జరిగిన ప్రారంభోత్సవంలో శ్రీ్ధర్ మాట్లాడుతూ ఈ పంపింగ్ మోటార్ల ప్రారంభంతో గంగిరెద్దులదిబ్బ వద్ద 46 ఎంఎల్‌డి ప్లాంట్‌కు రెట్టింపు నీటి సరఫరా అవుతుందన్నారు. ప్రస్తుతం 20 ఎంఎల్‌డి నీరు మాత్రమే సరఫరా అవుతున్న నేపథ్యంలో నీటి సమస్యలెదురవుతున్నాయని, వాటిని అధిగమించేందుకు 14వ ఫైనాన్స్ గ్రాంటు ద్వారా నిధులను విడుదల చేయించి అదనపునీటి సరఫరా చేస్తున్నామన్నారు. దీంతో గుణదల మైత్రినగర్, మాచవరం, కార్మెల్‌నగర్, వెటర్నరీ కాలనీ, జెడి నగర్, పి అండ్ టి కాలనీ, నెల్సన్ మండేలా పార్కు, బ్యాంక్ కాలనీ, గుప్తా కల్యాణ మండపం, మొగల్‌రాజపురం, తదితర ప్రాంతాలకు సంపూర్ణంగా మంచినీరు సరఫరా అవుతుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో టిడిపి ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, కార్పొరేటర్లు దాసరి మల్లేశ్వరి, దోమకొండ జ్యోతి, వీరంకి కృష్ణకుమారి, కొత్త రమాదేవి, ఇన్‌చార్జ్ సిఇ పి ఆదిశేషు, డిఇఇ టి రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

విదేశీ విద్యకు ఎంపికైన వారితో
31న ముఖ్యమంత్రి ముఖాముఖి
* కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 18: కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు అర్హులైన విద్యార్థినీ విద్యార్థులకు ఈ నెల 31న సాయంత్రం తుమ్మలపల్ల కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆశీస్సులు అందజేస్తారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పేద కాపులకు వరం, కాపు కార్పొరేషన్ విదేశీ విద్యా దీవెన ద్వారా గత సంవత్సరం 492 మంది విద్యార్థినీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశం ఇచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో విదేశాల్లో చదవాలి అనే కోరిక ఉన్న కాపు విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులకు విదేశాల్లో చదివించే స్థోమత లేక విదేశీ చదువు పేద కాపులకు ఒక కలగా మిగిలిపోయిందని అయితే బాబు వారి కలలు నిజం చేస్తున్నారని అన్నారు. అందుకే మొన్న అమెరికాలో చంద్రబాబుని కలిసిన విదేశీ విద్య నభ్యసించే కాపు విద్యార్థినీ విద్యార్థులు ‘ట్యాంక్యూ సిఎం సర్’ అంటూ వారి అనందాన్ని చంద్రబాబు షేర్ చేసుకున్న తీరు చూస్తే చంద్రబాబు ఉన్నంతకాలం సిఎంగా ఉండాలని కాపులు కోరుకుంటున్నారని అన్నారు.

