కృష్ణ

అమిత్‌షాకు బాబు ఆతిథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 24: బిజెపిలోని ఒక వర్గానికి ఇది నిరాశాజనక వార్త. రాష్ట్రంలో బిజెపిని ఎదగనీయకుండా, తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగిస్తున్న వారి దూకుడుకు తమ పార్టీ అధినేత అమిత్‌షా కళ్లెం వేస్తారని ఆశించిన బిజెపిలోని ఒక వర్గం నాయకులకు, అదే అమిత్‌షాకు టిడిపి అధినేత, సీఎం చంద్రబాబునాయుడు విందు ఇవ్వనున్నారన్న వార్త మింగుడు పడకుండా ఉంది. గురువారం ప్రారంభమయ్యే కలెక్టర్ల సదస్సు లంచ్ బ్రేక్‌లో చంద్రబాబునాయుడు తన నివాసంలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్‌లకు విందు భోజనం పెట్టనున్నారు. హైదరాబాద్ నుంచి అమిత్‌షా, బాబు కలసే విజయవాడ వస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే బాబు తమ పార్టీ అధ్యక్షుడితో హైదరాబాద్ నుంచి కలసి రావడమే కాకుండా, ఆయన ఇంట్లో విందు కూడా ఇస్తారన్న సమాచారం నిజమా.. కాదా.. అని చాలామంది బిజెపి నేతలు మీడియా ప్రతినిధుల వద్ద ఆరా తీయడం ప్రస్తావనార్హం. గురువారం సాయంత్రం విజయవాడలో జరిగే బిజెపి మహాసమ్మేళనంలో రాష్ట్ర పార్టీ భవిష్యత్తుకు సంబంధించి అమిత్‌షా ఒక స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందులో ముఖ్యంగా టిడిపితో పొత్తు, తాను గతంలో పిలుపు ఇచ్చినట్లు అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ ముఖ్యమంత్రులు ఉండాలన్న సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా గుర్తు చేస్తారా.. లేదా.. అని బిజెపిలోని ఒక వర్గం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అదే అమిత్‌షా బాబు ఇంట్లో విందుకు వెళుతున్నారని తెలియడంతో ఆ వర్గాలు నీరసపడ్డాయి.