కృష్ణ

అథ్భుత చట్టం జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యాపారులు, ప్రభుత్వానికి ప్రయోజనకరమైన అద్భుత చట్టమని, దీనిపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాణిజ్యపన్నులశాఖ డిప్యూటీ కమిషనర్లు వై.కిరణ్‌కుమార్, వి.రఘునాథ్ అన్నారు. జూలై 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తున్నందున అందుకు అందరూ సమాయత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఏపిఎఫ్‌సిసిఐ) ఆధ్వర్యంలో విజయవాడలోని ఛాంబర్ కార్యాలయంలో శుక్రవారం జీఎస్టీపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. ఈ అవగాహన సదస్సుకు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు అధ్యక్షత వహించి మాట్లాడారు. జీఎస్టీ చట్టం వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ట్రేడ్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని, దానిలో భాగంగా ఏపీ ట్రేడ్ హబ్ కంపెనీ లిమిటెడ్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసి రూ.2500 కోట్లతో ఏర్పాటుకు ముందుకు సాగుతున్నామన్నారు. వ్యాపారులందరూ దీనిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ వై.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ వ్యాపారులందరూ జీఎస్టీ పోర్టల్‌ను తప్పక చూసి, అవగాహన కల్పించుకోవాలన్నారు. జీఎస్టీ అమలుకు సంబంధించి డీలర్ డాష్‌బోర్డును దానిలో పొందపర్చారన్నారు. వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ రఘునాథ్ మాట్లాడుతూ జీఎస్టీ అమలుతో వ్యాపారులకు ఎలాంటి వేధింపులు ఉండవని, చెక్‌పోస్టుల్లో తనిఖీలు ఉండవన్నారు. వ్యాపారులు ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను తప్పక అప్‌లోడ్ చేయాల్సి ఉందన్నారు. అసిస్టెంట్ కమిషనర్ ప్రభాకరమూర్తి జీఎస్టీ చట్టంలోని లాభనష్టాలను, వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జీఎస్టీలో సప్లయిర్ (సరఫరాదారు), రిసీపెంట్ (పొందే వ్యక్తి) ఉంటారన్నారు. ఒకే పాన్‌కు ఒకే రిజిస్ట్రేషన్ ఉంటుందన్నారు. జీఎస్టీ అమలుతో వ్యాపారులకు ఎలాంటి ప్రతిబంధకాలు ఉండవన్నారు. జీఎస్టీ మైగ్రేషన్‌కు జూన్ 1 నుంచి 15 వరకు మరో అవకాశం కల్పించారని, వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సదస్సులో వాణిజ్యపన్నులశాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్, వాణిజ్యపన్నులశాఖ అధికారి హర్షవర్థన్, తదితరులు జీఎస్టీలోని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ముందుగా రామ్‌కుమార్ అతిథులను సభావేదికపైకి ఆహ్వానం పలుకగా, ఛాంబర్ నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సదస్సులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపార సంస్థల ప్రముఖులు, ఫెడరేషన్ నేతలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.