ఉపాధి హామీ పథకం ద్వారా
కొత్తకా 55వేల హెక్టార్ల ఆయకట్టుకు నీరు
* కలెక్టర్ లక్ష్మీకాంతం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ , మే 18: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 55వేల హెక్టార్ల ఆయకట్టును అదనంగా వినియోగంలోకి తీసుకుని దాదాపు 100 కోట్ల రూపాయలు జిల్లాకు ఆదాయం వచ్చేలా ప్రణాళికతో పనులు శరవేగంతో జరుగుతున్నాయని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. గురువారం కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల ప్రగతిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో భాగంగా జిల్లాలో నేడు 970 గ్రామ పంచాయతీల్లో లక్షా 38 వేల మంది కూలీలు పనులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోను చేపట్టని విధంగా ఒక్క కృష్ణాజిల్లాలో మాత్రమే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 12వేల పంట కుంటల లక్ష్యాలకు గాను ఇప్పటికే వెయ్యికి పైగా పంట కుంటలను పూర్తిచేసామని మరో 3వేలు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ నెలలోనే రికార్డుస్థాయిలో 772 పంట కుంటలు తవ్వామని కలెక్టర్ వివరించారు. ఉపాధి హామీ పథకంలో 18వేల కంపోస్టు ఎరువులు తయారీ లక్ష్యాలకు గాను 921 పూర్తిచేసామన్నారు. ఈ నెలలో 461 కంపోస్టులను పూర్తిచేసి రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ అన్నారు. నీటి సంరక్షణలో 563 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాల్సి ఉండగా 275 చెరువుల్లో పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి చెరువుల్లో డిసిల్టింగ్‌లో భాగంగా 208 మంజూరు కాగా 70 చెరువుల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 5వేల ఇంకుడు గుంటలు పూర్తిచేసామన్నారు. స్మశానాల అభివృద్ధిలో భాగంగా 258 చోట్ల పనులు ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటికే 158 స్మశానాల్లో పనులు ప్రారంభించామన్నారు. పాఠశాలల్లో 165 ఆట స్థలాల చదును పనులు చేపట్టాల్సి ఉండగా 135 చోట్ల పనులు ప్రారంభించామన్నారు. శాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా 204 మంజూరుకాగా ఇప్పటికే 25 భవనాలు పూర్తిచేసి మరో 77 భవనాలు పురోగతిలో ఉన్నాయన్నారు. గ్రామాల్లో 275 కిమీ సిసి రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యం కాగా నేటి వరకు 30 కిమీ పూర్తి చేసామన్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా 887 పనులు మంజూరు కాగా 774 ప్రగతిలో ఉన్నాయన్నారు. ఉపాధి హామీలో 50 ఎకరాలకు పైబడిన ఆయకట్టు పనులకు గాను 230 ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో 32 గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి గాను 16 చెరువుల పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 55 చెక్‌డామ్ పనులు, 139 షట్లర్ల పనులు ప్రగతిలో ఉన్నాయని కలెక్టర్ అన్నారు. అటవీ ప్రాంతం అభివృద్ధిలో భాగంగా 20 కాంటూరు ట్రెంచ్‌లు, 30 ఊరకుంటలు ప్రగతిలో ఉన్నాయన్నారు. వ్యవసాయ, ఉద్యాన వనాలు, ఎపిఎంఐపి, పశు సంవర్ధకశాఖ అనుసంధానంతో ఉపాధి హామీలో పనులు చేపట్టడం వలన అదనంగా ఆయకట్టును వినియోగంలోకి తీసుకోవడం వలన ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వరి వంటి 25వేల హెక్టార్లు, కంది 10వేలు, మినుము 9వేలు, పెసలు 1000, ఇంటర్‌క్రాప్ 10వేలు హెక్టార్లతో కలిసి 55వేల హెక్టార్ల వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకువచ్చేలా పనులు చేపడుతున్నామన్నారు. దీనివలన దాదాపు 100 కోట్ల రూపాయలు జిల్లాకు ఆదా లభిస్తుందని కలెక్టర్ అన్నారు. ప్రస్తుత 10.08 మీటర్ల భూగర్భ జలాలను వర్షాకాలం నాటికి 8 మీటర్లు, వర్షాకాలం పూర్తయ్యేనాటికి 3 మీటర్లు గ్రౌండ్ లెవల్ పెరగాలని కలెక్టర్ లక్ష్మీకాంతం స్పష్టం చేశారు.

హవాలా మోసాలపై
సిబిఐతో విచారణ జరిపించాలి
ఇంద్రకీలాద్రి, మే 18: రాష్ట్రంలో వెలుగు చూస్తున్న హవాలా మోసాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించటం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రశ్నించారు. గురువారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వెలుగు చూసిన హవాలా కుంభకోణాలపై చిత్తశుద్ధి ఉంటే సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల సహకారంతోనే హవాలా మాఫియా చెలరేగిపోతోందన్నారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపడం అంటే భారత రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి ఉల్లఘించడమేనన్నారు. ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర షోషిస్తోందన్నారు. ఈసందర్భంగా ఆయన ఆక్వాపిడుగు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కారు ఢీకొని బాలుడు మృతి
పెనమలూరు (టౌన్), మే 18: సైకిల్‌పై వెళుతున్న బాలుడిని ఓ కారు ఢీకొన్న సంఘటన గురువారం కానూరు గ్రామ పరిధిలోని పద్మనాభపురం కాలనీ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభపురం కాలనీ వద్ద నివాసముండే నిమ్మకూరి బెనర్జి కుమారుడు రోహిత్(12) మరో బాలుడితో కలిసి సైకిల్‌పై వెళుతున్నాడు. ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో రోహిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెనమలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ దామోదర్ వివరించారు.