కృష్ణ

శిక్షణ కేంద్రాలు సద్వినియోగం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో విద్యార్థులతో స్వర్ణ్భారత్ స్ఫూర్తిప్రదాత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విద్యార్థులను కలిసి సంభాషించారు. కోర్సుల వివరాలు, వారి అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. తరగతికి, ప్రతి విభాగానికి స్వయంగా వెళ్లి ముఖాముఖి ద్వారా అనుభవాలను, కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు. కౌశల్య నైపుణ్య యోజన ద్వారా ఉపాధి, నిరుద్యోగ పరిష్కార మార్గాలు లభిస్తున్నాయన్నారు. స్వర్ణ భారత్ లాంటి సంస్థలను ప్రతి జిల్లాలో ప్రారంభించాలని, ప్రారంభిస్తే గ్రామాల్లో సమూల మార్పులు వస్తాయన్నారు. ఆంధ్రాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు స్వర్ణ్భారత్ ట్రస్ట్, కెఎల్ యూనివర్సిటీ జిఎంఆర్ ఫౌండేషన్, చేస్తున్న సేవలను ప్రశంసించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం రెండూ కూడా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించటం సంతోషకరమని, పైగా నైపుణ్య వికాసం కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయటమే కాకుండా ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటం మోదీ, ఎన్టీఏకి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు, పేద కుటుంబాల్లోని విద్యార్థులకు స్వర్ణ్భారత్ శిక్షణా కేంద్రం అడగకుండా లభించిన వరం లాంటిదని దాన్ని సద్వినియోగపరచుకోవాలని విద్యార్థులతో అన్నారు. అన్నీ ప్రభుత్వమే చేయాలనుకోకుండా ప్రైవేట్ రంగం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని, దాంతోబాటు స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకోవాలని స్వర్ణ్భారత్‌ని అందరూ ఒక మోడల్‌లా తీసుకుని తమ తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. విజయవాడకు చెందిన సిఏ శిక్షణా సంస్థ సూపర్‌విజ్ నిర్వాహకులు పంపిన 6 అడుగుల కేక్‌ని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చేతుల మీదుగా కట్ చేయించారు. యూఎన్ హెబిటేట్ గవర్నింగ్ కౌన్సిల్ అధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంగా వెంకయ్యనాయుడు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కేక్‌ను రూపొందించారు. దీన్ని ట్రస్ట్‌లోని విద్యార్థులందరికీ పంపిణీ చేశారు.