కృష్ణ

గుణదలమాత మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఫిబ్రవరి 1: దక్షిణ భారత దేశంలో రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రమైన గుణదల మాత మహోత్సవాలు ఈ నెల 9, 10, 11 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్నట్లు పుణ్యక్షేత్రం రెక్టర్ ఎం చిన్నప్ప తెలిపారు. సోమవారం ఉదయం గుణదలలోని సోషల్ సర్వీస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహోత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఇప్పటికే విస్తృత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ కతోలిక పీఠం నూతన బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు మాట్లాడుతూ విజయవాడ కతోలిక పీఠానికి తనను పోప్ ఫ్రాన్సిస్ వారు బిషప్‌గా నియమించటంతో విజయవాడ మేత్రాసనంలో పేదలకు సేవలందించే భాగ్యం కలిగిందన్నారు. దేవుని మీద సంపూర్ణమైన నమ్మకంతో ప్రభువైన క్రీస్తు నిరుపేదలకు, దీనార్తులకు జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎలా శ్రమించారో అదేవిధంగా తాను కూడా వారి అభివృద్ధికి నిత్యం శ్రమించేలా ఆత్మబలాన్ని ప్రసాదించమని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లుగా ప్రపంచంలో కేథలిక్ చర్చి సేలదించటంలో ముందుభాగాన నిలుస్తుందన్నారు. వైద్య, విద్య రంగాల్లో క్రిస్టియన్ మిషనరీలు ఎనలేని సేవలు అందిస్తున్నాయన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి తాము భాగస్వాములై కృషి చేస్తామని చెప్పారు. విజయవాడ కతోలిక పీఠం అపోస్థోలిక పాలనాధికారి, ఇన్‌చార్జ్ బిషప్ గోవిందు జోజి మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం 4గంటలకు విజయవాడ కతోలిక పీఠానికి నూతన బిషప్‌గా ఎన్నికైన తెలగతోటి జోసఫ్ రాజారావు అభిషేక ప్రతిష్ఠోత్సవానికి పోప్ వాటికన్ రాయబారి సాల్వేతోరే పెనాకియోతో పాటు ఆర్చ్ బిషప్‌లు, ఆంధ్రా, తెలంగాణ బిషప్‌లు హాజరవుతున్నారని తెలిపారు. విలేఖర్ల సమావేశంలో ఎస్‌ఎస్‌సి సెంటర్ డైరెక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, ఛాన్స్‌లర్ జె జాన్‌రాజు, ఫాదర్ ఎన్ డేవిడ్‌రాజు, ఫాదర్ టి అంథోని, తదితరులు పాల్గొన్నారు.