కృష్ణ

ప్రపంచంలోనే అతి పెద్ద నీటికుంట ఏర్పాటుకు రైతుల్ని సమీకృతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 19: రైతులను సమీకృతం చేసి ప్రపంచంలోనే అతి పెద్ద నీటి కుంటను తవ్వేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం బందరు ఎంపిడివో జివి సూర్యనారాయణ బృందాన్ని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కలెక్టర్ లక్ష్మీకాంతం మండల పరిధిలోని కొత్తపూడి గ్రామ శివారు తాళ్లరేవు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న నాలుగు ఎకరాల చెరువు తవ్వకం పనులను పరిశీలించారు. మండలంలో నీటి కుంటల తవ్వకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మరింత మెరుగ్గా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రపంచంలోనే అతి పెద్ద నీటికుంటను చిత్తూరు జిల్లాలో తవ్వారన్నారు. ఐదు ఎకరాల్లో నీటికుంట తవ్వి అతి పెద్ద నీటికుంట తవ్విన జిల్లాగా పేరు తీసుకురావాలన్నారు. ఇందుకు రైతుల సమిష్ఠి కృషి అవసరమన్నారు. రైతులందరినీ సమావేశపర్చి నీటి కుంటల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటికుంట తవ్వటంతో పాటు చుట్టూ పటిష్ఠమైన గట్లు ఏర్పాటు చేసి పండ్ల మొక్కలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. చెరువు తవ్వకాల వల్ల వచ్చే మట్టిని ప్రభుత్వ, ప్రజావసరాలకు మాత్రమే వినియోగించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, రోడ్ల మెరకకు వినియోగించాలన్నారు. పక్కదారి పట్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజగోపాలరావు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్యోతిబసు, పంచాయతీ రాజ్ ఎఇ జవహర్ తదితరులు పాల్గొన్నారు.