కృష్ణ

రోగుల మేలు కోసమే రోజుకో రంగు బెడ్ షీట్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇకపై రోజుకో రంగు బెడ్ షీట్ మార్చనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన వెలగపూడి సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం డిఎంఏ ఆసుపత్రుల్లోని 13,200 బెడ్ల మీద రోజూ దుప్పట్లు, బెడ్ షీట్లు మార్చునున్నట్టు తెలిపారు. ఏడు రోజులకు ఏడు రంగుల దుప్పట్లు ఉపయోగించనున్నామన్నారు. ఆయా వార్డుల్లో ఏఏ రోజు ఏఏ రంగు దుప్పటి ఉపయోగించేది బెడ్ షీట్ల మీద రాస్తామన్నారు. డిఎంఏ ఆసుపత్రుల్లో కాకుండా ప్రభుత్వ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా దుప్పట్లు మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి తెలిపారు. ఎలాంటి ఇనె్ఫక్షన్లు రాకుండా ప్రతి వంద బెడ్లకి 250 బెడ్ షీట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. వినియోగంపై కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక రోగి రోజుకు రెండున్నర పర్యాయాలు దుప్పట్లు మార్చగలిగే అవకాశం అందుబాటులో ఉంచుతున్నామని, మార్చగలిగే అవకాశం కలుగుతుందన్నారు. తొలి విడతగా 13,200 పడకలకు దుప్పట్లు అందిస్తున్నామని, దీనికి రూ.10 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. రెండోదశలో మరో 12,000 పడకలకు దుప్పట్లు అందజేస్తామన్నారు. రోజుకో రంగు బోర్డర్‌తో వున్న దుప్పటి చొప్పున ఏడు రంగుల బోర్డర్లు ఉన్న దుప్పట్లను ఏడు రోజులు వేస్తారని చెప్పారు. ఏ రోజు దుప్పటి మార్చకపోయినా రోగులు అక్కడి సిబ్బందిని ప్రశ్నించవచ్చునని, నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. దుప్పటి మొత్తం నాణ్యత గల లెనిన్ క్లాత్ మెటీరియల్‌తో తయారు చేసినదని, ఒక్కొక్క దుప్పటిని 60 ఉతుకుల తరువాత మార్చి తీసివేస్తారని తెలిపారు. సోడియం హైపో క్లోరైడ్‌తో ఉతకడం వల్ల రోగికి ఎటువంటి ఇనె్ఫక్షన్లు సోకే అవకాశం వుండదని చెప్పారు. ఏటా పాత దుప్పట్లను పారేసి కొత్త దుప్పట్లను ఉపయోగిస్తారని తెలిపారు. దీన్ని పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో అమలు చేస్తామన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రికి సంబంధించి డిజైన్లు ఇప్పటికే సిద్ధం చేశామని, స్విమ్స్ డైరెక్టర్, ఉపకులపతిని దీనికి సలహాదారుగా నియమించామని, నెల రోజుల్లో టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశాఖలో బదిలీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరగలేదని మంత్రి తెలిపారు. ఏపిపిఎస్సీ ద్వారా 218 మంది డాక్టర్ల నియామకం చేపట్టనున్నామన్నారు. ఇప్పటికే బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఎంపి నిధులను రాష్ట్రానికి కేటాయించారని ఈ నిధులతో 13 జిల్లాలకు రూ. 4.16 కోట్లతో 13 లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లను ఇచ్చారన్నారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విజయవాడ విమానాశ్రయం దగ్గర వీటిని ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు.