కృష్ణ

అపజయం అంగీకరించకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: చదువుకోవాలన్న తపన ఉండి, ప్రతిభ చూపే విద్యార్థులకు తమ ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని, అలాంటి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇంటర్మీడియెట్, ఎంసెట్‌లలో టాప్ ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చి గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను, లక్ష్యాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు అపజయాన్ని ఎప్పుడూ అంగీకరించకూడదని, విజయాన్ని ఎలా సాధించాలో నేర్చుకోవాలన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ ఉన్న కొద్దిపాటి సదుపాయాలతోనే అనుకున్న లక్ష్యాలను సాధించి, తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన విద్యార్థుల్ని సిఎం అభినందించారు. ఒక మంచి ఆలోచన ప్రపంచానే్న మారుస్తుందని, అలాంటి ఆలోచనలు చేసే వాళ్లకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు. పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాకూడదని, కష్టపడి చదివి, ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఉన్నత చదువులకు సమాజ సేవ, సామాజిక బాధ్యత పట్ల లక్ష్యాలు ఉండటం సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రానికి పలు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని, వీటిలో 1,66,147 మంది విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించనున్నాయని చెప్పారు. ఈ విశ్వ విద్యాలయాలు మొత్తం రూ. 16వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నం భావితరాల కోసమేనన్నారు. నాలెడ్జ్ ఎకాడమీకి ప్రాధాన్యం పెరిగిందని, విద్యార్థులు కూడా ఆ దిశగా ఆలోచించాలని కోరారు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలకు ఎంత ఆస్తి ఇచ్చామని ఆలోచించకుండా, వారికి ఎంత మంచి చదువు చెప్పించామన్నది గుర్తించాలన్నారు. ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెళ్ల సత్య, గూగుల్ సీఈఓ సుందర పిచాయ్‌ల వేతనం ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఉందని, వారు చదువుకోబట్టే ఆ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫిన్‌టెక్ రంగాలకు మంచి భవిష్యత్ ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి రాష్ట్రానికి రానున్న ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటి - తిరుపతి, నిట్ - తాడేపల్లి, ఐఎఎమ్ - విశాఖ, త్రిబుల్ ఐటి - కర్నూలు, సెంట్రల్ యూనివర్శిటీ - అనంతపురం, పెట్రోలియం వర్శిటీ - విశాఖ, స్పోర్ట్స్ - అమరావతి, లాజిస్టిక్ యూనివర్శిటీ - కాకినాడ వస్తున్నాయన్నారు.
విద్యకు బడ్జెట్‌లో మొత్తం రూ. 22 వేల కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థులకు రూ. 3వేల కోట్లు అదనంగా ఉపకార వేతనాలు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైన అయోవా సంస్థలు వస్తున్నాయన్నారు. ఈ సంస్థ ఒక పెద్ద సీడ్ పార్క్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. సాంకేతిక రంగంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. టెస్లా సంస్థ ఇప్పుడు అంతరిక్షంలోకి ప్రయోగించిన రాకెట్లు తిరిగి ప్రయోగించిన ప్రాంతంలోనే సురక్షితంగా దిగేలా ప్రయోగం చేస్తున్నారని, ఈ తరహా ప్రయోగం ప్రపంచంలోనే మొదటిది కానుందన్నారు. ఆ సంస్థ నాసాతో కలిసి మార్స్ గ్రహం పైన మానవులు నివాసం ఉండేలా అక్కడికి మనుషులను పంపించే ప్రయోగం చేస్తోందని వివరించారు. రాష్ట్రంలోనే విద్యావిధానంలో పలు మార్పులు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కొన్ని విద్యా సంస్థల్లో ప్రమాణాలు పాటించడం లేదని అలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఇప్పటికే అలాంటి 240 జూనియర్ కళాశాలలను రద్దు చేశామని, మరో 804 కళాశాలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మొత్తం 158 మంది విద్యార్థులు హాజరయ్యారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపిసిలో మొదటి రాంక్ సాధించిన షర్మిల మాట్లాడుతూ సిఎంని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తనకు బిట్స్ పిలానీలో చదువుకోవాలని ఉందని, తమది పేద కుటుంబమని చదువుకు సాయం చేయాలని కోరారు. దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ ఆమె చదువుకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అలాగే బైసిపిలో మొదటి ర్యాంకర్ ఆలపాటి నైమిశ, సీఈసి మొదటి ర్యాంకర్ అబ్దుల్ ఖయ్యుం, జేఈఈ ర్యాంకర్ ప్రకాష్‌రెడ్డి, సీఈసీ రెండో ర్యాంకర్ పల్లవి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర కళాశాల విద్య, సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఉన్నత విద్యామండలి విజయ్‌రాజ్, సాంకేతిక విద్య కమిషనర్ ఉదయలక్ష్మి, ఉన్నతాధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పరిశుభ్రతతోనే ఆరోగ్యం, ఆథాయం, ఆనందం
* పర్యటకమూ పెరుగుతుంది
* పోటీలు పెట్టి అవార్డులివ్వండి
* స్వచ్ఛాంధ్రప్రదేశ్ పురోగతిపై టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
అమరావతి, మే 24: పరిశుభ్రతతోనే ఆరోగ్యం, ఆదాయం, ఆనందం సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాల పురోగతిపై బుధవారం తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాల అధికారులతో మాట్లాడారు. ఆరోగ్యం బాగుంటే ఆదాయం పెరుగుతుందని, ఆదాయం పెరిగితే ఆనందం వస్తుందని, ఆహ్లాదం ఏర్పడుతుందని, ఇదంతా పరిశుభ్రతతోనే సాధ్యం అవుతాయని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారితే పర్యాటకం కూడా పెరుగుతుందన్నారు. అందువల్ల రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. పరిశుభ్రత ప్రతి వ్యక్తి బాధ్యత కావాలన్నారు. మన సంస్కృతిలో పరిశుభ్రత ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. పరిశుభ్రత మన వారసత్వ సంపద కావాలని, జీవితంలో భాగం కావాలని, అప్పుడే అనుకున్న ఫలితాలను సాధించగలమన్నారు. దేవుడిపై భక్తి ప్రపత్తులు చూపినట్లే పరిసరాల పరిశుభ్రతపై కూడా పూర్తి శ్రద్ధాసక్తులు చూపాలన్నారు. మన ఇల్లు ఎంత శుభ్రతగా ఉందో, మన వీధి, గ్రామం - వార్డు అంతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యకర జీవనం గడపగలమన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడాలని ముఖ్యమంత్రి సూచించారు. చెత్తనుంచి సేంద్రియ ఎరువు తయారీ నిజంగా అద్భుత ప్రక్రియ అంటూ తూర్పుగోదావరి జిల్లాలో ఎంపి తోట నరసింహం దత్తత గ్రామం బూరుగుపూడి అందుకు నిదర్శనం అన్నారు. ఆ గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ద్వారా ప్రస్తుతం నెలకు 10 టన్నుల సేంద్రి ఎరువు తయారవుతోందని, దీనిని 30 టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎంపి నరసింహం వివరించారు. గ్రామంలోని వ్యర్థాలకు తోడుగా చెరువులోని గుర్రపుడెక్క ఆకును కూడా వినియోగించి ఈ ప్లాంట్‌లో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నట్టు ఆయన వివరించారు. వివిధ జిల్లాల నుంచి అనేక బృందాలు గ్రామాన్ని సందర్శించి ప్లాంటును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో ఈ నమూనా చేపడితే అటు పరిశుభ్రతతో పాటుగా, ఇటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఈ మోడల్‌ను అధ్యయనం చేయాలని అధికారులను కోరారు.
పాఠశాలలు, ఆసుపత్రులు, థియేటర్లు, ప్రభుత్వ కార్యాలయాల మధ్య పరిశుభ్రతలో పోటీలు పెట్టి అవార్డులిచ్చి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ ఏడాది చేపట్టిన 15 ఆసుపత్రుల సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 2018 కల్లా మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంద్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా గుర్తు చేశారు. హుద్‌హుద్‌లో విశాఖలో అన్ని చెట్లు నేలకూలిన విషయం ప్రస్తావించి అందరి కృషితో ఏడాదిలో మళ్లీ హరిత విశాఖగా మార్చడం వెనుక అక్కడి ప్రజల కృషి, అధికారుల చొరవ కారణమని ముఖ్యమంత్రి అన్నారు. ఆ స్ఫూర్తి, పట్టుదల, ఉత్సాహం అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో కనిపించాలని ఆకాంక్షించారు. అందరూ చిత్తశుద్ధితో కృషి చేస్తే రెండేళ్లలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధ్యమేనన్నారు.
బిడ్డలకు బాల్యం నుంచి, విద్యార్థి దశలోనే పరిశుభ్రత అలవర్చాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో, పాఠశాలల్లో పరిశుభ్రత అనేది కూడా ఆటపాటల్లో ఒకటిగా చేసి చేతులు శుభ్రం చేసుకోవడం, ఆహార అలవాట్లు (హ్యాండ్ వాష్, ఫుడ్ హాబిట్స్...) తదితర అంశాలు విద్యార్థి దశలోనే అలవర్చుకునేలా చూడాలన్నారు.
స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ చేపట్టిన చర్యల గురించి ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ సిఎల్ వెంకట్రావు వివరించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపట్టిన పనుల పురోగతిని సిఈవో మురళీధర్ రెడ్డి ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో పంచాయతీ రాజ్ కమిషనర్ రామాంజనేయులు, పురపాలక శాఖ కార్యదర్శి కరికాల వలవన్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.